తెలుగు న్యూస్  /  National International  /  12 Year Old Boy Raped In Delhi, Thrashed And Left For Dead

12 year old boy raped : 12ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం..

Sharath Chitturi HT Telugu

25 September 2022, 18:34 IST

    • Boy raped in Delhi : 12ఏళ్ల బాలుడు.. అత్యాచారానికి గురైన ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. నలుగురు.. అతడిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఢిల్లీలో బాలుడిపై అత్యాచారం
ఢిల్లీలో బాలుడిపై అత్యాచారం

ఢిల్లీలో బాలుడిపై అత్యాచారం

12 year old Boy raped in Delhi : ఢిల్లీలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 12ఏళ్ల బాలుడు అత్యాచారానికి గురయ్యాడు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

ఢిల్లీలో బాలుడిపై అత్యాచారం!

ఢిల్లీ మహిళా కమిషన్​ ఛైర్మన్​ స్వాతి మలివాల్​.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి సంబంధించిన ఫొటోను ట్వీట్​ చేశారు. అతనికి జరిగిన అన్యాయాన్ని వివరించారు.

Boy raped in Delhi : "ఢిల్లీలో మహిళలే కాదు.. అబ్బాయిలకు కూడా భద్రత లేదు. 12ఏళ్ల బాలుడిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అతడిని కర్రలతో దారుణంగా కొట్టారు. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మా టీమ్​ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది," అని స్వాతి మలివాల్​ ట్వీట్​ చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కేసుకు సంబంధించి ఓ నిందితుడిని అరెస్ట్​ చేశారు. మరో ముగ్గురి కోసం వెతుకుతున్నారు.

ఘటనపై పోలీసులకు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ మహిళా కమిషన్​.

ఢిల్లీలో నేరాలు అత్యంత తీవ్రం..!

Delhi crime news : దేశవ్యాప్తంగా నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఢిల్లీలో ఈ పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయి. మహిళలు, అమ్మాయిలు, బాలికలు.. అత్యాచారాలకు గురవుతున్న ఘటనలు నిత్యం వార్తల్లో వస్తూనే ఉంటాయి. చిన్నా, పెద్దా, అనే తేడా లేకుండా నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు.. ఓ బాలుడిపై అత్యాచారం జరగడం.. ఢిల్లీలో భద్రతాపరమైన పరిస్థితులపై సర్వత్రా చర్చకు దారితీసింది.