Monday Quote : నెగిటివ్ ఆలోచనలు మీ పరిస్థితిని బెటర్ చేయవు.. సో థింక్ పాజిటివ్-monday motivation on being negative only makes a difficult journey more difficult ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Quote : నెగిటివ్ ఆలోచనలు మీ పరిస్థితిని బెటర్ చేయవు.. సో థింక్ పాజిటివ్

Monday Quote : నెగిటివ్ ఆలోచనలు మీ పరిస్థితిని బెటర్ చేయవు.. సో థింక్ పాజిటివ్

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 31, 2022 05:30 AM IST

Monday Motivation : ప్రతికూల ఆలోచనలు అనేవి మీ పరిస్థితిని మరింత దిగజార్చుతాయి. మీకు నిజంగానే అనుకున్నవేమి జరగట్లేదు అనుకుందాం. మీరు ఏదిచేసినా.. వ్యతిరేకంగానే ఫలితాలు వస్తున్నాయి అనుకో.. ఆ సమయంలో కూడా మనం పాజిటివ్​గా ఆలోచించగలగాలి. లేదంటే మన పరిస్థితి ఇంకా దిగజారుతుంది.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Monday Motivation : ఏది మనకు అనుకూలంగా జరగనప్పుడు ప్రతికూల ఆలోచనలతో మనసు నిండిపోతుంది. బ్రెయిన్​ కూడా నువ్వు ఏది చేసినా.. నీకు ఫలితాలు అనుకూలంగా రావని చెప్తుంది. ఈ రకమైన మనస్తత్వం మనల్ని మరింత దిగజార్చుతుంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాజిటివ్​గా ఉండడం నేర్చుకోవాలి. అంత సులువు కాదు పాజిటివ్​గా ఉండడం. కానీ.. నెగిటివ్ ఆలోచనలు మీ పరిస్థితిని ఎప్పుడూ మెరుగుపరచవు. ఇంకా దిగజార్చుతూనే ఉంటాయి.

మనం ఎక్కువగా ఎలా థింక్ చేస్తామో.. మనకు అవే ఎక్కువగా జరగుతాయి అంటారు. అందుకే అందరూ పాజిటివ్​గా ఆలోచించు అని చెప్తారు. సానుకూల ఆలోచనలు పరిస్థితులను మెరుగుపరుస్తాయి.. పాజిటివ్ వైబ్స్ ఇస్తాయంటారు. అలాగే నెగిటివ్ ఆలోచనలు పరిస్థితులు సర్దుకునేలా కాకుండా.. వాటిని మరింత క్లిష్టంగా మారేలా చేస్తాయి.

ఓటమి వచ్చిన ప్రతిసారి.. మనసు నెగిటివ్ ఆలోచనలనే ఎక్కువ కలిగిస్తుంది. ముందు మన ఆలోచనలను మనం జయిస్తే.. అనుకున్నవి సాధించడం సులువు అవుతుంది. మన శత్రువు మనతో పోటిపడే వ్యక్తి కాదు.. మన ఆలోచనలే మన గెలుపు, ఓటములను డిసైడ్ చేస్తాయి. మీరు మంచి అనుకుంటే మంచే జరుగుతుంది. ఈరోజు కాకుంటే రేపు అయినా మీకు మంచే జరుగుతుంది. మీ మీద మీరు ఎంత నమ్మకంగా ఉంటే.. పోటీకి తగ్గట్లు మిమ్మల్ని సిద్ధం చేసుకుంటే విజయం మీకు కచ్చితంగా దక్కుతుంది.

ఎప్పుడూ ఎవరో గెలుస్తారేమో అనే భయంతో.. నేను గెలవలేను అనే అభద్రతా భావంతో ఉండకండి. ఈ నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టి.. నేను గెలుస్తాను.. నేను దీనిని కచ్చితంగా సాధించి తీరుతాను అనే కసితో అడుగు ముందుకు వేయండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. కాస్త ఆలస్యమైన కచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అంతేకానీ నెగిటివ్ ఆలోచనలతో.. నాకు చేత కాదు.. నేను ఓడిపోతానేమో.. నేను క్వాలిఫై అవ్వనేమో.. తను నా కన్నా బలంగా ఉన్నాడు అనే ఆలోచనలతో మీరు ఏ పోటీకి దిగినా.. మీకు ఓటమే ఎదురవుతుంది. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం చాలా ముఖ్యం. ఎవరో మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు. మీరు జర్నీ చేయడానికి ఎవరి తోడూ అవసరం లేదు. మీకు మీరు స్టాండ్ తీసుకున్నంత కాలం.. మిమ్మల్ని ఏ ఓటమి ఆపలేదు.

సంబంధిత కథనం