Aadhaar biometrics updates| ప్రతీ పదేళ్లకు ఆధార్ అప్ డేట్ చేసుకోవాల్సిందే
Aadhaar biometrics updates| కనీసం ప్రతీ 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ బయోమెట్రిక్స్ ను, చిరునామా తదితర వివరాలను అప్ డేట్ చేసుకోవాలని UIDAI కోరుతోంది.

Aadhaar biometrics updates| యూజర్లు కనీసం ప్రతీ 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ బయోమెట్రిక్స్ అప్ డేట్ చేసుకోవాలని Unique Identification Authority of India (UIDAI) కోరుతోంది.
Aadhaar biometrics updates| బయోమెట్రిక్స్
ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో కనుగుడ్లు, చేతి వేళ్లు తదితర బయోమెట్రిక్స్ ను రికార్డ్ చేస్తారు. సాధారణంగా అవి మారవు కనుక వాటిని రెగ్యులర్ గా అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో కొందరి ఆధార్ బయోమెట్రిక్స్ ను స్కానింగ్ మెషీన్స్ గుర్తించలేని పరిస్థితి కూడా ఏర్పడుతోంది. చేతివేళ్లు అరిగిపోయే సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని Unique Identification Authority of India (UIDAI) చెబుతోంది. అందువల్ల కనీసం ప్రతీ 10 సంవత్సరాలకు ఒకసారి బయోమెట్రిక్స్ ను ఆధార్ ఆథరైజ్డ్ సెంటర్ కు వెళ్లి అప్ డేట్ చేసుకోవాలని కోరుతోంది.
Aadhaar biometrics updates| ప్రస్తుతం పిల్లలకు..
ఇప్పటివరకైతే, ఐదేళ్లు, 15 ఏళ్లు దాటిన పిల్లల బయోమెట్రిక్స్ ను అప్ డేట్ చేసుకోవాలన్న నిబంధన ఉంది. వయస్సుతో పాటు వారి బయోమెట్రిక్స్ లో మార్పులు వస్తాయి కనుక ఐదేళ్ల లోపు ఆధార్ పొందిన పిల్లలు ఐదేళ్లు దాటిన తరువాత ఒకసారి, 15 ఏళ్లు దాటిన తరువాత మరోసారి బయోమెట్రిక్స్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్లు దాటిన తరువాత ఆధార్ పొందిన పిల్లలు 15 ఏళ్లు వయస్సు వచ్చిన తరువాత బయోమెట్రిక్స్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై పిల్లలే కాకుండా, పెద్దలు కూడా ప్రతీ పదేళ్లకు ఒకసారి బయోమెట్రిక్స్ ను, అలాగే, వారి చిరునామా, మొబైల్ నెంబర్ తదితర వివరాలను అప్ డేట్ చేసుకోవాలని Unique Identification Authority of India (UIDAI) సూచిస్తోంది.
Aadhaar biometrics updates| దాదాపు పూర్తి..
దేశవ్యాప్తంగా ఆధార్ ఎన్ రోల్ మెంట్ సాచ్యురేషన్ స్థాయికి చేరుకుందని UIDAI వెల్లడించింది. వివిధ కారణాల వల్ల మేఘాలయ, నాగాలాండ్, లద్దాఖ్ ల్లో మాత్రమే ఈ ఎన్ రోల్ మెంట్ మందకోడి గా సాగుతోందని వివరించింది.