'భూకంపం'పై పార్లమెంట్​లో చర్చ జరుగుతుండగానే కంపించిన భూమి!-tremors occurred at europe nation parliament during talk on earthquakes ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'భూకంపం'పై పార్లమెంట్​లో చర్చ జరుగుతుండగానే కంపించిన భూమి!

'భూకంపం'పై పార్లమెంట్​లో చర్చ జరుగుతుండగానే కంపించిన భూమి!

Sharath Chitturi HT Telugu
Sep 02, 2022 01:45 PM IST

యూరోప్​లోని ఓ చిన్న దేశమైన లిచెన్​స్టెయిన్​లో భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భుకంపాల బీమాపై ఆ దేశ పార్లమెంట్​ చర్చ చేపట్టింది. కానీ భూ ప్రకంపనల కారణంగా ఆ చర్చ నిలిచిపోయింది!

భూకంపంపై పార్లమెంట్​లో చర్చ జరుగుతుండగామే కంపించిన భూమి!
భూకంపంపై పార్లమెంట్​లో చర్చ జరుగుతుండగామే కంపించిన భూమి!

Liechtenstein parliament debate on earthquake insurance : ఆ దేశ పార్లమెంట్​లో.. భూకంపాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. భూకంపాల బీమాపై పార్లమెంట్​ సభ్యులు ప్రసంగిస్తున్నారు. ఇంతలో భూమి కంపించింది! భూకంపాలపై చర్చ జరుగుతున్నప్పుడే.. భూమికంపించడంతో లిచెన్​స్టెయిన్​ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఏం జరిగిందంటే..

యూరోప్​లోని ఆస్ట్రియా - స్విట్జ్​ర్లాండ్​ దేశాల మధ్యలో ఉంటుంది ఈ లిచెన్​స్టెయిన్​. ఆల్ప్స్​ పర్వతాల్లో అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఫలితంగా లిచెన్​స్టెయిన్​లో భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో.. దేశంలో భూకంపాల పరిస్థితి, బీమా వంటి అంశాలపై లిచెన్​స్టెయిన్​ పార్లమెంట్​లో చర్చ జరిగింది. ఓ నేత ప్రసంగించడం మొదలుపెట్టారు. అప్పుడే తొలిసారి భూమికంపించింది. ఓ నవ్వు నవ్వేసి.. ఆమె ప్రసంగాన్ని మళ్లీ మొదలుపెట్టారు. అప్పుడో రెండోసారి భూకంపం వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పార్లమెంట్​ కెమెరాలకు చిక్కాయి.

Liechtenstein earthquake : ఈసారి.. భూకంపం తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. కెమెరాలు షేక్​ అయ్యాయి. ఆ నేత వెనకాల ఉన్న ఓ భవనంపై భూకంపం ప్రభావం పడింది.

చివరికి.. భూకంపాల బీమాపై చర్చ అర్ధాంతరంగా నిలిచిపోయింది. పార్లమెంట్​ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. 'భూకంపం బీమాపై చర్చ జరుగుతుండగామే భూమి కంపించింది. చర్చ నిలిచిపోయింది,' అని ఓ నెటిజన్​ ట్వీట్​ చేశాడు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:

IPL_Entry_Point

సంబంధిత కథనం