తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Teacher Refuses To Hoist Flag: ``జెండా వంద‌నం చేయ‌ను.. మా మతం ఒప్పుకోదు``

Teacher refuses to hoist flag: ``జెండా వంద‌నం చేయ‌ను.. మా మతం ఒప్పుకోదు``

HT Telugu Desk HT Telugu

17 August 2022, 20:10 IST

    • Teacher refuses to hoist flag: ప్ర‌భుత్వ పాఠ‌శాల ప్ర‌ధాన ఉపాధ్యాయురాలు స్వతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా జెండా వంద‌నం చేయ‌డానికి నిరాక‌రించిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులో జ‌రిగింది. త‌మ మ‌త విశ్వాసాలు అందుకు ఒప్పుకోవ‌ని, దేవుడికి త‌ప్ప మరెవ‌రికీ తాము వంద‌నం చేయ‌బోమ‌ని ఆమె వివ‌ర‌ణ ఇచ్చారు.
ప్ర‌ధాన ఉపాధ్యాయురాలు త‌మిళ‌సెల్వి
ప్ర‌ధాన ఉపాధ్యాయురాలు త‌మిళ‌సెల్వి

ప్ర‌ధాన ఉపాధ్యాయురాలు త‌మిళ‌సెల్వి

Teacher refuses to hoist flag: స్వ‌తంత్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్బంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ జ‌రుపుకుంటున్నాం. ఆగ‌స్ట్ 15న మునుపెన్న‌డు లేనంత ఆనందోత్సాహాల‌తో గ్రామ‌గ్రామానా, వాడ‌వాడ‌లా జెండా పండుగ చేసుకున్నాం. అయితే, త‌మిళ‌నాడులోని ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల ప్ర‌ధాన ఉపాధ్యాయురాలు మాత్రం త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌రేయ‌బోన‌ని, జెండాకు సెల్యూట్ చేయ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Teacher refuses to hoist flag: డీఈఓకు ఫిర్యాదు..

జెండా వంద‌నం చేయ‌బోన‌ని చెబుతూ ఆ ప్ర‌ధానోపాధ్యాయురాలు పంపిన వీడియో సందేశం వైర‌ల్ అయింది. దాంతో, ఆమెపై జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురి జిల్లాలోని ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో త‌మిళ‌సెల్వి ప్ర‌ధాన ఉపాధ్యాయురాలిగా ప‌ని చేస్తున్నారు. ప్ర‌ధాన ఉపాధ్యాయురాలి హోదాలో ఆమె ఆగ‌స్ట్ 15న స్కూల్‌లో జెండావంద‌నం చేయాల్సి ఉండ‌గా, సెల‌వు పెట్టి ఆ కార్య‌క్ర‌మానికి ఆమె గైర్హాజ‌ర‌య్యారు. అందుకు కార‌ణం వివ‌రిస్తూ స్టాఫ్‌కు ఆమె ఒక వీడియో సందేశం పంపారు.

Teacher refuses to hoist flag: నేను క్రిస్టియ‌న్‌ను..

తాను క్రిస్టియ‌న్‌న‌ని, దేవుడికి త‌ప్ప మ‌రెవ‌రికీ వంద‌నం చేయ‌డానికి త‌మ మ‌తం ఒప్పుకోద‌ని, అందువ‌ల్ల తాను జెండావంద‌నం చేయ‌లేన‌ని ఆమె ఆ వీడియోలో వివ‌రించారు. త‌న‌కు బ‌దులుగా అసిస్టెంట్ హెడ్‌మాస్ట‌ర్‌తో ప‌తాకావిష్క‌ర‌ణ చేయించాల‌ని సూచించారు. `నేను యాకోబా క్రిస్టియ‌న్‌ను. మేం విశ్వ‌సించే దేవుడికి త‌ప్ప మ‌రెవ‌రికీ మేం న‌మ‌స్క‌రించం. నేను మా మ‌త విశ్వాసాల‌ను పూర్తిగా అనుస‌రిస్తాను. నాకు జాతీయ ప‌తాకంపై గౌర‌వం ఉంది. జాతీయ జెండాను అవ‌మానించే ఉద్దేశం లేదు. కానీ మా మతం ఒప్పుకోదు కాబ‌ట్టి జెండా వంద‌నం చేయ‌లేను` అని త‌మిళ సెల్వి ఆ వీడియోలో వివ‌రించారు. ఈ సంవ‌త్సరం త‌మిళ‌సెల్వి రిటైర్ అవుతున్నారు. గ‌తంలో జెండా వంద‌నం చేయాల్సిన రోజుల్లో కూడా త‌మిళ‌సెల్వి సెలవు పెట్టేవార‌ని స్కూల్ స్టాఫ్ వివరించారు.