తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : మీకు సూసైడ్ చేసుకోవాలి అనిపిస్తోందా? అయితే చంపేయండి..

Wednesday Motivation : మీకు సూసైడ్ చేసుకోవాలి అనిపిస్తోందా? అయితే చంపేయండి..

18 January 2023, 4:03 IST

    • Wednesday Motivation : మన జీవితంపై విరక్తి కలిగే సందర్భాలు చాలానే ఉంటాయి. అయితే ఒక్కో సమస్యను ఎదుర్కోవడానకి చాలా ధైర్యం కావాలి అంటారు. కానీ ఒక్కోసారి మన మీద మనమే నమ్మకాన్ని కోల్పోతాము. చనిపోవాలి అని డిసైడ్ చేసుకుంటాము. అయితే సమయంలో మీరు సూసైడ్ చేసుకోవడం కాదు.. కొన్నింటిని చంపేయడం నేర్చుకోవాలి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : అదేంటి సూసైడ్ చేసుకోవాలని ఉంటే చంపేయడం ఏంటి కొత్తగా అనుకుంటారా? చంపేయడం అంటే ఎవరినో కాదండి.. మీలోని ఈ సూసైడ్ ఆలోచల్ని చంపేయండి. అవును సమస్యలనేవి మనల్ని బాధపెట్టినా.. అవి ఎవరో ఒకరివల్ల కలిగేవే. అంటే దాని అర్థం మన వల్ల మనకి ఎప్పుడూ సమస్య కాదు. ఎదుటి వారి వల్ల మాత్రమే మనమే సమస్యలను ఎదుర్కొంటున్నాము. మీరు వారిని ఎదురించలేకపోయినా.. లేదా వాటిని మీరు తట్టుకోలేకపోయినా.. దానికి కచ్చితంగా వేరే మార్గం ఏదొకటి ఉంటుంది. అది చావు మాత్రం కాదు.

మీకు ఓ వ్యక్తి వల్ల సమస్య ఉంటే.. ఆ వ్యక్తికి దూరంగా ఉండండి. లేదా ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించి.. వారి నుంచి ప్రేమను కోరుకున్నా దక్కకుంటే.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయండి. మీ ప్రేమను ఎవరికో ఇవ్వడం ఎందుకు. కనీసం మీ మీద చూపించుకున్నా.. మీరు హ్యాపీగా ఉంటారు. మనకి వచ్చే సమస్యలన్నీ ఎదుటివారి వల్లనే కాదు.. మన ఆలోచనల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు మన ఆలోచనలే మనల్ని సమస్యల్లో పడేస్తాయి. దానినే అతిగా ఆలోచించడం అంటారు.

సాధారణంగా మనం ఎంత పాజిటివ్​గా ఉన్నా.. ఏదొక సమయంలో కచ్చితంగా మనల్ని కృంగదీసే సంఘటనలు ఎదురుకావొచ్చు. ఎంతగా అంటే మనలోని పాజిటివ్ ఆలోచనలన్నీ ఆగమాగం అయిపోయి.. నెగిటివ్ ఆలోచనలు బయటకి వస్తాయి అనమాట. ఎందరికో మంచి మాటలు చెప్పే మనం కూడా.. చివరికి ఆ చెడు ఆలోచనల్లో మునిగి తేలుతూ ఉంటాము. మనకే ఎందుకిలా జరుగుతుంది.. మనమేమి తప్పు చేశాము.. నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు.. నా బాధ ఎవరూ అర్థం చేసుకోవట్లేదు.. నేను ఎందుకు బతికుండాలి అనే ఆలోచనలు మన బ్రైన్​తో గేమ్ ఆడుకుంటాయి. ఈ గేమ్​లో ఆలోచనలు గెలిస్తే.. మన ప్రాణాలు పోయినట్టే. కానీ మన నెగిటివ్ ఆలోచనలను అధిగమిస్తే.. బెటర్ ఫ్యూచర్ ఉంటుంది.

చనిపోతే నీ సమస్యలు తీరిపోతాయి అనుకుంటున్నావేమో.. కాదు వాటిని ఎదురించి పోరాడడమే మనం చేయాల్సిన పని. ఈరోజు మనం అనుకున్నది జరగకపోవచ్చు. రేపు జరగకపోవచ్చు. కానీ ఓ పది సంవత్సరాలు తర్వాతైనా నువ్వు అనుకున్నది నీకు జరిగే ఛాన్స్ ఉంది. కావాల్సినప్పుడు రాకుండా.. ఎప్పుడో వస్తే ఏమి లాభం అనుకుంటున్నావేమో.. మంచి రావడానికి ఎప్పుడూ సమయం తీసుకుంటుంది. చెడు జరగాలంటే క్షణకాలం చాలు. జిమ్​లో జాయిన్ అయినా వెంటనే రిజల్ట్స్ వచ్చేస్తాయా? కష్టపడాలి.. చెమటోడ్చాలి.. నోరుకట్టుకోవాలి.. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి.. సరైన నిద్ర ఉండాలి.. ఇలాంటివన్నీ జరిగితేనే అనుకున్న ఫిట్​నెస్​కి చేరుకుంటావు. మన కంట్రోల్​లో ఉంచుకోగలిగే విషయాలే జరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పుడు.. మన కంట్రోల్​లో లేని విషయాల్లో మంచి జరగడానికి ఎక్కువ సమయం తీసుకోవడంలో తప్పులేదు.

కాబట్టి.. మీకు మంచి జరగట్లేదని బాధపడకండి. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. కొన్ని ఆలోచనలకు దూరంగా ఉండాలంటే.. కొన్ని లక్ష్యాలను పెట్టుకోండి. వాటిపై ఫోకస్ పెట్టండి. ముఖ్యంగా మీ శరీరంపై ఫోకస్ చేయండి. అది కండీషన్​లో ఉంటే.. దాదాపు అన్ని ట్రాక్​లోకి వచ్చేస్తాయి. ఇది నిజం. కొంచెం ఓపికగా ఉండండి. కష్టాలన్నీ ఈది గట్టేక్కేస్తారు.