Covid cases in India : ఒక్క రోజులో 841 కొవిడ్ కేసులు.. 7 నెలల్లో ఇదే తొలిసారి!
Covid cases in India : దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా.. 7 నెలల తర్వాత, ఒక్క రోజులో 841 కేసులు వెలుగులోకి వచ్చాయి.
Covid cases in India : ఓవైపు నూతన ఏడాది వేడుకలు ఘనంగా సాగుతున్న వేళ.. మరోవైపు దేశంలో కొవిడ్ పరిస్థితులు అందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం ఒక్క రోజే 841 కరోనా కేసులు వెలుగులోకి రావడంతో కొవిడ్ భయాలు మరింత పెరిగాయి. ఇలా.. ఒక్క రోజులో 800కుపైగా కేసులు నమోదవ్వడం.. 7 నెలల్లో ఇదే తొలిసారి! కొవిడ్ కేసుల పెరుగుదలకు కొత్తగా పుట్టుకొచ్చిన సబ్‌వేరియంట్ జేఎన్.1 కారణమన్న విషయం తెలిసిందే.
ఇండియాలో పెరుగుతున్న కొవిడ్ కేసులు..
కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన డేటా ప్రకారం.. దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య ఆదివారం నాటికి 4,309గా ఉండేది. కొవిడ్ కారణంగా కేరళ, కర్ణాటక, బిహార్‌లో ముగ్గురు మరణించారు. శనివారం.. ఇండియాలో 743 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం ఆ సంఖ్య 841కి పెరిగింది.
JN.1 cases in India : వాస్తవానికి గత కొన్ని నెలలుగా ఇండియా లో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి. చాలా నెలల వరకు ఇండియావ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య డబుల్ డిజిట్‌లోనే నమోదైంది. కానీ.. జేఎన్.1 సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. ఒక్కసారిగా ముండంకెల డిజిట్ నమోదవుతూ, అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.
ఇక ఇండియాలో మొత్తం మీద ఇప్పటివరకు 4.50 కోట్లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 5,33,361 మంది కొవిడ్‌కు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఇటీవలి కాలంలో జేఎన్.1 కేసులు పెరుగుతున్నా, రికవరీ రేటు భారీగా ఉండటం కాస్త ఉపశమనాన్ని కల్పించే విషయం. ప్రస్తుతం కొవిడ్ రికవరీ రేటు 98.81శాతంగా ఉంది. ఇక దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ టీకాలను పంపిణీ చేసింది కేంద్రం.
India Covid cases latest news : ఇక జేఎన్.1 సబ్‌వేరియంట్ విషయానికొస్తే.. ఇండియాలో ఇప్పటివరకు 178 కేసులు వెలుగులోకి వచ్చాయి. గోవాలో అత్యధికంగా 47మంది ఈ కొత్త వేరియంట్ బారినపడ్డారు. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ (41), గుజరాత్ (36), కర్ణాటక (34) రాష్ట్రాలు ఉన్నాయి.
న్యూ ఇయర్ వేళ అప్రమత్తం..
సరిగ్గా పండుగ సీజన్ ప్రారంభమైన సమయంలోనే జేఎన్.1 కొవిడ్ కేసుల సంఖ్య ఇండియాలో పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తున్న విషయం. మరీ ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రజలు భారీ ఎత్తు ప్రయాణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాల్లో కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించాలని సూచిస్తున్నారు.
JN.1 covid variant in India : అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొవిడ్ సోకే ప్రమాదం ఉందని, అందుకే.. వివిధ రోగాలు ఉన్న వారు పర్యటనలు చేపట్టకపోవడం శ్రేయస్కరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత కథనం