Weight loss tips: బరువు తగ్గడానికి భారీ మార్పులా.. ఈ వెయిట్ లాస్ టిప్స్ చాలు-weight loss tips you only need to make small changes to your daily routine ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss Tips: బరువు తగ్గడానికి భారీ మార్పులా.. ఈ వెయిట్ లాస్ టిప్స్ చాలు

Weight loss tips: బరువు తగ్గడానికి భారీ మార్పులా.. ఈ వెయిట్ లాస్ టిప్స్ చాలు

HT Telugu Desk HT Telugu
Jan 21, 2023 09:01 AM IST

Weight loss tips: బరువు తగ్గాలని మొదట్లో చాలా శ్రమిస్తారు. కానీ మోటివేషన్ తగ్గగానే అటకెక్కించేస్తారు. దీర్ఘకాలం మీ ప్రయత్నాలు కొనసాగాలంటే ఇలా చేయండి.

చిన్నచిన్న మార్పులతో బరువు అదుపులో ఉంటుంది
చిన్నచిన్న మార్పులతో బరువు అదుపులో ఉంటుంది (Pixabay)

బరువు తగ్గడం (Losing weight) చాలా ప్రాచుర్యం పొందిన న్యూఇయర్ రిజల్యూషన్. కానీ దీనిని సాధించేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. జనవరి రెండో, మూడో వారం కల్లా ఈ బరువు తగ్గాలన్న రిజల్యూషన్ అటకెక్కించేస్తారు. బరువు తగ్గేందుకు అనుసరించాల్సిన లైఫ్‌స్టైల్ మార్పులు చాలా కష్టమనిపించడమే ఇందుకు కారణం.

కానీ ఒక వ్యూహం చాలా మెరుగ్గా పనిచేస్తుంది. మీ బరువును క్రమంగా తగ్గిస్తుంది. అందేంటంటే భారీ మార్పులు కాకుండా చిన్న చిన్న మార్పులతో ముందుకు సాగడం. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలంటే తక్షణ మార్పులు పనిచేయవు. ఒక క్రమపద్ధతిలో చిన్నిచిన్న మార్పులతో ముందుకు సాగాలి.

Large changes can be hard to sustain: పెద్ద మార్పులు కొనసాగించలేరు

చాలా మంది పెరిగిపోతున్న తమ బరువును చూసి కంగారుపడి భారీ మార్పులకు శ్రీకారం చుడతారు. తినే ఆహారం దగ్గరి నుంచి మొదలు ఫిజికల్ యాక్టివిటీస్ వరకు మార్పులు చేపడతారు. అయితే దీర్ఘకాలంలో ఈ భారీ మార్పులు కొనసాగించలేం. ఎందుకంటే వీటిని అమలు చేయాలంటే నిత్యం మోటివేషన్ అవసరం అవుతుంది. ప్రేరణ అనేది సహజంగా పెరుగుతుంది. మళ్లీ పడిపోతుంది. అందువల్ల ఈ భారీ లైఫ్‌స్టైల్ మార్పులు స్థిరంగా కొనసాగవని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇలాంటప్పుడే స్మాల్ ఛేంజెస్ విధానం అమలు చేయాలి.

వెయిల్ లాస్ కోసం ప్రయత్నించేవారు వెయిట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీని అనుసరించాలి. తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా క్యాలరీలు తగ్గించుకోవాలి. అలాగే తీసుకున్న క్యాలరీలు 100 నుంచి 200 వరకు కరిగించేలా ప్రయత్నించాలి.

అంటే దీనర్థం చాక్లెట్లు, బిస్కెట్లు, అధిక క్యాలరీలు ఇచ్చే ఆహారం తగ్గించుకుని, రోజుకు 10 నుంచి 20 నిమిషాలు నడవాలి. ఇలాంటి చిన్న మార్పులైతే మీరు వెయిట్ లాస్ జర్నీని కొనసాగిస్తారు. చిన్నచిన్న మార్పులు రోజువారీ జీవితంలో ఉంటే సులువుగా ఉంటుంది. భారీ మార్పులైతే బాగా టైమ్ కేటాయించాలి. బాగా కష్టపడాలి.

ఆరోగ్యం విషయంలో చిన్నచిన్న మార్పులే దీర్ఘకాలంలో మేలు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్నచిన్న మార్పుల అమలులో పెద్దగా వైఫల్యాలు కూడా ఎదురవ్వవు.

గతంలో తాము చేపట్టిన అధ్యయనంలో చిన్నచిన్న మార్పుల విధానం వెయిట్ మేనేజ్మెంట్ విషయంలో మంచి ఫలితాలను ఇచ్చిందని లౌబరో విశ్వవిద్యాలయం వెల్లడించింది. వెయిట్ మేనేజ్మెంట్ విషయంలో చిన్న మార్పుల విధానంపై 21 ట్రయల్స్ చేసినట్టు తెలిపింది.

