తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Biden Xi : 'నిప్పుతో ఆడుకుంటే నాశనమైపోతారు'- బైడెన్​కు జిన్​పింగ్​ స్ట్రాంగ్​ వార్నింగ్​!

Biden Xi : 'నిప్పుతో ఆడుకుంటే నాశనమైపోతారు'- బైడెన్​కు జిన్​పింగ్​ స్ట్రాంగ్​ వార్నింగ్​!

Sharath Chitturi HT Telugu

29 July 2022, 7:05 IST

  • Biden Xi : బైడెన్​- జిన్​పింగ్​ మధ్య ఫోన్​ సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. తైవాన్​ విషయంలో బైడెన్​కు జిన్​పింగ్​ వార్నింగ్​ ఇచ్చినట్టు తెలుస్తోంద.

బైడెన్​- జిన్​పింగ్​
బైడెన్​- జిన్​పింగ్​ (AFP)

బైడెన్​- జిన్​పింగ్​

Biden Xi : తైవాన్​ వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​- చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​లు ప్రత్యక్షంగా భేటీ అయ్యేందుకు నిర్ణయించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఫోన్​ సంభాషణలో.. ఇరువురు అధ్యక్షులు ఈ మేరకు అంగీకరించారు.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

యూఎస్​ ప్రతినిధుల సభ స్పీకర్​ నాన్సి పెలోసి.. వచ్చే నెలలో తైవాన్​ పర్యటనకు వెళ్లనున్నారు. అదే జరిగితే.. తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనా ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ తరుణంలో బైడెన్​- జిన్​పింగ్​ మధ్య సంభాషణ జరగడం, సమీప భవిష్యత్తులో కలిసేందుకు ఇద్దరు అంగీకరించడం సర్వత్రా చర్చలకు దారితీసింది.

"బైడెన్​- జిన్​పింగ్​ మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయి. విభేదాలను పక్కనపెట్టి, సంయుక్త ప్రయోజనాల కోసం కలిసి పనిచేసే దిశగా ఇరు దేశాధ్యక్షులు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యక్ష సమావేశం గురించి చర్చించారు," అని అధికారులు మీడియాకు తెలిపారు.

America China relation : అమెరికా- చైనా సంబంధాలు.. ఇరు దేశాలకే కాకుండా, ప్రపంచానికి ఎంతో ఉపయోగకరమని జిన్​పింగ్​కు బైడెన్​ చెప్పారు. వాతావరణ మార్పులు, ఆరోగ్య భద్రత, నార్కొటిక్స్​ వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

చైనాలో తప్పుడు ఆరోపణలతో అరెస్ట్​ అయిన అమెరికన్ల విషయం, ఆ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని సైతం జిన్​పింగ్​తో సంభాషణలో బైడెన్​ లేవనెత్తారు.

కాగా.. తైవాన్​ వివాదంపై అమెరికాకు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చినట్టు తెలుస్తోంది.

"వన్​ చైనా విధానానికి అమెరికా కట్టుబడి ఉండాలి. తైవాన్​ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతివ్వకూడదు. నిప్పుతో ఆడుకుంటే.. నాశనమైపోతారు. ఈ విషయంలో అమెరికా స్పష్టంగా ఉండాలి. వన్​ చైనా విధానంపైనే అమెరికా- చైనాల బంధానికి పునాది పడింది. దానినే కొనసాగించాలి," అని ఇరు దేశాధ్యక్షుల చర్చల్లో జిన్​పింగ్​ వ్యాఖ్యానించినట్టు చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన చేసింది.

China Taiwan : తైవాన్​ తమ దేశం అంతర్భాగమని చైనా చెబుతోంది. కానీ తమది స్వతంత్ర దేశమని తైవాన్​ అంటోంది. తైవాన్​కు అమెరికా మద్దతుగా నిలుస్తోంది! 'ఎవరు మద్దతిచ్చినా.. తైవాన్​ను తమ భూభాగంలో కలిపేసుకుంటాం,' అని చైనా తేల్చిచెబుతోంది. ఈ క్రమంలోనే చైనా- తైవాన్​- అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం.. జిన్​పింగ్​తో బైడెన్​ చర్చలు జరపడం ఇది ఐదోసారి. చివరిగా.. మార్చ్​ నెలలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఇద్దరు నేతలు చర్చలు జరిపారు.

టాపిక్