తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hubble Telescope : నీరు ఉన్న రెండు గ్రహాలను గుర్తించిన శాస్త్రవేత్తలు!

Hubble telescope : నీరు ఉన్న రెండు గ్రహాలను గుర్తించిన శాస్త్రవేత్తలు!

19 December 2022, 13:45 IST

    • Hubble telescope new discovery : భూమికి 218 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రెండు గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రెండింట్లో నీరు అధిక మొత్తంలో ఉందన్నారు. వీటిని హబుల్​ టెలిస్కోప్​ ఆధారంగా ఆవిష్కరించినట్టు స్పష్టం చేశారు.
నీరు ఉన్న రెండు గ్రహాలను గుర్తించిన శాస్త్రవేత్తలు!
నీరు ఉన్న రెండు గ్రహాలను గుర్తించిన శాస్త్రవేత్తలు! (AFP/ File)

నీరు ఉన్న రెండు గ్రహాలను గుర్తించిన శాస్త్రవేత్తలు!

Hubble telescope new discovery : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ ద్వారా రెండు కొత్త గ్రహాలను ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు. నీటి జాడలున్న జంట గ్రహాలను ఈ స్పేస్ టెలిస్కోప్ సాయంతో గుర్తించారు. ఇవి ఓ నక్షత్ర మండలంలో భాగంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

218 కాంతి సంవత్సరాల దూరంలో..

యూనివర్సిటీ ఆఫ్​ మాంట్రియల్​లో ఇన్​స్టిట్యూట్​ ఫర్​ రీసెర్చ్​ ఆన్​ ఎక్సోప్లానెట్స్​ విభాగానికి చెందిన ఓ బృందం.. ఈ రెండు ఎక్సోప్లానెట్​లను గుర్తించింది. ఈ బృందానికి కరోలీన్​ పియాలేట్​ అధ్యక్షత వహించారు. ఇందుకు సంబంధించిన స్టడీ జర్నల్​ నేచర్​ ఆస్ట్రానమీలో ప్రచురితమైంది.

NASA Hubble Telescope : ఈ రెండు గ్రహాలను కెప్లర్​-138సీ, కెప్లర్​ 138డీగా పిలుస్తున్నారు. హబుల్​ టెలిస్కోప్​తో పాటు స్పిట్జర్​ స్పేస్​ టెలిస్కోప్స్​ను ఉపయోగించి.. ఈ రెండు గ్రహాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ రెండు గ్రహాల్లో ఎక్కువగా నీరే ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెండు గ్రహాలు భూమి పరిమాణం కన్నా ఒకటిన్నర రెట్లు పెద్దగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇవి ఓ ఎర్రని మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు వివరించారు.

అయితే.. ఈ రెండు గ్రహాలు.. లిరా నక్షత్ర మండలంలో ఉన్నట్టు, అది భూమి నుంచి 218 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

2 new planets with water found : "కెప్లర్​ స్పేస్​ టెలిస్కోప్​తో గతంలో కెప్లర్​ 138బీ గ్రహాన్ని నాసా గుర్తించింది. ఇప్పుడు గుర్తించిన రెండు గ్రహాలు ఆ గ్రహంతో పోలి ఉన్నాయి," అని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

"జూపిటర్​, శాటర్న్​ చుట్టు యూరోపా, ఎన్సేలాడుస్​ వంటి మూన్స్​ తిరుగుతూ ఉంటాయి. వాటిల్లో ఎక్కవ శాతం నిరే ఉంటుంది. ఈ రెండు గ్రహాలు కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ నక్షత్ర మండలిలో ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి. మంచు కాకుండా వీటిల్లో నీరు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది." అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

"కెప్లర్​- 138డీలో ఉష్ణోగ్రతలు.. వాటర్​ బాయిలింగ్​ పాయింట్​ కన్నా ఎక్కువగా ఉండొచ్చు. ఈ గ్రహంలో ఆవిరితో కూడుకున్న వాతావరణం ఉంటుందని మేము భావిస్తున్నాము. ఆవిరి వాతావరణం కింద లిక్విడ్​ వాటర్​ ఉండొచ్చు. అది హై ప్రైజర్​లో ఉండే అవకాశం ఉంది. అది కాకపోతే.. సూపర్​క్రికిటల్​ ఫ్లూయిడ్​ దశలోనైనా నీరు నిక్షిప్తం అయ్యి ఉండొచ్చు," అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ గ్రహాలపై మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని, ఆ తర్వాత మరిన్ని వివరాలను బయటపెడతామని అన్నారు.