Typhoon Hinnamnor : 'హిన్నమ్నోర్'తో గడగడలాడుతున్న జపాన్​- చైనా-typhoon hinnamnor lashes japan china on high alert ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Typhoon Hinnamnor : 'హిన్నమ్నోర్'తో గడగడలాడుతున్న జపాన్​- చైనా

Typhoon Hinnamnor : 'హిన్నమ్నోర్'తో గడగడలాడుతున్న జపాన్​- చైనా

Sharath Chitturi HT Telugu
Sep 04, 2022 04:08 PM IST

Typhoon Hinnamnor lashes Japan : హిన్నమ్నోర్ తుపాను కారణంగా జపాన్​, చైనా, దక్షిణ కొరియాలు భయపడిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2022లో అతిపెద్ద తుపానుగా ఈ హిన్నమ్నోర్ గుర్తింపు పొందింది.

దక్షిణ కొరియాపై తుపాను ప్రభావం
దక్షిణ కొరియాపై తుపాను ప్రభావం (AP)

Typhoon Hinnamnor lashes Japan : 2022లోనే అతిపెద్ద తుపానుగా పిలుస్తున్న 'హిన్నమ్నోర్ టైఫూన్​'తో జపాన్​ విలవిలలాడుతోంది. ఒకినావాతో పాటు సమీప ద్వీపాలు.. హిన్నమ్నోర్​కు గడగడలాడుతున్నాయి. ఆ ప్రాంతం అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హిన్నమ్నోర్ తుపాను ధాటికి.. బలంగా గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఒకినావా ప్రాంతంలో అనేక చెట్లు నేలకూలాయి. మరికొన్ని చెట్లు.. భీకరంగా ఊగిపోతూ, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బలమైన గాలులకు పలువురు వృద్ధులు కిందపడిపోయారు. వారికి స్వల్పంగా గాయాలయ్యాయి.

Typhoon news latest : హిన్నమ్నోర్ తుపాను నేపథ్యంలో.. ఒకినావాతో పాటు సమీపంలోని ద్వీపాలకు విమాన సేవలు నిలిచిపోయాయి. 100కుపైగా ఫ్లైట్లు రద్దు అయ్యాయి. ఫలితంగా ఆయా ప్రాంతాలకు, జపాన్​లోని ఇతర ప్రదేశాల మధ్య విమాన సేవల సంబంధాలు తెగిపోయాయి.

<p>జపాన్​ నాహాలో నేలకూలిన చెట్టు</p>
జపాన్​ నాహాలో నేలకూలిన చెట్టు

Typhoon Hinnamnor latest updates : ఈ తుపాను.. నెమ్మదిగా కదులుతుండటం మరో ఆందోళనకర విషయం! ఇలా తుపాను నెమ్మదిగా ప్రయాణిస్తుండంతో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఫలితంగా జపాన్​లోని దక్షిణ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్పష్టం చేసింది.

జపాన్​లోని స్థానికంగా ఉన్న యంత్రంగాలు.. అప్రమత్తమై సహాయక చర్యల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశాయి.

చైనా- కొరియా- తైవాన్​లోనూ..

హిన్నమ్నోర్ టైఫూన్​ ప్రభావం.. జపాన్​తో పాటు చైనా, దక్షిణ కొరియా, తైవాన్​పైనా తీవ్రంగానే ఉంది. 2022లో అతిపెద్ద తుపాన్​గా గుర్తింపు పొందిన హిన్నమ్నోర్.. బలమైన ఈదురుగాలులతో ఆయా దేశాలపై విరుచుకుపడుతోంది.

Typhoon Hinnamnor China news : ముఖ్యంగా.. తూర్పు చైనాపై హిన్నమ్నోర్ తుపాను ప్రభావం అధికంగా ఉంది. అప్రమత్తమైన అధికారులు.. సముద్రంలో ఫెర్రీ సేవలను నిలిపివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని తేల్చిచెప్పారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే 50వేల మంది సిబ్బందిని మోహరించింది షాంఘై. హిన్నమ్నోర్ టైఫూన్​ కారణంగా.. తూర్పు చైనాలోని పలు ప్రాంతాల యంత్రాంగాలు సెలవులు ప్రకటించాయి.

<p>దక్షిణ కొరియాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బోట్లు</p>
దక్షిణ కొరియాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బోట్లు

హిన్నమ్నోర్ టైఫూన్​.. ఉత్తరంవైపు ప్రయాణించి.. తూర్పు చైనా సముద్రానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 175కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయి.

హిన్నమ్నోర్ తుపాను కారణంగా దక్షిణ కొరియాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Typhoon Japan today : తైవాన్​లోని న్యూ తైపీకి చెందిన 600మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారు ఉంటున్న ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తైవాన్​లోని మియౌలీ కౌంటీలో.. హిన్నమ్నోర్ టైఫూన్​ కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా 100 చెట్లు నేలకూలాయి. శనివారం రోజున.. 40 విమానాల సేవలు రద్దు అయ్యాయి. 100కుపైగా ఫెర్రీ సేవలు నిలిచిపోయాయి.

<p>తైవాన్​ తీర ప్రాంతంలో అలజడులు</p>
తైవాన్​ తీర ప్రాంతంలో అలజడులు
IPL_Entry_Point

సంబంధిత కథనం