తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Budget 2023-24: 5g యాప్స్ డెవలప్ చేయడానికి ప్రత్యేకంగా 100 ల్యాబ్స్

Budget 2023-24: 5G యాప్స్ డెవలప్ చేయడానికి ప్రత్యేకంగా 100 ల్యాబ్స్

HT Telugu Desk HT Telugu

01 February 2023, 20:30 IST

  • Allocations for education sector: విద్యారంగానికి కేంద్ర బడ్జెట్ లో రూ. 1,12,89 కోట్లను కేటాయించారు. విద్యారంగానికి ఇంత భారీ మొత్తంలో కేటాయింపులు లభించడం ఇదే ప్రథమం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Allocations for education sector: కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి పెద్ద పీట వేశారు. గతంలో ఎన్నడూ లేనంత భారీ మొత్తంలో ఈ రంగానికి కేటాయింపులు జరిపారు. 2023-24 సంవత్సరానికి గానూ రూ. 1,12,89 కోట్లను కేటాయించారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

centres of excellence సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లు

కృత్రిమ మేథ (artificial intelligence) పై పరిశోధనలు చేయడానికి దేశవ్యాప్తంగా మూడు నైపుణ్య కేంద్రాలను (centres of excellence) ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. మూడు అత్యుత్తమ విద్యా కేంద్రాలలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, దేశవ్యాప్తంగా మొత్తం 100 అత్యుత్తమ ఇంజినీరింగ్ కాలేజీల్లో 5 జీ అప్లికేషన్లను (applications using 5G services) డెపలప్ చేయడానికి ప్రత్యేకంగా లేబోరేటరీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకుగానూ, నియంత్రణ సంస్థలు, ఇతర అథారిటీలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలతో కొలాబరేట్ అవుతామన్నారు. వాటిలో స్మార్ట్ క్లాస్ రూమ్స్, ప్రెసిషన్ ఫార్మింగ్, ఇంటలిజెంట్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్, హెల్త్ కేర్ మొదలైన అంశాల్లో 5 జీ టెక్నాలజీని ఉపయోగించి యాప్స్ డెవలప్ చేస్తారని వివరించారు.

Digital library: డిజిటల్ లైబ్రరీ

2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2023-24లో విద్యారంగానికి రూ. 13,018 కోట్లను ఎక్కువగా కేటాయించారు. 2023-24 కు కేటాయించిన రూ. 1,12,89 కోట్లలో రూ. 38,953 కోట్లను National Education Mission కోసం ఖర్చు చేస్తారు. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధ్యాయుల శిక్షణను మరింత ఆధునీకరిస్తామని, అందుకు కొత్త కరిక్యులం రూపొందిస్తామని తెలిపారు. కరోనా కారణంగా కోల్పోయిన స్టడీస్ ను పొందడానికి ప్రత్యేకంగా డిజిటల్ లైబ్రరీ (digital library) లను ఏర్పాటు చేస్తామన్నారు. అందులో అన్ని భాషల్లో, అన్ని సబ్జెక్టులు, ఇతర రంగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. గ్రామాలు, పంచాయితీల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తామన్నారు.

టాపిక్