Today Horoscope : నేటి రాశిఫలాలు : వ్యాపారంలో కొత్త ఒప్పందాలు.. కొత్త శత్రువులను తెస్తాయి-today horoscope in telugu based on career and life for 27th august 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Horoscope In Telugu Based On Career And Life For 27th August 2022

Today Horoscope : నేటి రాశిఫలాలు : వ్యాపారంలో కొత్త ఒప్పందాలు.. కొత్త శత్రువులను తెస్తాయి

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 27, 2022 06:45 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? ఆగస్టు 27వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Horoscope : నేటి రాశిఫలాలు (27-08-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశిఫలం

విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. ఉద్యోగ విషయంలో ఆందోళన ఉండవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ కొన్ని చెడు ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

వృషభ రాశిఫలం

ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. శత్రువులను ఓడిస్తారు. భూమి, భవనాల అమ్మకం, కొనుగోలు ఉండవచ్చు. మీకు ఉపాధి లభిస్తుంది. వ్యాపారం బాగుంటుంది. కొత్త కార్యకలాపాలు లాభిస్తాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేస్తారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మిథున రాశిఫలం

మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారం బాగానే ఉంటుంది. దానధర్మాలు చేయడం ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. వ్యాపార పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ పనిలో స్థిరత్వం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. చాలా వరకు విజయం సాధిస్తారు.

కర్కాటక రాశిఫలం

లాభం తీసుకొచ్చే అవకాశాలు మిస్సవుతాయి. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండండి. వివాదాల జోలికి వెళ్లవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ బాధ్యతలను మీరు అర్థం చేసుకుంటారు.

సింహ రాశిఫలం

అదనపు ఖర్చు ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కొత్త శత్రువులు కూడా ఏర్పడవచ్చు. వ్యవసాయ రంగంలో విజయం ఉంటుంది.

కన్య రాశిఫలం

గాయం, దొంగతనం, వివాదాలు మొదలైన వాటి వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. ఓపికతో ఉండండి. అవసరం కంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

తుల రాశిఫలం

కొత్త ప్రణాళికను రూపొందించి.. పనిని విస్తరిస్తారు. వ్యాపారం బాగుంటుంది. పని పట్ల పట్టుదలే మీకు అనుకూలమైన విజయాన్ని అందిస్తుంది. కుటుంబ సభ్యులకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.

వృశ్చిక రాశిఫలం

న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. లాభసాటి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బదిలీలు, పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగానికి మార్గం సులభమవుతుంది. మీ పనితో అందరూ సంతోషంగా ఉంటారు.

ధనుస్సు రాశిఫలం

లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు పెరగడం వల్ల టెన్షన్ వస్తుంది. వివాదం చేయవద్దు. ప్రజా పనులకు సమయం వెచ్చిస్తారు. కుజుడు వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురుకావచ్చు.

మకర రాశిఫలం

వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగం లభిస్తుంది. బహుమతులు అందుకుంటారు. మీరు కొన్ని రోజులుగా ఒక ప్రణాళికతో పని చేస్తుంటే.. ఈ రోజు మీరు అందులో విజయం సాధిస్తారు.

కుంభ రాశిఫలం

ప్రయత్నాలు సఫలమవుతాయి. మీకు గౌరవం లభిస్తుంది. వ్యాపారం బాగుంటుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.

మీనం రాశిఫలం

బకాయిలు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణం విజయవంతమవుతుంది. మంచి నైతికత మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అది మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం