Fitness in During Periods: పీరియడ్స్‌లో ఎక్కువ తినాలనిపిస్తుందా? ఇలా ట్రై చేయండి
అమ్మాయిలకు పీరియడ్స్ అనేది చాలా భయంకరమైన సమయం. ఆ సమయంలో తిమ్మిరి, వెన్నునొప్పి ఉంటుంది. అంతేకాకుండా అతిగా చాక్లెట్లు, జంక్ ఫుడ్ తినాలని ప్రేరేపిస్తుంది. ఇవి పీరియడ్స్ సమయంలో మానసిక కల్లోలం, నొప్పి నుంచి కాస్త ఉపశమనం ఇస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు. కానీ ఇవి మీ ఫిట్‌నెస్ లక్ష్యాల నుంచి మిమ్మల్ని మరింత దూరం చేస్తాయని వెల్లడించారు.
Fitness Goals During Periods : పీరియడ్స్ సమయంలో మీ పోషకాహారం, వ్యాయామ దినచర్యను సర్దుబాటు చేయడం వలన మీరు ఆరోగ్యంగా ఉండటానికి, మీ ఫిట్‌నెస్ లక్ష్యాలపై దృష్టి పెట్టడంలో సహాయపడతాయి. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే పీరియడ్స్ సమయంలోని స్వీట్ కోరికలు మిమ్మల్ని కాస్త ఇబ్బందిని కలిగించవచ్చు. ఇది “పీరియడ్స్ సెరోటోనిన్‌లో మార్పుకు దారితీస్తాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలను భంగపరుస్తాయి. ఫలితంగా ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్‌ను ఏర్పడుతుంది. PMS అనేది మహిళలు అండోత్సర్గము తర్వాత, వారి రుతుక్రమానికి ముందు ఆందోళన, చిరాకు, మానసిక ఇబ్బందులను కలిగిస్తుంది. ఋతుస్రావం ముందు ఇన్సులిన్ సంబంధిత హార్మోన్ స్థాయిలు పెరిగి.. చాక్లెట్లు, బ్రెడ్, కేకులు వంటివి తినాలనే కోరికను కలిగిస్తాయి. ఇది ఎక్కువ ఆహారం తినేలా మెదడును ప్రేరెపిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో మీ పోషకాహారం, వ్యాయామ దినచర్యను సర్దుబాటు చేయడం వల్ల.. ఆ రోజుల్లో కూడా మీరు ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తుంది.
మీ భోజన ప్రణాళికలో అధిక-ఫైబర్ ఆహారాలను చేర్చండి. అధిక ఫైబర్ ఉన్న భోజనం తినడం వల్ల మీ పీరియడ్స్ సమయంలో నొప్పి, తిమ్మిరి, మానసిక స్థితిని తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు 23 నుంచి 31 గ్రాముల వరకు ఫైబర్ తీసుకోవడం వల్ల PMS నొప్పి, ఉబ్బరం తగ్గినట్లు అధ్యయనాలు నివేదించాయి. ఈ అధిక ఫైబర్ మీల్స్‌లో బీన్స్, తృణధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు, గింజలు ఉండేలా చూసుకోండి.
ప్రొటీన్లు
మిమ్మల్ని మీరు సంతృప్తిగా ఉంచుకోవడానికి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. శరీరం తట్టుకోలేని తిమ్మిర్లును, నొప్పులను తట్టుకుని.. మీ శక్తి స్థాయిలు క్షీణించకుండా ఉండాలంటే మీరు సరిగ్గా తినాలి. స్వీట్ కోరికలకు లొంగిపోవడానికి బదులు.. భోజనంలో ప్రొటీన్లు అధికంగా ఉండేలా ప్లాన్ చేసువాలి. ఇది మిమ్మల్ని బాగా సంతృప్తికరంగా ఉంచుతుంది. చికెన్, సోయా, ఉడికించిన గుడ్లు, పాలు లేదా పనీర్ వంటివి చాలా మంచివి.
మల్టీవిటమిన్‌లు
ఈ సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం ఒక క్లిష్టమైన అంశం. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పీరియడ్స్ నొప్పులకు ఉపయోగపడతాయి. మంచి ప్రోస్టాగ్లాండిన్‌లను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి పదార్థాలను ఇది శరీరానికి అందిస్తుంది. కాబట్టి ఒక చేప నూనె క్యాప్సూల్ (EPA, DHA మంచి నిష్పత్తితో) తీసుకోవడం మంచిది. విటమిన్లు B, E, మెగ్నీషియం కలిగిన మల్టీవిటమిన్లు తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మీ అవసరాన్ని బట్టి డాక్టర్ల సూచనల మేరకు వీటిని వినియోగించాలి.
హైడ్రేటెడ్‌గా ఉండండి
మీ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు తగ్గినప్పుడు మీ శరీరంలో నీటి స్థాయిలు తగ్గుతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం కలిగిస్తుంది. అందుకే మీ పీరియడ్స్ సమయంలో రోజుకు కనీసం 9 నుంచి 10 గ్లాసుల నీరు తాగితే మంచిది. ఇది మీ సిస్టమ్‌లోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయం చేస్తుంది.
లైట్ కార్డియో లేదా మోడరేట్ ఇంటెన్సిటీ వర్కౌట్
మీ పీరియడ్ సమయంలో మీ వర్కవుట్‌లను దాటవేయడానికి శాస్త్రీయంగా నిరూపితమైన కారణం లేదు. ఈ సమయంలో వ్యాయామం ఉపయోగకరంగా ఉంటుందని ఆధారాలు ఉన్నాయి. మీ పీరియడ్స్‌కు ముందు రెండు మూడు రోజులు మితమైన ఇంటెన్సిటీ వర్కవుట్ సెషన్‌లో పాల్గొనడం వల్ల మీ శరీరం ప్రశాంతంగా ఉంటుంది. తిమ్మిరి, రొమ్ము సున్నితత్వం, కండరాల అలసట మరియు పుండ్లు పడడం వంటి లక్షణాలను తగ్గించవచ్చు. తేలికపాటి కార్డియో, నడక లేదా తక్కువ సమయంలో ఏరోబిక్ వ్యాయామాలను కూడా చేయవచ్చు. ఎందుకంటే ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కొన్ని కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
సంబంధిత కథనం
టాపిక్