తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid Vaccine Covishield Side Effects: కోవిషీల్డ్​ టీకాతో ప్రమాదకరమైన సైడ్​ ఎఫెక్ట్​.. ఒప్పుకున్న ఆస్ట్రాజెనెకా!

Covid vaccine covishield side effects: కోవిషీల్డ్​ టీకాతో ప్రమాదకరమైన సైడ్​ ఎఫెక్ట్​.. ఒప్పుకున్న ఆస్ట్రాజెనెకా!

Sharath Chitturi HT Telugu

30 April 2024, 8:04 IST

  • AstraZeneca vaccine : తాము రూపొందించిన టీకాతో అరుదైన సైడ్​ ఎఫెక్ట్​ వచ్చే అవకాశం ఉందని ఆస్ట్రాజెనకా అంగీకరించింది. ఈ సంస్థ రూపొందించిన టీకాను కోవిషీల్డ్​ పేరుతో చాలా మంది భారతీయులకు ఇచ్చింది సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా.

ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిడ్​ టీకాలు..
ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిడ్​ టీకాలు..

ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిడ్​ టీకాలు..

AstraZeneca vaccine : ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా మేజర్​ యూ-టర్న్​ తీసుకుని ప్రపంచాన్ని షాక్​కు గురి చేసింది! తాము రూపొందించిన కొవిడ్​ 19 టీకాతో ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంతకాలం చెబుతూ వచ్చిన ఆ సంస్థ.. ఇప్పుడు.. అరుదైన సైడ్​ ఎఫెక్ట్​ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. దాని పేరు థ్రాంబోసిస్​ విత్​ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్​ (టీటీఎస్​) అని వెల్లడించింది. టీకాలు వెలువడిన తర్వాత.. తొలిసారిగా ఇన్​-కోర్ట్​ డాక్యుమెంట్స్​లో ఈ విషయాన్ని అంగీకరించింది ఆస్ట్రాజెనెకా.

ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిడ్​ టీకాను.. కోవిషీల్డ్​ పేరుతో ఇండియాలో విక్రయించింది సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. దేశవ్యాప్తంగా చాలా మంది ఈ టీకాను తీసుకున్నారు.

ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీతో కలిసి ఈ కోవిషీల్డ్​ టీకాను రూపొందించింది ఆస్ట్రాజెనెకా. కానీ.. ఈ టీకాతో మరణాలు సంభవించాయని, చాలా మందికి గాయాలయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి.

Covishield vaccine side effects : ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్​ టీకాను తీసుకున్న తర్వాత తన రక్తం గడ్డకట్టిందని, పని చేయలేకపోతున్నానని జేమ్స్​ స్కాట్​ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. అతను ఇద్దరు పిల్లల తండ్రి. 2021 ఏప్రిల్​లో కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకోగా.. అతని మెదడుకు శాశ్వతంగా గాయమైందని తెలుస్తోంది.

రిపోర్టుల ప్రకారం.. ఆస్ట్రాజెనెకాపై 51 కేసులు నమోదయ్యాయి. బాధితులు, బాధిత కుటుంబాలకు 100 మిలియన్​ యూరోల నష్టం వాటిల్లిందని అంచనాలు ఉన్నాయి.

వాస్తవానికి.. టీటీఎస్​ని ఇంతకాలం కంపెనీ అంగీకరించలేదు. సాధారణ స్థాయిలో టీటీఎస్​ వస్తుందని తాము అంగీకరించమని చెప్పింది. కానీ.. ఇప్పుడు బయటపడిన లీగల్​ డాక్యుమెంట్​లో.. 'ఏజెడ్​ వ్యాక్సిన్​తో చాలా అరుదైన ఘటనల్లో టీటీఎస్​ కలగొచ్చు. దీని మెకానిజం మాకు తెలియదు,' అని ఉంది.

ఈ వ్యవహారంపై జేమ్స్​ స్కాట్​ భార్య స్పందించారు.

AstraZeneca Thrombosis with Thrombocytopenia Syndrome' : "వ్యాక్సిన్​ల వల్ల టీటీఎస్ కలిగే అవకాశం ఉందని వైద్య ప్రపంచం మూడేళ్లుగా చెబుతూ వస్తోంది. నిజాన్ని ఒప్పుకోవడానికి ఆస్ట్రాజెనెకాకు 3ఏళ్లు పట్టింది. సంస్థ వెంటనే బాధితులకు, బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలి. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. నిజం మావైపు ఉంది. మేము వెనక్కి తగ్గము," అని కేట్​ తెలిపారు.

ఇక్కడి నుంచి పరిస్థితులు ఎలా ఉంటాయో, కోర్టులు ఎలాంటి తీర్పును ఇస్తాయో చూడాలి.

తదుపరి వ్యాసం