ఈ విధానాన్ని అవలంబించిన వయోజనుల్లో జనరిక్ వెయిట్ మేనేజ్మెంట్ విధానం అవలంభించిన వారితో పోలిస్తే 14 నెలల్లో మెరుగైన ఫలితాలు సాధించారని యూనివర్శిటీ తెలిపింది. వయోజనుల్లో ఏటా అరకిలో, కిలో బరువు పెరగడాన్ని ఈ స్మాల్ ఛేంజ్ అప్రోచ్‌ నిరోధిస్తుంది. ఫలితంగా అధిక బరువు, ఒబెసిటీని నివారించవచ్చు.

అయితే ఈ స్మాల్ ఛేంజ్ అప్రోచ్ దీర్ఘకాలంలో బరువు పెరగడాన్ని ఎంత సమర్థవంతంగా నిరోధించగలరు? బరువు తగ్గడం సాధ్యమవుతుందా? వంటి అంశాలను తేల్చేందుకు మరింత పరిశోధన అవసరం.

How to do it: వెయిట్ లాస్ ప్రక్రియలో ఈ విధానం ఎలా అమలు చేయాలి?

చిన్న మార్పుల విధానం అమలు చేయాలంటే ముందుకు రెండు ప్రశ్నలు వేసుకోండి. రోజుకు 100 నుంచి 200 క్యాలరీలు కరిగించాలన్నా లేదా ఆమేరకు ఆహారం తగ్గించాలన్నా ఏ మార్పులు చేయాలని ప్రశ్న వేసుకోండి. అలాగే మోటివేషన్ తగ్గినప్పుడు కూడా ఈ మార్పులు సాధించగలరా అని ప్రశ్నించకోండి. మీరు అవలంభించబోయే చిన్న మార్పులు మీ రోజువారీ జీవితానికి ఫిట్ అవ్వాలి. దీర్ఘకాలంలో కొనసాగాలి. ఒకవేళ మీరు ఆ చిన్నమార్పులను రూపకల్పన చేసుకోలేకపోతే ఈ కింద ఇచ్చిన ఉదాహరణలు గమనించండి.

మాట్లాడుతూ నడవండి

మీ ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్‌తో ఫోన్ కాల్ మాట్లాడుతుంటే కాసేపు నడవండి. 20 నుంచి 30 నిమిషాలు నడవగలిగితే మీరు కనీసం 100 క్యాలరీలు కరిగించగలరు.

బ్రేక్ తీసుకోండి

టీవీలో యాడ్ బ్రేక్స్ చూశారుగా.. 2 నుంచి 3 నిమిషాల బ్రేక్స్ వస్తుంటాయి. ఈ సమయం మీరు వ్యాయామం చేసేందుకు వినియోగించండి. అంటే క్రంచెస్ లాంటివి. ఒక గంట ప్రోగ్రామ్ వస్తే అందులో కనీసం నాలుగు బ్రేక్స్ వస్తాయి. మీరు ఈజీగా 100 క్యాలరీలు కరిగించవచ్చు.

అదనపు డెకొరేషన్ వద్దు

ఆహారంలో కొందరు చీజ్, బట్టర్, మయోన్నైజ్, కెచప్ వంటివి లేకుండా తీసుకోలేరు. మరింత ఫ్లేవర్ కోసం ప్రయత్నిస్తారు. ఇవే కొంప ముంచుతాయి. అధిక క్యాలరీలు తీసుకునేలా చేస్తాయి. వీటిని త్యాగం చేయండి. కేవలం 30 గ్రాముల చీజ్ 100 క్యాలరీల శక్తినిస్తుంది. 30 గ్రాముల మయోన్నైజ్ 200 క్యాలరీల శక్తినిస్తుంది. పరిమాణం తగ్గించడం, లేదా పూర్తిగా త్యజించడం వల్ల దీర్ఘకాలంలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.

బ్లాక్ కాఫీ తీసుకోండి

లాటే, క్యాపుచినో వంటి హాట్ చాక్లెట్ డ్రింక్స్ మీరు ఊహించిన వాటి కంటే అధిక క్యాలరీలు కలిగి ఉంటాయి. వీటిని తగ్గించడం ద్వారా మీరు 100 నుంచి 200 క్యాలరీలను తగ్గించిన వారవుతారు. కాఫీ లేకుండా మీకు రోజు గడవదనుకుంటే మాత్రం కొద్ది పరిమానంలో గానీ లేా బ్లాక్ కాఫీ గానీ తీసుకోండి.

మీ వెయిట్‌ను మీరు గమనించడం పెద్ద క్లిష్టమైన అంశమేమీ కాదు. మీ డైట్‌లో, లైఫ్‌స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు దీర్ఘకాలంలో వ్యత్యాసాన్ని చూపుతాయి.

- లౌబరో యూనివర్శిటీ

Whats_app_banner