తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Earthquake In Indonesia : వరుస భూకంపాలతో గడగడలాడిన ఇండోనేషియా

Earthquake in Indonesia : వరుస భూకంపాలతో గడగడలాడిన ఇండోనేషియా

Sharath Chitturi HT Telugu

10 September 2022, 7:07 IST

    • Earthquake in Indonesia today : ఇండోనేషియాలో రెండు భూకంపాలు.. నిమిషాల వ్యవధిలో సంభవించాయి. శనివారం ఉదయం భూమి కంపించింది.
వరుస భూకంపాలతో గడగడలాడిన ఇండోనేషియా
వరుస భూకంపాలతో గడగడలాడిన ఇండోనేషియా

వరుస భూకంపాలతో గడగడలాడిన ఇండోనేషియా

Earthquake in Indonesia today : వరుస భూకంపాలతో శనివారం ఉదయం ఇండోనేషియా వణికిపోయింది! ఇండోనేషియాలోని పాపువా ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. ఆ వెంటనే.. నిమిషాల వ్యవధిలో మరో భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేలుపై దాని తీవ్రత 5.8గా నమోదైంది.

ట్రెండింగ్ వార్తలు

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

అబెపురా అనే పట్టణానికి 272 కిలోమీటర్ల దూరంలో, భూమికి 15కి.మీల అడుగున ఈ రెండు భూకంపాలు సంభవించాయి. ఫలితంగా భూ ప్రకంపనలతో పలు ఇళ్లు వణికాయి. కానీ ఈ ఘటనల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదని సమాచారం.

"రింగ్​ ఆఫ్​ ఫైర్​" మీద ఉండటంతో.. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. టెక్టోనిక్​ ప్లేట్ల కదలికతో అక్కడ భూమి కంపిస్తూ ఉంటుంది. ఈ రింగ్​ ఆఫ్​ ఫైర్​ అనేది.. జపాన్​ నుంచి అగ్నేయ ఆసియా వరకు విస్తరించి ఉంది.

Indonesia earthquake : 2021లో ఇండోనేషియాలో సంభవించిన భూకంపానికి 100మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా అనేక భవనాలు కుప్పకూలాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఇండోనేషియాపై ప్రకృతి పగబట్టి కనిపిస్తోంది! ఇటీవలే.. వరదల కారణంగా ఆ దేశం విలవిలలాడింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. నిత్యావసరాలు కొనుగోలు చేయడం కూడా కష్టంగా మారిందంటే.. అక్కడి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజా భూకంపంతో.. అక్కడి ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.

భూకంపాల ‘ప్రపంచం’..!

China earthquake : ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో భూకంపాల ఘటనలు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం.. చైనాలో సంభవించిన భూకంపానికి మృతుల సంఖ్య 50 దాటింది.

Earthquake in India : ఇక ఇండియాలోనూ తరచూ భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా జమ్ముకశ్మీర్​లో భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంది. కొంత కాలం క్రితమే.. 5,6 రోజుల వ్యవధిలో 7 భూకంపాలు అక్కడ నమోదయ్యాయి. ఇక లక్నో, బిహార్​లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకుంటుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు.