తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aadhaar Latest Security Feature: ఆధార్ కొత్త భద్రతా ఫీచర్.. మోసాల నుంచి రక్షణ

Aadhaar latest security feature: ఆధార్ కొత్త భద్రతా ఫీచర్.. మోసాల నుంచి రక్షణ

HT Telugu Desk HT Telugu

27 September 2022, 13:42 IST

  • Aadhaar latest security feature: ఆధార్‌లో మరో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ తోడైంది. మోసాల నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది.

అన్నింటికీ లింకై ఉన్న ఆధార్
అన్నింటికీ లింకై ఉన్న ఆధార్

అన్నింటికీ లింకై ఉన్న ఆధార్

Aadhaar latest security feature: మీరు ఆధార్ ద్వారా మీ వేలిముద్రలను ఉపయోగించి మీ డబ్బును విత్‌డ్రా చేస్తుంటే ఇక భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు మరో ఫీచర్‌ జోడించింది. వేలిముద్ర ఉపయోగించిన వ్యక్తి జీవించి ఉన్నారా లేదా అనే విషయాన్ని పాయింట్ ఆఫ్ సేల్ (PoS) గుర్తిస్తుంది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS)ని ఉపయోగించి 1,507 కోట్లకు పైగా బ్యాంకింగ్ లావాదేవీలు జరిగాయి. వీటిలో 7.54 లక్షల లావాదేవీలు నకిలీవని తేలింది. ఈ కొత్త ఫీచర్ ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ దుర్వినియోగాన్ని వేగంగా కనిపెడుతుంది.

మోసగాళ్లు అసలైన వినియోగదారుడి వేలిముద్ర నుంచి సిలికాన్ ప్యాడ్‌లో క్లోన్‌ను సృష్టిస్తారు. భూమి కొనుగోలు సమయంలో సంతకం చేసిన పత్రాలపై నుండి వేలి ముద్రలను దొంగిలించి నకిలీ వేలిముద్ర సృష్టిస్తారు. ఆయా వేలిముద్రలు భూ రెవెన్యూ శాఖ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి.

ఇప్పుడు UIDAI జనన, మరణ డేటాను ఆధార్‌కు లింక్ చేయాలని నిర్ణయించింది. నవజాత శిశువులకు తాత్కాలిక నంబర్ కేటాయిస్తారు. బయోమెట్రిక్ డేటా ద్వారా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మోసాలను నిరోధించేందుకు మరణ నమోదు రికార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయనున్నారు.

వినియోగదారుల మొబైల్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక పథకాలకు ఆధార్ అనుసంధానించి ఉంటుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి తమ బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్‌డేట్ చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని యూఐడీఏఐ నిర్ణయించింది. ప్రస్తుతం, ఐదు, 15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఆధార్ కోసం వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయాల్సి ఉంది.

ప్రజలు తమ బయోమెట్రిక్స్, డెమోగ్రాఫిక్స్, ఇతర డేటాను పదేళ్లకు ఒకసారి అప్‌డేట్ చేసుకునేలా ప్రోత్సహిస్తామని యూఐడీఏఐకి చెందిన ఒక అధికారి తెలిపారు. అయితే 70 ఏళ్లు దాటిన వారికి అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదు.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మేఘాలయ, నాగాలాండ్, లద్దాఖ్‌లలో కొద్ది శాతం మందిని మినహాయించి దేశంలోని వయోజనులందరినీ నమోదు చేసింది.

యూఐడీఏఐ 50,000 కంటే ఎక్కువ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లను కలిగి ఉంది. 1.5 లక్షల పోస్ట్‌మెన్‌లను వినియోగించడం ద్వారా ఆధార్ హోల్డర్‌ల మొబైల్ నెంబర్‌, చిరునామాలను అప్‌డేట్ చేయనుంది.

టాపిక్