Kinds Of Rest | మానసిక ప్రశాంతతకు.. ఈ 7 విశ్రాంతులు అవసరం-7 kinds of rests to take from busy life ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kinds Of Rest | మానసిక ప్రశాంతతకు.. ఈ 7 విశ్రాంతులు అవసరం

Kinds Of Rest | మానసిక ప్రశాంతతకు.. ఈ 7 విశ్రాంతులు అవసరం

Mar 08, 2022, 04:01 PM IST Geddam Vijaya Madhuri
Mar 08, 2022, 04:01 PM , IST

  • ఏ వస్తువుకైనా రీఛార్జ్ అవసరం. వస్తువులకు బ్యాటరీలు ఎలాగో.. మనుషులకు కూడా అంతే. ఒక స్టేజ్​లో శరీరం, మనస్సు ఎంతో ఒత్తిడి తీసుకుంటుంది. దానిని పునరుద్ధరించడానికి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమైన మార్గం. అయితే ఎలాంటి విశ్రాంతి తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్రాంతి తీసుకోవడం మనిషికి చాలా అవసరం. ఇది మీకు మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. విరామం తీసుకుని పని కొనసాగించేవారు ఎల్లప్పుడు చురుకుగా ఉంటారు. పనిని సులువుగా చేసుకుంటారు. కొందరు అస్సలు బ్రేక్​ కూడా తీసుకోకుండా కష్టపడి అనారోగ్యం పాలవుతారు. ఈ విషయమై టిమ్ గ్రే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 7 రకాల విశ్రాంతి మనిషికి చాలా ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. 

(1 / 8)

విశ్రాంతి తీసుకోవడం మనిషికి చాలా అవసరం. ఇది మీకు మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. విరామం తీసుకుని పని కొనసాగించేవారు ఎల్లప్పుడు చురుకుగా ఉంటారు. పనిని సులువుగా చేసుకుంటారు. కొందరు అస్సలు బ్రేక్​ కూడా తీసుకోకుండా కష్టపడి అనారోగ్యం పాలవుతారు. ఈ విషయమై టిమ్ గ్రే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 7 రకాల విశ్రాంతి మనిషికి చాలా ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. (Pixabay)

శారీరక విశ్రాంతి: మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రపోవడం మీకు శక్తినిస్తుంది, అలసటను తగ్గిస్తుంది. అంతేకాకుండా మీరు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. విశ్రాంతి తీసుకోవడం ఒత్తిడి చాలా మేరకు తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి పడుకునే ముందు విశ్రాంతి వ్యాయామాలు కూడా చేయవచ్చు.

(2 / 8)

శారీరక విశ్రాంతి: మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రపోవడం మీకు శక్తినిస్తుంది, అలసటను తగ్గిస్తుంది. అంతేకాకుండా మీరు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. విశ్రాంతి తీసుకోవడం ఒత్తిడి చాలా మేరకు తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి పడుకునే ముందు విశ్రాంతి వ్యాయామాలు కూడా చేయవచ్చు.(Pexels)

మానసిక విశ్రాంతి: మన రోజువారి దినచర్య మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇది మనం ఊహించగలిగే దానికంటే ఎక్కువ రకాలుగా ప్రభావితం చేస్తుంది. ధ్యానం అనేది అంతర్గత స్వీయంతో కనెక్ట్ అవ్వడానికి, పనులను మరింత సమర్థవంతంగా చేయడానికి సహాయపడుతుంది. బాగా అలసిపోయినట్లు అనిపిస్తే సంగీతం మానసిక విశ్రాంతిని అందిస్తుంది.

(3 / 8)

మానసిక విశ్రాంతి: మన రోజువారి దినచర్య మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇది మనం ఊహించగలిగే దానికంటే ఎక్కువ రకాలుగా ప్రభావితం చేస్తుంది. ధ్యానం అనేది అంతర్గత స్వీయంతో కనెక్ట్ అవ్వడానికి, పనులను మరింత సమర్థవంతంగా చేయడానికి సహాయపడుతుంది. బాగా అలసిపోయినట్లు అనిపిస్తే సంగీతం మానసిక విశ్రాంతిని అందిస్తుంది.(Pexels)

భావోద్వేగ విశ్రాంతి:  మనమందరం  ముందుగా మన భావోద్వేగ బ్యాటరీలను ఛార్జ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మానసిక ఆరోగ్యాన్ని విస్మరించకూడదు. సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం కాస్త సహాయం చేస్తుంది కానీ.. ఇది ఏమాత్రం హెల్ప్​ చేయలేదని భావిస్తే వైద్యుని సంప్రదించడంలో వెనుకాడకూడదు.

