Yoga Poses For Children । పిల్లలపై స్క్రీన్ టైమ్ ప్రభావాలను తగ్గించే యోగా ఇదిగో!
Yoga Poses For Children- Reduce Screen Time: మీ పిల్లలు మొబైల్, టాబ్లెట్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారా? వారి కళ్లపై భారం పడకుండా విశ్రాంతి కలిగించే కొన్ని యోగా పద్ధతులు, యోగా ముద్రలు ఇక్కడ చూడండి.
మన దైనందిన జీవితంలో పెరుగుతున్న సాంకేతికత కారణంగా, పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. నేటి ప్రపంచంలోని పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నారు. అంతర్జాలం లేని ప్రపంచాన్ని ఇప్పుడు ఊహించుకోవడం వారికి కష్టం. పిల్లలు సగటున కనీసం 2 గంటల పాటు స్క్రీన్లతోనే కాలక్షేపం చేస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. స్క్రీన్ నుంచి వెలువడే బ్లూలైట్ పిల్లల కంటి చూపు దెబ్బతీయడమే కాకుండా వారి శారీరక, మానసిక ఆందోళనలకు కారణం అవుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి సర్టిఫైడ్ కిడ్స్ యోగా ఎక్స్‌పర్ట్, మైండ్‌ఫుల్‌నెస్ కోచ్ అయినటువంటి సబ్రినా మర్చంట్ హెచ్‌టి లైఫ్‌స్టైల్ కోసం ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సూచనలు చేశారు, కొన్ని యోగా పద్ధతులు తెలియజేశారు.
Yoga Poses for Children - Reduce Screen Time
పిల్లల స్క్రీన్ టైం తగ్గిస్తూ వారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా యోగా పద్ధతులు . నిపుణులు తెలియజేశారు. వాటిని ఈ కింద చూడండి.
1. కళ్లకు విశ్రాంతి కల్పించడం- Palming your eyes
అరచేతులను కలిపి రుద్దుతూ కొంత వేడిని సృష్టించండి. ఆపై వెంటనే వాటిని మూసి ఉన్న కనురెప్పలపై సున్నితంగా ఉంచండి, తద్వారా చేతి వెచ్చదనం కళ్లకు తగిలి కొంత ఉపశమనం ఉంటుంది, కళ్లు భారంగా అనిపించవు. ఇలా చేసేటపుడు కళ్లపై ఒత్తిడి ఉండకూడదు.
2. సమాన ముద్ర
సమాన ముద్ర అనేది ఒక యోగ ముద్ర. మీ చేతివేళ్లను అన్నింటిని ఒక చోట కలపండి. బొటనవేలుతో సహా అన్ని వేళ్లు ఒకదానికొకటి తాకాలి, అనంతరం దీనిని అలాగే మూసి ఉన్న కనురెప్పలపై కొద్ది సేపు ఉంచాలి. ఈ ముద్ర మంచి రిలాక్సేషన్ అందిస్తుంది.
3. పశ్చిమోత్తనాసనం- Seated forward fold
ఒక కుర్చీపై కూర్చొని, మోకాళ్ళపై ముందుకు వంగండి. చేతులు నేలను తాకించి వాటిని అలాగే కొద్ది సేపు ఉంచండి, తలను కిందకు వేలాడదీసి శ్వాస వదలండి. అనంతరం చేతులను, తలను పైకి లేపుతూ శ్వాస తీసుకోవాలి. ఇలా రెండు, మూడు సార్లు రిపీట్ చేయాలి.
5. ఊర్ధ్వ హస్తాసన యోగా- Upward standing stretch
నిటారుగా నిలబడండి, మీ రెండు చేతులను పైకి లేపి సమాంతరంగా ఉంచండి. నేరుగా మీ ముందు వైపు చూడండి. అదే సమయంలో, శరీరానికి గరిష్ట సాగతీత అందించడానికి, మీ రెండు మడమలను పైకి లేపి మడమలపైనే నిలబడండి. ఇలా 6-10 సెకన్ల పాటు ఉండి ఆ తర్వాత రిలాక్స్ అవ్వాలి, చేతులను దించాలి. ఈ వ్యాయామాన్ని 2-3 సార్లు చేయాలి.
4. మార్జర్యాసన- బిటిలాసన Seated Cat- Cow
కుర్చీపై కూర్చుని, నిటారుగా వెన్నెముక సరిగ్గా ఉండేలా కూర్చోండి. మీ రెండు పాదాలను నేలపై ఉంచండి. మీ చేతులను మీ మోకాళ్లపై లేదా మీ తొడల పైభాగాలపై ఉంచండి. శ్వాస పీల్చుకుంటూ మీ వెన్నెముకను ముందుకు వంచండి, మీ భుజాలను మీ వెనుకకు తీసుకురండి. మళ్లీ శ్వాస వదులుతూ యధాస్థానానికి రావాలి.