తెలుగు న్యూస్  /  Lifestyle  /  World Health Organization Says Lack Of Will To Exercise Can Lead To Life Threating Diseases

Lifestyle Diseases : సోమరిపోతులు ఎక్కువైపోతున్నారట.. వారికి ప్రాణాంతక వ్యాధులు తథ్యం అంటున్న WHO

22 October 2022, 8:26 IST

    • Life Threating Diseases : వ్యాయామం, సరైన శారీరక శ్రమ లేకుంటే.. ప్రాణాంతక వ్యాధులు తప్పవని WHO తెలిపింది. సోమరిపోతుల జనాభా రోజు రోజుకి పెరిగిపోతుందని వెల్లడించింది. కనీసం వ్యాయామం చేయనివారు ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారని.. వారిలో యువత కూడా ఉందని పేర్కొంది. 
సోమరితనంతో జాగ్రత్త
సోమరితనంతో జాగ్రత్త

సోమరితనంతో జాగ్రత్త

Life Threating Diseases : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 174 దేశాల్లో నిర్వహించిన సర్వేలో.. ప్రపంచంలో సోమరి ప్రజల జనాభా వేగంగా పెరుగుతోందని పేర్కొంది. WHO నివేదిక ప్రకారం.. 81 శాతం మంది యువకులు, 28 శాతం మంది పెద్దలు కనీస వ్యాయామం కూడా ఉంటున్నారని తెలిపింది. ఈ వ్యక్తులలో వ్యాయామం పట్ల ప్రేరణ లేకపోవడం, చేయకపోవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Moongdal Curry: పొట్టు పెసరపప్పుతో కూర వండితే అదిరిపోతుంది, వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది

Pre Wedding Diet : పెళ్లికి ఒక వారం ముందు నివారించాల్సిన కొన్ని విషయాలు

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

Chanakya Niti Telugu : ఈ సక్సెస్ సూత్రాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి

WHO నివేదికల ప్రకారం.. 2020 నుంచి 2030 మధ్య 50 మిలియన్లకు పైగా ప్రజలు జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నట్లు స్పష్టం చేసింది. వీరిలో 47 శాతం మంది హైపర్‌టెన్షన్ లేదా హై బీపీతో బాధపడుతుండగా.. 43 శాతం మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పేర్కొంది.

జీవనశైలి వ్యాధులను నివారించే మార్గాలు

WHO ప్రకారం.. ఒక వ్యక్తి ప్రతిరోజూ 21 నిమిషాలు వ్యాయామానికి కేటాయించినట్లయితే.. వారు ఈ వ్యాధులను 20 నుంచి 30 శాతం వరకు నివారించవచ్చని తెలిపింది. ఇది డిప్రెషన్, గుండె జబ్బుల కేసులలో 7-8 శాతం మందిని నిరోధించడంలో కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు.

WHO డేటా ప్రకారం 74 శాతం మరణాలు జీవనశైలి వ్యాధుల కారణంగానే సంభవిస్తున్నాయి. 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 1 కోటి 70 లక్షల మంది ప్రతి సంవత్సరం నాన్-కమ్యూనికేబుల్ అంటే జీవనశైలి వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు.

ఈ WHO నివేదికలోని మరో అంశం ఏమిటంటే.. మన సోమరితనానికి మన సంపదతో ప్రత్యక్ష సంబంధం ఉంది. నివేదికల ప్రకారం, ప్రపంచంలోని ధనిక దేశాలలో 36 శాతం మంది సోమరితనంతో ఉంటున్నారు. పేద దేశాల్లో అయితే కేవలం 16 శాతం మంది మాత్రమే సోమరి వర్గంలోకి వస్తున్నారు.

నివేదిక ప్రకారం.. నేడు ప్రపంచవ్యాప్తంగా 42 శాతం దేశాలు మాత్రమే నడక లేదా సైక్లింగ్ కోసం విధానాలు, సౌకర్యాలను కలిగి ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు 26 శాతం దేశాలు మాత్రమే కఠినమైన విధానాలను కలిగి ఉండగా.. 26 శాతం దేశాలు మాత్రమే వేగ పరిమితి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నాయి.

టాపిక్