Bipolar disorder: మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉన్నాయా? బైపోలార్ డిజార్డర్ లక్షణాలు, కారణాలు ఇక్కడ తెలుసుకోండి
Bipolar disorder: బైపోలర్ డిజార్డర్ కారణాలు, లక్షణాలు, చికిత్స విధానం గురించి సైక్రియాటిస్ట్ అందిస్తున్న వివరాలు ఇవే..
మానిక్ డిప్రెషన్ అని కూడా పేరున్న బైపోలార్ డిజార్డర్ అనేది మానసిక ఆరోగ్య సమస్య. ఇది వ్యక్తి మానసిక స్థితి, శక్తి, పని సామర్థ్యంలో తీవ్రమైన హెచ్చు తగ్గులను కలిగిస్తుంది. ఈ రుగ్మత దాని రకాన్ని బట్టి మీ మానసిక స్థితిని వివిధ మార్గాల్లో ప్రభావితం అవుతుంది. స్వల్పకాలికంగా మానిక్ ఎపోసోడ్ (మానసిక స్థితి అసాధారణంగా ఎలివేట్ అవడం, అధిక శక్తి, తీవ్రమైన ఆలోచనలు, తీవ్రమైన ప్రవర్తనలు) ఒకసారి కనిపించినా దానిని బైపోలార్ డిజార్డర్‌గా నిర్ధారిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఉత్సాహంగా, శక్తితో నిండిన అనుభూతి చెందుతారు. వారు సాధారణ జీవితంలో తీసుకోని రిస్కీ నిర్ణయాలు కూడా తీసుకుంటారు.
2 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు డిప్రెషన్ ఉండడం, కనీసం 1 ఎపిసోడ్‌లో 4 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు హైపోమానియా ఉన్నట్లయితే బైపోలార్ 2గా నిర్ధారిస్తారు. హైపోమానియా లక్షణాలు ఉన్మాద లక్షణాల కంటే తక్కువగా ఉంటాయి. సమీపంలో ఉన్న వారు అసాధారణ మార్పులను గుర్తించనంత వరకు పెరిగిన శక్తి లేదా ఉత్పాదకత స్థాయిలను గమనించలేరు. బైపోలార్ 2 మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సైక్లోథైమియా అనేది మరొక రకమైన బైపోలార్ డిజార్డర్. దీనిలో 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు డిప్రెషన్, ఉన్మాదం కలిగి ఉంటుంది.
What is bipolar disorder: బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటి?
‘బైపోలార్ డిజార్డర్ అనేది మెదడుకు సంబంధించిన రుగ్మత. ఇది ఒక వ్యక్తి మానసిక స్థితి, శక్తి, పని చేసే సామర్థ్యంలో మార్పులకు కారణమవుతుంది. బైపోలార్ డిజార్డర్ రోగులు మూడ్ ఎపిసోడ్స్ అని పిలిచే తీవ్రమైన భావోద్వేగ అనుభవాలకు గురవుతారు. ఇది తరచుగా కొన్ని రోజుల నుండి వారాల వరకూ ఉంటుంది. ఈ మూడ్ స్వింగ్స్‌ని నిస్పృహ, ఉన్మాదం లేదా హైపోమానిక్ (అసాధారణమైన ఆనందం లేదా కోపంతో కూడిన మూడ్, విచారకరమైన మూడ్)గా వర్గీకరిస్తారు. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తులు సక్రమంగా చికిత్స పొందితే చురుగ్గా, సంతృప్తికరంగా జీవితాన్ని గడపవచ్చు..’ అని మనస్థలి ఫౌండర్, సీనియర్ సైక్రియాటిస్ట్ డాక్టర్ జ్యోతి కపూర్ చెప్పారు.
'బైపోలార్ డిజార్డర్' అనే పదం మూడు విభిన్న రోగ నిర్ధారణలను సూచిస్తుంది. బైపోలార్ 1, బైపోలార్ 2, సైక్లోథైమిక్ డిజార్డర్ అనే మూడు విభిన్న దశలు ఉంటాయి.
What causes bipolar disorder: బైపోలార్ డిజార్డర్‌కు కారణాలు ఏంటి?
బైపోలార్ డిజార్డర్ ఉన్న 80-90% మందిలో వారి కుటుంబ సభ్యులు డిప్రెషన్‌లో లేదా డిజార్డర్‌తో బాధపడుతూ ఉండి ఉంటారని డాక్టర్ జ్యోతి చెప్పారు.
‘ఒత్తిడి, క్రమరహిత నిద్ర విధానాలు, డ్రగ్స్, ఆల్కహాల్ వంటివి వ్యక్తులలో మానసిక కల్లోలం కలిగిస్తాయి. బైపోలార్ డిజార్డర్‌కు కచ్చితమైన మెదడు సంబంధిత కారణాలు తెలియనప్పటికీ, రసాయన అసమతుల్యత అనేది మెదడు కార్యకలాపాల విఘాతానికి మూల కారణమని నమ్ముతారు..’ అని సైక్రియాటిస్ట్ చెప్పారు.
Warning symptoms of bipolar disorder: బైపోలార్ డిజార్డర్ హెచ్చరిక సంకేతాలు
- తీవ్రంగా విచారించడం
- అలసట, శక్తివిహీనంగా ఉండడం
- ప్రేరణ లేకపోవడం
- నిస్సహాయ భావన
- గతంలో ఆనందించే కార్యకలాపాలలో ఇప్పుడు ఆనందాన్ని కోల్పోవడం
- దృష్టి కేంద్రీకరించడంలో, ఏం చేయాలో నిర్ణయించుకోవడంలో ఇబ్బంది
- విపరీతమైన ఏడుపు
- చిరాకు
- నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం.
- ఆకలిలో మార్పు, దాని ఫలితంగా బరువు తగ్గడం లేదా పెరగడం.
- జీవితాన్ని ముగించడానికి ఆత్మహత్య ఆలోచనలు.
బైపోలార్ డిజార్డర్ నివారణకు చిట్కాలు
బైపోలార్ డిజార్డర్‌ను పూర్తిగా నివారించలేం. బైపోలార్ అనారోగ్యం లేదా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు మరింత అధ్వాన్నంగా మారకుండా ఆపడానికి వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ జ్యోతి సూచించారు.
టాపిక్