voter id card aadhaar link: ఓటర్ ఐడీ‌ని ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలి?-how to link voter id card with aadhaar card number know step by step complete process here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  How To Link Voter Id Card With Aadhaar Card Number Know Step By Step Complete Process Here

voter id card aadhaar link: ఓటర్ ఐడీ‌ని ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలి?

Praveen Kumar Lenkala HT Telugu
Aug 30, 2022 04:37 PM IST

voter id card aadhaar link: ఓటర్ ఐడీ కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలో స్టెప్ బై స్టెప్ సమగ్ర వివరాలు ఈ కథనంలో అందించాం.

ఓటర్లు తమ ఓటరు ఐడీ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచిస్తోంది.
ఓటర్లు తమ ఓటరు ఐడీ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచిస్తోంది. (HT_PRINT)

voter id card aadhaar link: ఓటర్ ఐడీ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటర్ల గుర్తింపును ధ్రువీకరించడం, ఒకరికి ఒకే చోట ఓటు హక్కు ఉండేలా చూడడం కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

voter id card aadhaar link: ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియను కేంద్రం ఎన్నికల సంఘం ఇటీవలే ప్రారంభించింది.

ఓటర్ ఐడీని లేదా ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్)‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి కాదు. ఆధార్ నెంబర్ సమర్పించని పక్షంలో ఓటరు పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

voter id card aadhaar link: ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానించడం ఎలా?

ఓటర్ ఐడీని ఆధార్‌తో లింక్ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం 5 దశలను సూచించింది.

Step 1: ఎపిక్ (ఈపీఐసీ) ఓటర్ ఐడీ కార్డు ఉన్న ఓటరు ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లయితే యాప్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

Step 2: ఇన్‌స్టలేషన్ పూర్తయిన తరువాత ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఓపెన్ చేసి ‘నేను అంగీకరిస్తున్నాను..’ అన్న సూచనపై క్లిక్ చేయాలి.

Step 3: తరువాత ‘నెక్స్ట్’ క్లిక్ చేయాలి. అక్కడ ఉన్న ఆప్షన్లలో మొదటి ఆప్షన్ ‘ఓటర్ రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేయాలి.

Step 4: ఆ తరువాత ఫారం 6 బీ కోసం ‘ఎలక్టోరల్ అథెంటికేషన్ ఫారం 6 బీ’ ఎంచుకోవాలి.

Step 5: తదుపరి ‘లెటజ్ స్టార్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.

Step 6: ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌ ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీ బటన్ క్లిక్ చేయాలి.

Step 7: మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తరువాత ‘వెరిఫై’ బటన్ మీద క్లిక్ చేయాలి.

Step 8: తదుపరి స్టెప్‌లో ‘అవును. నాకు ఓటర్ గుర్తింపు కార్డు ఉంది..’ అనే మొదటి ఆప్షన్ ఎంచుకోవాలి. నెక్స్ట్ బటన్ నొక్కాలి.

Step 9: ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రాష్ట్రం ఎంచుకోవాలి. ఇప్పుడు ‘వివరాలు పొందండి’ అన్న బటన్ పై క్లిక్ చేసి ‘ప్రొసీడ్’ బటన్ క్లిక్ చేయాలి.

Step 10: ఇప్పుడు స్క్రీన్‌పై కనిపించే మీ డీటైల్స్ వెరిఫై చేసుకుని నెక్స్ట్ బటన్ నొక్కండి.

Step 11: ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మీరు దరఖాస్తు చేసుకుంటున్న ప్రాంతం వివరాలు నమోదు చేయండి. తదుపరి డన్ అని నొక్కండి.

Step 12: ఇప్పుడు ఫారం 6 బీ ప్రివ్యూ ప్రత్యక్షమవుతుంది. మీ డీటైల్స్ మరొకసారి చెక్ చేసుకుని కన్ఫమ్ బటన్ నొక్కితే ఫారమ్ 6బీ స్మిట్ అవుతుంది.

సబ్మిట్ నొక్కగానే మీకు ఫారం 6బీ రెఫరెన్స్ నెంబరు వస్తుంది.

IPL_Entry_Point