Tuesday Quote : ప్రేమించిన వాళ్లకు దూరంగా ఉండడం.. ప్రేమలేని వాళ్లతో కలిసి ఉండడం.. ఈరోజుల్లో చాలా కామన్
Tuesday Motivation : ప్రస్తుత కాలంలో మనం ఒప్పుకోవాల్సిన చేదు నిజం ఏదైనా ఉంది అంటే.. అది ప్రేమించిన వాళ్లు కలిసి ఉంటారన్నా గ్యారెంటీ లేదు.. కలిసి ఉండేవాళ్లంతా ప్రేమలో ఉన్నారని గ్యారెంటీ లేదు. నిజమే మరి ఇదే అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం.
Tuesday Motivation : అవును చాలా మంది తమ పరిస్థితుల కారణంగానో.. వ్యక్తుల కారణంగానో.. ప్రేమ ఉన్నా వారితో కలిసి ఉండట్లేదు. ప్రేమలేని వ్యక్తులతో కలిసి ఉంటున్నారంటే.. అది కూడా పరిస్థితుల ప్రభావం.. వ్యక్తుల ప్రభావం కావొచ్చు. మొత్తానికి చాలా మంది ప్రేమ అనే జీవితానికి చాలా దూరంగా బతికేస్తున్నారు. ఇది మనం ఒప్పుకోవాల్సిందే.
పెళ్లి అయినా అందరి మధ్య ప్రేమ ఉంటుందా? ఏమో చెప్పలేము. అది వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలపై.. వారి బంధంపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది పెళ్లిళ్లు కట్నం కోసం.. చేసుకుంటారు. మరికొందరు యూఎస్ సంబంధం.. పెళ్లికొడుకు బాగా సంపాదిస్తాడని చేసుకుంటారు. అప్పుడు వారి మధ్య ప్రేమ కన్నా.. కమర్షియల్ ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ సందర్భంలో వారి మధ్య ప్రేమ రావొచ్చు.. రాకపోవచ్చు. డబ్బు ఉంటే చాలులే ప్రేమ లేకపోయినా అన్ని వస్తాయి అని ఆలోచించేవారు కూడా లేకపోలేదు. మరికొందరు పిల్లలు, పెద్దలు అనే కారణాల వల్ల వారు ప్రేమ లేకపోయినా.. సొసైటీ కోసం కలిసే ఉంటారు. తమ కుటుంబ పరువు పోకూడదని.. ప్రేమలేని బంధంలో కలిసి ఉండేవాళ్లు చాలా మందే ఉన్నారు.
అలాగే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుని.. వాళ్లతోనే జీవితం గడపాలి అనుకుని.. ప్రేమలో మునిగి తేలిపోయినా.. వాళ్లు కలిసి ఉంటారనే గ్యారెంటీ లేదు. విచిత్రం ఏమిటంటే.. దీనిలో కూడా పెద్దలు.. వారి కుటుంబ పరువు.. డబ్బే శత్రువులు. పెద్దలు, పరువు ఒకే.. కానీ ఈ డబ్బుతో సమస్య ఏంటి అనుకుంటున్నారా? ఇదే లేకపోతే చాలా మంది వాళ్లకేముందని పెళ్లి చేసుకుంటావ్.. వాళ్లు నిన్ను సరిగా చూసుకోలేరనే కారణాలు చెప్తారు. అదే డబ్బుంది అనుకో.. అన్నిసార్లు కాకపోయినా.. కొన్ని పరిస్థితుల్లో ఆలోచిస్తారు. ఆ డబ్బు అనే టాపిక్‌లో ఉద్యోగం కూడా ఉండొచ్చు. ఉద్యోగం ఉంటే కనీసం ఆలోచించే ఛాన్స్ ఉంది. అది లేకపోతే ఇంక ఆలోచించడానికి ఏమి లేదు. ముఖ్యంగా కుటుంబం, వారి పరువకే ఎక్కువ చోటు ఇస్తారు కాబట్టి.. చాలా మంది ప్రేమించుకున్నా కలిసి బతకలేరు. తమ వారికోసం వారు ఇబ్బంది పడినా.. ప్రేమను త్యాగం చేసేస్తారు.
ఇలా ఏ కారణమైనా కావొచ్చు. కానీ చాలా మంది ఇలానే బతుకుతున్నారు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. ప్రేమ, పెళ్లి అనే కాదు.. ఇలా చాలా బంధాల్లో ఇష్టమున్నా.. లేకపోయినా కలిసి ఉంటున్నారు. లేదా కలిసి బతకలేకపోతున్నారు. బంధాలు ఎప్పుడో కమర్షియల్ అయిపోయాయి. అది ప్రేమ బంధమైనా.. పెళ్లి అయినా.. రక్త సంబంధం అయినా.. స్నేహ బంధమైనా. ఇలా ఏ బంధమైనా ప్రేమ కంటే కమర్షియల్‌గానే ఎక్కువ ముడి పడి ఉంది. అబ్బా అలా కాదు అనుకున్నా ఇదే నిజం. మీ దగ్గర డబ్బు లేనప్పుడు మీతో ఉండి.. తోడుగా నడిచే వాళ్లే మీకు నిజమైన ప్రేమను ఇస్తున్నవారు. మీ దగ్గర డబ్బులు ఉన్నా మీతో ఉండలేకపోతున్నావారు కూడా మిమ్మల్ని ప్రేమించే వారు కావొచ్చు. ఎందుకంటే.. వారికి మీ డబ్బు కన్నా ప్రేమే ముఖ్యం. ఓ బంధం కలిసినా.. అది ఏదైనా కావొచ్చు.. అది కలకలం నిలవడానికి డబ్బు కూడా ఓ కారణం అవుతుంది.
సంబంధిత కథనం