తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Why Do We Get Attract : మనం వేరొకరికి ఎందుకు అట్రాక్ట్ అవుతాం.. సైన్స్ చెప్పేది ఇదే

Why Do We Get Attract : మనం వేరొకరికి ఎందుకు అట్రాక్ట్ అవుతాం.. సైన్స్ చెప్పేది ఇదే

Anand Sai HT Telugu

04 February 2023, 10:58 IST

    • Why Do We Get Attracted : కొన్నిసార్లు వ్యక్తి ఎవరో మనకు తెలియదు. కానీ వారిని అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆ తర్వాత తెలియని వారికి అట్రాక్ట్ అయ్యామేంటని అనుకుంటాం. కానీ ఆ పరిస్థితుల్లో మాత్రం.. మన కంట్రోల్ లో మనం ఉండం. కళ్లు అటువైపే వెళ్తాయి. ఎందుకు అలా?
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

ట్రాఫిక్ లో చిక్కుకుంటాం.. అటు ఇటు చూస్తాం. పక్కనే ఒకరు కనిపిస్తారు. కాసేపు వారినే అలా చూస్తుంటాం. వందల మంది జనం హాజరయ్యే.. ఈవెంట్.. కానీ ఒక్కసారిగా ఎవరో వ్యక్తి మీద మన కళ్లు ఆగిపోతాయి. తెలియని ప్రదేశానికి వెళ్తుంటాం.. జర్నీలో ఒక వ్యక్తి కనిపిస్తారు. కిటికీలో నుంచి ప్రకృతిని చూసే మనం.. ఆ వ్యక్తినే ప్రకృతిలా చూస్తుంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది. తెలియని వ్యక్తికి కూడా ఎందుకు అట్రాక్ట్ అవుతుంటాం. ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అంతలా బ్లష్ అవుతాం.

మీ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు.. లేదా పూర్తిగా అపరిచితుడు కావచ్చు. కానీ మనం ఇష్టపడేలా ఎందుకు అవుతున్నామని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యూనివర్శిటీ ఆఫ్ సౌతాంప్టన్‌లో మనస్తత్వశాస్త్రంపై బోధించే ప్రొఫెసర్ క్లైర్ హార్ట్ ప్రకారం, ఆకర్షణకు కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. భౌతిక ఆకర్షణ, సామీప్యత, సారూప్యత, అన్యోన్యత, పరిచయం అని చెబుతున్నారు.

మనకు ఇతరులకు సిమిలారిటీస్ ఉంటే.. ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం. అరే మనలాగే ఉన్నారే.. మనకు వాళ్లకి సెట్ అవుతుందని మనసులో అనుకుంటాం. తెలియని వ్యక్తి కూడా.. మనలాగా చేస్తున్నారని కాస్త అనిపించినా చాలు.. వారివైపే చూస్తుంటాం. అయితే వారి రిలేషన్.. అలానే లైఫ్ టైమ్ ఉంటుందని అర్థంకాదు.. ముఖ సౌష్టవం ఉన్నవారు ఇతరులతో పోలిస్తే ఎక్కువ ఆకర్షణను పొందుతారని మానసిక నిపుణులు అంటున్నారు.

భౌగోళిక పరంగా మనకు దగ్గరగా ఉండే వ్యక్తుల పట్ల మనం ఆకర్షితులవుతాం. అతను లేదా ఆమె అదే ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే వ్యక్తిని చూడటం సులభం అవుతుంది. దీంతో ఆకర్షణ ఉంటుంది. అలాగే ఒకే కార్యాలయంలో పనిచేస్తే ఇంకా ఈ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందట.

మీరు ఎవరికైన ఆకర్షితులైనప్పుడు ఆడ్రినలిన్ రష్ వస్తుంది. తీవ్రమైన భావోద్వేగాలకు గురైనప్పుడు ఇది విడుదల అవుతుంది. కొందరికి మానసిక ఆకర్షణ అయితే, మరికొందరికి శారీరక ఆకర్షణ. ఇది ఒకరమైన స్పార్క్ అన్నమాట. దీని ద్వారా మీ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.

ఓ వ్యక్తి మీకు మానసికంగా మంచి అనుభూతిని కలిగించకపోవచ్చు. కానీ శారీరక ఆకర్షణ కారణంగా మీరు ఆ వ్యక్తితో కలిసి ఉండాలని కోరుకుంటారు. అయితే, శారీరక ఆకర్షణతోపాటుగా వారి వ్యక్తిత్వం కూడా గొప్పగా ఉండాలి.

కొంతమందికి భాగస్వాముల కొరత.. కూడా అట్రాక్ట్(Attract) అయ్యేలా చేస్తుందని సైన్స్ చెబుతోంది. అందువల్ల, మన చుట్టూ అందుబాటులో ఉన్న వారి నుంచే ఒకరిని ఎంచుకుంటాం. అయితే, ఇది మీ సంబంధం దీర్ఘకాలం కొనసాగుతుందని లేదా ముందుగానే ముగుస్తుందని చెప్పలేం.

ప్రేమ కావాలి అనుకున్నప్పుడు గుడ్ లుక్స్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. లుక్స్ విషయంతోనే ఎక్కువ మంది అట్రాక్ అవుతారట. అందంగా కనిపించే వ్యక్తుల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు. ఆకర్షణకు హార్మోన్లు కూడా ముఖ్యం.. ఓ వ్యక్తిని చూస్తే.. హార్మోన్ల స్థాయి కూడా పెరుగుతుంది. ఆకర్షణ పెరిగినప్పుడు ఆక్సిటోసిన్(oxytocin), డోపమైన్(dopamine) స్థాయి కూడా పెరుగుతుంది.

హోదాను కూడా కొంతమంది చూసుకుంటారు. చాలా మంది ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిసిపోవాలని కోరుకుంటారు. ఒకరి పట్ల ఆకర్షితులు కావడానికి ఇది కూడా ఒక కారణం. ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా, ధనవంతులుగా, స్నేహపూర్వకంగా ఉన్న వ్యక్తులు ఎక్కువగా కలిసిపోతారు.