Monday Motivation: ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి.. కానీ ఎవరిని ప్రేమించాలో తెలుసా?-monday motivation on other people liking you is a bonus you liking yourself is the real prize ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Monday Motivation On Other People Liking You Is A Bonus. You Liking Yourself Is The Real Prize

Monday Motivation: ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి.. కానీ ఎవరిని ప్రేమించాలో తెలుసా?

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Monday Motivation : మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారా? లేదా ఫుల్​గా ఇతరులనే ప్రేమిస్తూ.. వారి గురించే ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మానేశారా? అయితే మీరు జీవితంలో నిజమైన ప్రేమను చూడట్లేదని అర్థం. ఎందుకంటే మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేనప్పుడు.. మీకు ఇష్టమైన వారిని ప్రేమగా ఎలా చూస్తారు?

Monday Motivation : ఎప్పుడూ ఎదుటివారికి ప్రేమను ఇవ్వడమే కాదండీ.. కాస్త మీకోసం కూడా దాచుకోండి. ఎందుకంటే మీరు బాగున్నప్పుడే కదా.. మీరు ప్రేమించే వారిని బాగా చూసుకోగలరు. ఎదుటివారిని కొండంత ప్రేమిస్తూ.. మిమ్మల్ని కనీసం పట్టించుకోకుండా.. మీరు కృంగిపోతూ ఉంటే ఇంకేమి లాభం. మీరు బాగుంటే కదా.. మీరు ప్రేమించిన వారితో కలకాలం ఉండొచ్చు. మీరు ప్రేమించిన వాళ్లు ఈరోజు మీ పక్కన లేకపోవచ్చు.. కానీ వారు మీకోసం వచ్చినప్పుడు వారికి ప్రేమను ఇవ్వడానికి మీరు ఉండాలి కదా. కాబట్టి ముందు ఇతరులను ప్రేమించడం మీద ఉంచిన శ్రద్ధలో.. కాస్త మీ మీద తీసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

చాలామంది ప్రేమించిన వారు దూరమైతే.. వారి ప్రేమను ఎలా చూపించాలో తెలియక.. తమని తామే శిక్షించుకుంటారు. వారు మీకు ఎందుకు దూరమయ్యారో మీకు తెలియకపోవచ్చు. కానీ వారు తిరిగి మీ దగ్గరకు రావాలని.. మీ ప్రేమను పొందాలని అనుకుని.. మీకోసం వస్తే.. ఆ ప్రేమను ఇవ్వడానికి మీరు ప్రేమను దాచుకోవాలి కదా. మిమ్మల్ని మీరు శిక్షించుకుంటే మీ ప్రేమను.. మీరు ప్రేమించిన వారికి అందించలేరు. అలా జరగకుండా ఉండాలి అంటే.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.

మీరు బాగుంటే మీ ఫ్యామిలి బాగుంటుంది. మీరు ప్రేమించిన వాళ్లు బాగుంటారు. సెల్ఫ్​ లవ్​ అనేది ఎప్పుడూ మంచిదే. అది మిమ్మల్ని మీకోసమే కాకుండా.. మరో నలుగురికి సహాయం చేసేలా మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. మన జీవితంలో ఇతరులు మనకు ఇచ్చే ప్రేమ బోనస్ అయితే.. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది నిజమైన బహుమతి. అదేంటి బోనస్.. బహుమతి అనుకుంటున్నారేమో. మీకు నెలవారీ జీతంతో పాటు బోనస్ వస్తే.. ఎప్పుడూ ఉండే దానికన్నా హ్యాపీగా ఉంటారు. దానిని బాగా అవసరమైన దానికోసమో.. లేదా ఏదైనా విలువైన వస్తువును కొనుక్కోవడం కోసమో వాడుకుంటారు. అలాగే ఇతరులు ఇచ్చే ప్రేమ వల్ల హ్యాపీగా ఉంటారు. అది మీకు చాలా విలువైనది.

సెల్ఫ్​లవ్​ అనేది.. మనకు ఎవరూ.. ఎలాంటి గిఫ్ట్ ఇవ్వనప్పుడు మనకి మనం ఇచ్చుకోవాల్సిన అతి ముఖ్యమైన గిఫ్ట్ ఇది. మనకు ఎవరైనా ఇచ్చినా.. నీకు కావాల్సిన దాని మీద నువ్వు ఖర్చుపెట్టుకోవాల్సిన హక్కు నీకు ఉంది. కాబట్టి సెల్ఫ్​లవ్​ అనేది ఏమి బూతు కాదు. నీకు నువ్వు ఇచ్చుకునే గౌరవం. నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే ఎదుటి వాళ్లని నువ్వు ప్రేమించగలవు.. ఎదుటి వారు నిన్ను ప్రేమించగలరు.

ఎందుకంటే నిన్ను నువ్వు నమ్మినప్పుడే కదా.. ఎదుటి వాళ్లు నిన్ను నమ్మగలిగేది. ఎన్నాళ్లు బతుకుతానో తెలియదు.. ఇప్పుడే ఏదో అయిపోతా అంటే.. ఎవరైనా నీతో ఎందుకు ఉంటారు చెప్పు. వాళ్లు వచ్చినాక నువ్వు వెళ్లిపోతే నీ ప్రేమకు అర్థం ఏముంది. కాబట్టి ప్రేమించిన వాళ్లతో కలిసి బతకాలి అంటే.. చావు గురించి.. చచ్చిపోయేంత ప్రేమ అని కాకుండా.. కలిసి బతకాలి అనేదాని గురించి ఆలోచించండి. ముందు మీ విలువ మీకు తెలిస్తే.. ఎదుటివాళ్లు మీరు విలువైన వాళ్లని గుర్తిస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం