తెలుగు న్యూస్ / ఫోటో /
Brain Break । మీ బ్రెయిన్‌కు కొంచెం బ్రేక్ ఇవ్వండి.. ప్రశాంతగా ఉంటుంది!
- మీరు పని నుంచి కొంత విరామం తీసుకుంటారు. మరి ఆ సమయంలో మీ మెదడును ప్రశాంతంగా ఉంచుతున్నారా? నిరంతర ఆలోచనలు, ఆందోళన మంచివి కావు. దీర్ఘకాలిక ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. న్యూట్రిషనిస్ట్ భక్తి కపూర్ మీ మెదడుకు విరామం ఇచ్చేందుకు కొన్ని చిట్కాలు చెప్పారు.

(1 / 8)
ఏవేవో ఆలోచనలతో మీ మెదడును నింపేస్తే దానిపై భారం పెరిగి అది సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. మీ ఆలోచనలను పాజ్ చేసినపుడే మీరు రీఛార్జ్ అవ్వగలుగుతారు. అప్పుడే మీరు హుషారుగా, ఆరోగ్యంగా ఉంటారు. బ్రెయిన్ కు బ్రేక్ ఇవ్వడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదో న్యూట్రిషనిస్ట్ భక్తి కపూర్ కొన్ని చిట్కాలు తెలియజేశారు.(Pixabay)
(2 / 8)
మీ ఫోన్‌ని చూడటం మానేయండి. కొద్దిసేపు అలా బయటికి వెళ్లి స్వచ్ఛమైన గాలిని పీల్చండి.(Shutterstock)
(3 / 8)
ఎల్లప్పుడూ సోషల్ మీడియా స్క్రోల్ చేసే బదులు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి.(Pixabay)
(4 / 8)
ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్‌ని తెలుసుకోవడం, టీవీలో ఇతర సమాచార మాధ్యమాలు చెడు వార్తలను వినడం, దురదృష్టకర సంఘటనలు చూడటం మానుకోండి.(Pixabay)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు