Brain-Building Exercise | బాడీనే కాదు బ్రెయిన్ పెరగాలన్నా.. ఎక్సర్‌సైజులే చేయాలి-exercise not only for body but also for brain building ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Brain-building Exercise | బాడీనే కాదు బ్రెయిన్ పెరగాలన్నా.. ఎక్సర్‌సైజులే చేయాలి

Brain-Building Exercise | బాడీనే కాదు బ్రెయిన్ పెరగాలన్నా.. ఎక్సర్‌సైజులే చేయాలి

Jun 14, 2022, 10:16 PM IST HT Telugu Desk
Jun 14, 2022, 10:16 PM , IST

  • ఎక్సర్‌సైజులు చేస్తే మంచి శరీరాకృతి లభిస్తుంది. ఫిట్‌గా ఉంటామని మనకు తెలుసు. ఈ ఎక్సర్‌సైజు శరీరంతో పాటు మెదడును కూడా అభివృద్ధి చేస్తుందట. ఎక్సర్‌సైజుకి మైండ్‌కి ఉన్న సంబంధం ఇక్కడ తెలుసుకోండి.

వ్యాయామం ద్వారా మెదడుకు పలు రకాలుగా ప్రయోజనం కలుగుతుంది. మెదడులోని కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది, ఈ కారణంగా మరింత ఆక్సిజన్ మెదడుకు అందుతుంది. అలాగే మెదడు ప్లాస్టిసిటీని కూడా వ్యాయామం మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేయడం వల్ల మీ మెదడుకు కలిగే ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు భక్తి కపూర్ వివరించారు. 

(1 / 6)

వ్యాయామం ద్వారా మెదడుకు పలు రకాలుగా ప్రయోజనం కలుగుతుంది. మెదడులోని కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది, ఈ కారణంగా మరింత ఆక్సిజన్ మెదడుకు అందుతుంది. అలాగే మెదడు ప్లాస్టిసిటీని కూడా వ్యాయామం మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేయడం వల్ల మీ మెదడుకు కలిగే ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు భక్తి కపూర్ వివరించారు. (Unsplash)

వ్యాయామం హృదయ స్పందన రేటును పెంచుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ మెదడుకు పంప్ అవుతుంది. ఇది హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే మెదడు కణాల అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించినట్లవుతుంది.

(2 / 6)

వ్యాయామం హృదయ స్పందన రేటును పెంచుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ మెదడుకు పంప్ అవుతుంది. ఇది హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే మెదడు కణాల అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించినట్లవుతుంది.(Unsplash)

వ్యాయామం చేస్తున్నప్పుడు మెదడులోని అనేక కార్టికల్ ప్రాంతాలలో కణాల మధ్య కొత్త కనెక్షన్‌ల ఏర్పాటు జరుగుతుంది. ఈ రకంగా ఇది మెదడు ప్లాస్టిసిటీని మెరుగుపరుస్తుంది.

(3 / 6)

వ్యాయామం చేస్తున్నప్పుడు మెదడులోని అనేక కార్టికల్ ప్రాంతాలలో కణాల మధ్య కొత్త కనెక్షన్‌ల ఏర్పాటు జరుగుతుంది. ఈ రకంగా ఇది మెదడు ప్లాస్టిసిటీని మెరుగుపరుస్తుంది.(Unsplash)

వ్యాయామం ఒత్తిడి, ఆందోళనను తగ్గించి పరోక్షంగా మంచి నిద్ర కలిగేలా ఆస్కారం కల్పిస్తుంది. తద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఏకాగ్రత, చిత్త లోపం సమస్యలు కలగవు.

(4 / 6)

వ్యాయామం ఒత్తిడి, ఆందోళనను తగ్గించి పరోక్షంగా మంచి నిద్ర కలిగేలా ఆస్కారం కల్పిస్తుంది. తద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఏకాగ్రత, చిత్త లోపం సమస్యలు కలగవు.(Unsplash)

వ్యాయామం చేస్తుంటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. కనీసం వారానికి రెండుసార్లైనా ఒక గంట పాటు నడిచినా చాలు. నడక వద్దనుకుంటే ఈత కొట్టడం, మెట్లు ఎక్కడం-దిగడం, టెన్నిస్, స్క్వాష్, డ్యాన్స్ వంటి అదనపు మోడరేట్-ఇంటెన్సిటీ వర్కవుట్‌లు ప్రయత్నించండి.

(5 / 6)

వ్యాయామం చేస్తుంటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. కనీసం వారానికి రెండుసార్లైనా ఒక గంట పాటు నడిచినా చాలు. నడక వద్దనుకుంటే ఈత కొట్టడం, మెట్లు ఎక్కడం-దిగడం, టెన్నిస్, స్క్వాష్, డ్యాన్స్ వంటి అదనపు మోడరేట్-ఇంటెన్సిటీ వర్కవుట్‌లు ప్రయత్నించండి.(unsplash)

సంబంధిత కథనం

Exercises for ease depressionపీరియడ్స్ సమయంలో ఇలా ట్రై చేయండి..బెల్లీ డ్యాన్స్ డేWalking Reverse Running
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు