తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Stamina | మీ శ్వాసను, మీలోని సత్తువను పెంచే 3 యోగా ఆసనాలు ఇవే!

Yoga for stamina | మీ శ్వాసను, మీలోని సత్తువను పెంచే 3 యోగా ఆసనాలు ఇవే!

HT Telugu Desk HT Telugu

06 February 2023, 10:33 IST

    • Yoga for Strength and Stamina: చిన్నపాటి శ్రమకే ఆయాసపడిపోతున్నారా? మీలోని సత్తువను పెంచే ఓ 3 యోగా ఆసనాలు ఇక్కడ తెలుసుకోండి.
Yoga for Strength and Stamina
Yoga for Strength and Stamina (Unsplash)

Yoga for Strength and Stamina

యోగా అనేది అనేక ప్రయోజనాలతో నిండిన ఒక వ్యాయామ పద్ధతి. ఇది వ్యక్తులను శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. శరీరానికి సమతుల్యత కల్పించడం, ఆరోగ్యకరమైన శరీరాకృతి, భంగిమను అందించడం, జీవక్రియను మెరుగుపరచడం, అలసటను తగ్గించడం వంటి సాధారణ సమస్యల నుండి హృదయ స్పందన రేటును నియంత్రించడం, అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం, ఒత్తిడి స్థాయిలను తగ్గించడం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు యోగా పరిష్కారం చూపుతుంది. యోగాలో చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాల ఆసనాలు, భంగిమలు, యోగ ముద్రలు మొదలైనవి ఒక్కో అంశానికి ప్రత్యేకంగా నిర్ధేషించినవి.

యోగా ఏరోబిక్ వ్యాయామాలు ఊపిరి బిగబట్టే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇది హృదయం, శ్వాసకోశ వ్యవస్థలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొంతమందికి ఏదైనా చిన్న పనిచేసినా, శారీరానికి కాస్త్ర శ్రమ కలిగినా, లేదా కొద్ది దూరం నడిచినా చాలా ఆయస పడిపోతారు. ఊపిరి వేగంగా పీల్చుకుంటారు. ఇలాంటి వారు వ్యాయామాలు చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. మీకు తరచుగా దమ్ము రావడం, కొద్దిపాటి శ్రమకే ఆయాసపడిపోవడం జరుగుతుందా? అయితే ఈ పరిస్థితిని అధిగమించడానికి హిమాలయా యోగా ఆశ్రమ, ప్రపంచ యోగా సంస్థ స్థాపకుడు హిమాలయన్ సిద్ధా అక్షర్, 3 యోగా భంగిమలను HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు.

Yoga for Strength and Stamina- సత్తువను పెంచే యోగా ఆసనాలు

యోగా నిపుణులు సూచించిన మూడు యోగా భంగిమలు మీ శక్తిని లోపలి నుంచి పెంచుతాయి, మీ ఓర్పును, సామర్థ్యాన్ని పెంచుతాయి, వ్యాయామ సమయంలో ఎక్కువ కాలం పట్టుదలతో ఉండటానికి సహాయపడతాయి. అవేంటో చూడండి మరి.

1. నౌకాసనం - Boat Pose

యోగాలోని నౌకాసనం వ్యక్తుల్లో శక్తి, సామర్థ్యాలను పెంచే ఆసనం. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు వివిధ శారీరక సమస్యలను ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. ఈ ఆసనం వేయడం ద్వారా తుంటి కీళ్ళు, కాళ్ళు బలోపేతం అవుతాయి. అలాగే చేతులు, తొడలు, భుజాలలోని కండరాలను బలపరుస్తుంది. ఉదర అవయవాలు, కండరాలు ఉత్తేజితమవుతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీర స్థిరత్వం పెరుగుతుంది. నౌకాసనం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయపడుతుంది.

2. బాలసనం - Child Pose

ఇది సులభమైన యోగా ఆసనం, కానీ చాలా శక్తివంతమైనది. ఛాతీ, వీపు, భుజాలలో ఒత్తిడిని తగ్గించడం ద్వారా కండరాలకు విశ్రాంతి ఇస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడమే కాకుండా మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతుంది. అలసట లేదా మైకముతో బాధపడుతుంటే కూడా సహాయపడుతుంది. ఇది వెన్ను, తుంటి, తొడలు, చీలమండల భాగాలలో సాగతీత, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

3. ఉస్త్రాసన - Camel Pose

ఈ ఆసనం వేయడం ద్వారా ఛాతీ విస్తరిస్తుంది. తద్వారా శ్వాసక్రియ మెరుగుపడుతుంది. ఇదే కాకుండా, ఈ ఆసనం వేయడం ద్వారా భుజాలు, వీపు, తుంటి, నడుము, కండరాలను సాగదీయడం, బలోపేతం చేయడంతో పాటు, ఉదర ప్రాంతాన్ని విస్తరించడం ద్వారా జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇది వెన్నుపూసకు విశ్రాంతినిస్తుంది, నడుము నొప్పిని తగ్గిస్తుంది, మీ శరీర భంగిమను మెరుగుపరుస్తుంది, తొడ భాగంలో కొవ్వును కాల్చేస్తుంది.

అయితే, గర్భిణీ స్త్రీలు, అతిసారం ఉన్నవారు, మోకాళ్లకు గాయమైన వ్యక్తులు ఈ వ్యాయామం చేయడం మంచిది కాదు.

టాపిక్