(4 / 8)

భావోద్వేగ విశ్రాంతి:  మనమందరం  ముందుగా మన భావోద్వేగ బ్యాటరీలను ఛార్జ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మానసిక ఆరోగ్యాన్ని విస్మరించకూడదు. సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం కాస్త సహాయం చేస్తుంది కానీ.. ఇది ఏమాత్రం హెల్ప్​ చేయలేదని భావిస్తే వైద్యుని సంప్రదించడంలో వెనుకాడకూడదు.(Pexels)

ఒంటరిగా గడపండి: రోజులో ఎన్నో విషయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. వాటిని పట్టించుకోకుండా.. మీకు మీరే సమయం ఇచ్చుకోండి. నాకు, నా మనసుకు తగినంత విశ్రాంతి అవసరమని మీకు మీరే చెప్పుకోండి. ఒంటరిగా నడవండి.. పుస్తకాలు చదవండి. మీకు మీరుగా టీ బ్రేక్ తీసుకోండి. ఇది మనం రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. 

(5 / 8)

ఒంటరిగా గడపండి: రోజులో ఎన్నో విషయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. వాటిని పట్టించుకోకుండా.. మీకు మీరే సమయం ఇచ్చుకోండి. నాకు, నా మనసుకు తగినంత విశ్రాంతి అవసరమని మీకు మీరే చెప్పుకోండి. ఒంటరిగా నడవండి.. పుస్తకాలు చదవండి. మీకు మీరుగా టీ బ్రేక్ తీసుకోండి. ఇది మనం రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. (Pexels)

సృజనాత్మకతను బయటకు తీయండి: సృజనాత్మక కార్యకలాపం చేయడం వల్ల మీ ఇంద్రియాలను రిఫ్రెష్ చేయవచ్చు. మీలో ఏదొక టాలెంట్ ఉండే ఉంటుంది. దానికి ప్రాధన్యతనిస్తూ చేసే ఏ పని అయినా… మనలో కొత్త శక్తిని నింపుతుంది. పెయింటింగ్, చదవడం, రాయడం - మీ కోసం ఏదైనా చేయండి.

(6 / 8)

సృజనాత్మకతను బయటకు తీయండి: సృజనాత్మక కార్యకలాపం చేయడం వల్ల మీ ఇంద్రియాలను రిఫ్రెష్ చేయవచ్చు. మీలో ఏదొక టాలెంట్ ఉండే ఉంటుంది. దానికి ప్రాధన్యతనిస్తూ చేసే ఏ పని అయినా… మనలో కొత్త శక్తిని నింపుతుంది. పెయింటింగ్, చదవడం, రాయడం - మీ కోసం ఏదైనా చేయండి.(Pexels)

ఆధ్యాత్మిక విశ్రాంతి: ప్రకృతితో కలిసి ఉండటం కంటే మీ ఆత్మకు ఏదీ మెరుగ్గా పని చేయదు, ప్రత్యేకించి మీరు ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారైతే.. ప్రకృతితో మమేకమవండి. మొక్కలు పెంచండి. బీచ్​లకు వెళ్లండి. ఏదైనా కొత్త ప్రాంతాన్ని విజిట్ చేయండి.

(7 / 8)

ఆధ్యాత్మిక విశ్రాంతి: ప్రకృతితో కలిసి ఉండటం కంటే మీ ఆత్మకు ఏదీ మెరుగ్గా పని చేయదు, ప్రత్యేకించి మీరు ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారైతే.. ప్రకృతితో మమేకమవండి. మొక్కలు పెంచండి. బీచ్​లకు వెళ్లండి. ఏదైనా కొత్త ప్రాంతాన్ని విజిట్ చేయండి.(Pexels)

ఇంద్రియ విశ్రాంతి: మన మనస్సు విశ్రాంతి తీసుకోలేని పరికరాలను దారిదాపుల్లో ఉంచుకోకండి.  ఈ పరికరాల నుంచి విశ్రాంతి అవసరమని భావిస్తే.. మీ పరికరాలన్నింటినీ ఒక రోజు పాటు ఆఫ్ చేసి ప్రశాంతంగా గడపండి.

(8 / 8)

ఇంద్రియ విశ్రాంతి: మన మనస్సు విశ్రాంతి తీసుకోలేని పరికరాలను దారిదాపుల్లో ఉంచుకోకండి.  ఈ పరికరాల నుంచి విశ్రాంతి అవసరమని భావిస్తే.. మీ పరికరాలన్నింటినీ ఒక రోజు పాటు ఆఫ్ చేసి ప్రశాంతంగా గడపండి.(Pexels)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు