Booster Dose | సగం కంటే ఎక్కువగా తగ్గిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు.. ఎంతంటే?
కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు తగ్గాయి. కేంద్రంతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, భారత్ బయోటెక్ కోఫౌండర్ సుచిత్రా ఎల్లా తెలిపారు.
పెద్దలకు బూస్టర్ డోసు వేసేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఇదే సమయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలను సగానికంటే.. ఎక్కువగా తగ్గించినట్టు ఆయా కంపెనీలు ప్రకటించాయి. కోవిషీల్డ్ ధర రూ.600 నుంచి తగ్గించారు. కోవాగ్జిన్ రూ. 1,200 నుండి తగ్గింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, భారత్ బయోటెక్ కోఫౌండర్ సుచిత్రా ఎల్లా ఈరోజు ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్రంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
'కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత, ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను ఒక్కో డోసుకు రూ.600 నుంచి రూ.225 కి సవరించాం. బూస్టర్ డోస్ తీసుకునేందుకు కేంద్ర నిర్ణయాన్ని మేం సమర్థిస్తున్నాం.' అని పూనావాలా ట్వీట్ చేశారు.
"#CovaxinPricingని ప్రకటిస్తున్నాం. పెద్దలందరికీ బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచాలనే నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, ప్రైవేట్ హాస్పిటల్స్ కోసం కోవాగ్జిన్ ధరను ఒక్కో మోతాదుకు రూ. 1200 నుంచి 225కి సవరించాలని నిర్ణయించుకున్నాం.' అని సుచిత్ర ఎల్లా ట్వీట్ చేశారు.
అయితే ఈ టీకా ధరలకు సర్వీసు ఛార్జీ అదనంగా ఉంటుంది. గరిష్ఠంగా రూ.150 మాత్రమే తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా ధరలు గరిష్ఠంగా రూ.375కు అన్ని సర్వీసు ఛార్జీలు కలుపుకొని ఉండనున్నాయి.
18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ షాట్‌లను తీసుకునేందుకు కేంద్రం చేసిన ప్రకటనను పూనావాలా స్వాగతించారు. కీలకమైన, సమయానుకూల నిర్ణయమని పేర్కొన్నారు. బూస్టర్ డోస్ తీసుకోని వారిపై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయని గుర్తు చేశారు. మూడో డోస్ లేకుండా ప్రయాణించాలనుకునే వ్యక్తులకు కష్టమన్నారు.
18 ఏళ్ల కోవిడ్ టీకా రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన 18 ఏళ్లు పైబడిన భారతీయులందరికీ రెండవ టీకా తర్వాత 9 నెలలు పూర్తి చేసినట్లయితే, కోవిడ్-19 వ్యాక్సిన్‌ల బూస్టర్ డోస్‌లను అందుబాటులో ఉంచుతామని భారత ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
టాపిక్