China earthquake today : చైనాలో భారీ భూకంపం.. 21మంది బలి!-china earthquake today kills 21 people many injured ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  China Earthquake Today : చైనాలో భారీ భూకంపం.. 21మంది బలి!

China earthquake today : చైనాలో భారీ భూకంపం.. 21మంది బలి!

Sharath Chitturi HT Telugu
Sep 05, 2022 05:14 PM IST

China earthquake today : చైనాలో భారీ భూకంపానికి 21మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

చైనాలో భారీ భూకంపం తర్వాత పరిస్థితి ఇలా..
చైనాలో భారీ భూకంపం తర్వాత పరిస్థితి ఇలా.. (AP)

China earthquake today : చైనాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైన ఈ భూకంపం.. చైనాలోని నైరుతి ప్రాంతాన్ని గడగడలాడించింది. ముఖ్యంగా సిచువాన్ రాష్ట్రంలోని లుడింగ్​ కౌంటీ.. భూకంపం ధాటికి వణికిపోయింది.

సిచువాన్​ రాష్ట్రం విలవిల..

స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12:25 గంటలకు చైనాలో భూకంపం సంభవించింది. భూమికి 16 కిలోమీటర్ల లోతును ప్రకంపనలు చోటుచసుకున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ ఆధారిత మీడియా వెల్లడించింది.

చైనాలో భారీ భూకంపానికి 21మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటం ఆందోళనకరం. కొవిడ్​ కేసులతో ఇప్పటికే విలవిలలాడుతున్న లుడింగ్​ కౌంటీ ప్రజలపై ఈ భూకంపం.. మరో పిడుగులా వచ్చి పడింది.

China earthquake news : లుడింగ్​ కౌంటీకి 39 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది. కాగా.. అక్కడి నుంచి దాదాపు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిచువాన్​ రాజధాని చెంగ్డులోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. చైనాలో భారీ భూకంపానికి చెంగ్డు ప్రాంతంలోని ఎత్తైన భవనాలు కదిలిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

టిబిట్​కి సమీపంలో ఉంటుంది సిచువాన్​ రాష్ట్రం. టిబెటిన్​ ప్లాట్యూలో అధికంగా భూకంపాలు నమోదవుతూ ఉంటాయి.

2008లో సిచువాన్​ రాష్ట్రంలో సంభవించిన 8.2 తీవ్రత భూకంపానికి 69వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో ఇదే ప్రాంతంలో.. 7 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 200మంది మరణించారు. ఆ చీకటి రోజులను ఈ ప్రాంతం ప్రజలు ఇంకా మర్చిపోలేదు.

China earthquake death toll : సిచువాన్​ రాష్ట్రాని ఈ మధ్యకాలంలో ఏదీ కలిసి రావడం లేదు. ఆ రాష్ట్రంలో కొవిడ్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అనేకమార్లు అక్కడ లాక్​డౌన్​ అమల్లోకి వస్తోంది. మరోవైపు కరవు పరిస్థితులు కూడా తీవ్రంగా ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అక్కడ వర్షాలు పడి చాలా కాలమైంది. ఇక ఇప్పుడు చైనాలో భారీ భూకంపం.. ఆ ప్రాంతాన్ని వణికించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం