Expectations are injurious: రిలేషన్‌షిప్‌ను గాయపరిచే 7 ఎక్స్‌పెక్టేషన్స్ ఇవే-know 7 top expectations to avoid from your partner to make relationship strong ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know 7 Top Expectations To Avoid From Your Partner To Make Relationship Strong

Expectations are injurious: రిలేషన్‌షిప్‌ను గాయపరిచే 7 ఎక్స్‌పెక్టేషన్స్ ఇవే

HT Telugu Desk HT Telugu
Dec 22, 2022 10:02 AM IST

రిలేషన్‌షిప్స్ సమస్యలతో ఈ తరం యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రేమికుల్లో, అలాగే పెళ్లయిన జంటల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది. అయితే ఇవన్నీ భాగస్వామిపై పెట్టుకునే ఎక్స్‌పెక్టేషన్స్‌ వల్లేనని సైకాలజిస్టులు చెబుతున్నారు.

Expectations that hold us back from building a healthy relationship
Expectations that hold us back from building a healthy relationship (Unspalsh)

ఒక రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇరువైపులా చాలా ప్రయత్నాలు జరగాలి. ప్రతి రిలేషన్‌షిప్ ఆరంభంలో దీపావళి పండగలా, బాణాసంచా కాల్చినట్టే ఉంటుంది. ఆరంభంలో ఉన్న ఉత్సాహం క్రమంగా తగ్గిపోతుంది. అయితే ఆ ఇద్దరు ఒకరినొకరు తెలుసుకోవడం, పరస్పరం అర్థం చేసుకోవడం, ఒకరి కోసం ఒకరు నిలబడడం ద్వారా మీ దీర్ఘకాల ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ జర్నీలో తరచుగా అడ్డంకులు ఎదురవుతుంటాయి. మన అభిప్రాయాలు, దృక్కోణం మారుతుండడమే ఇందుకు కారణం. ఒకరి ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకొకరికి భారంగా మారుతాయి. అయితే హెల్తీ కమ్యూనికేషన్, అర్థం చేసుకోవడం ద్వారా ఆ బంధం సురక్షితంగా ఉంటుంది.

సైకాలజిస్ట్ నికోల్ లెపెరా తన ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అనే అంశంపై చర్చించారు. హెల్తీ రిలేషన్‌షిప్ కొనసాగకుండా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ వెనక్కి లాగుతాయని చెప్పారు. వాటి గురించి వివరించారు.

ఉండకూడని ఎక్స్‌పెక్టేషన్స్ ఇవే

1. నా భాగస్వామి నన్ను హాపీగా ఉంచాలి

చాలా మంది ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ భాగస్వామి ప్రథమ కర్తవ్యం మనల్ని హాపీగా ఉంచడం కాదు. నిజానికి మన హాపీనెస్‌ అనే బాధ్యతను ఇతరుల చేతుల్లో పెడితే తరచుగా అసంతృప్తికి దారితీస్తుంది.

2. లైంగిక చర్య చాలా ముఖ్యమైనది

ప్రతి బంధం ఒక్కో తీరుగా ఉంటుంది. కొందరికి సెక్స్ చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. కానీ మరికొందరికి అలా ఉండదు. శారీరక, భావోద్వేగ సాన్నిహిత్యం ఆ బంధంలో ఉన్న వ్యక్తులను బట్టి ఉంటుంది.

3. నా భాగస్వామి ఎవరికీ ఆకర్షితుడవవ్వొద్దు

ఇదొక బయోలాజికల్ అపోహ. భాగస్వామి మీతో ప్రేమలో ఉన్నప్పటికీ ఇతరులకు కూడా ఆకర్షితుడవ్వొచ్చు. అంతమాత్రానా మీపై ప్రేమ లేనట్టు కాదు.

4. బంధాలను చాలా సులువుగా తీసుకోవచ్చు

బంధం పటిష్టంగా ఉండడానికి చాలా ప్రయత్నాలు అవసరం. సరైన వ్యక్తులు ఉన్నప్పటికీ వారి బంధం కలకాలం నిలవాలంటే ఇరువైపులా ప్రయత్నాలు అవసరం. బంధాలు అంత తేలిగ్గా తీసుకోరాదు.

5. ప్రేమ అన్నింటినీ జయిస్తుంది

ప్రేమ అన్నింటినీ జయించలేదు. ఇరువురి మధ్య సరైన చర్చ, కష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవడం, పరస్పరం గౌరవించుకోవడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల బంధం పటిష్టమవుతుంది.

6. ప్రేమ ఒక అద్భుత కథలా అనిపించాలి

ఈ ఎక్స్‌పెక్టేషన్ కూడా సరికాదు. ప్రేమ ఎప్పుడూ ఒక అద్భుత కథలా ఉండదు. నిజానికి ప్రేమలో తరచూ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కష్టాలను ఇస్తుంది.

7. అసూయ అనేది ప్రేమకు సంకేతం

అదొక సహజమైన భావోద్వేగం. అయితే ఇందులోని తీవ్రత వారి సొంత అభద్రత భావాలకు నిదర్శనం కూడా కావొచ్చు.

WhatsApp channel