Saturday Quote : మనం పాజిటివ్‌గా ఉండాలంటే.. నెగిటివ్ వ్యక్తులకు దూరంగానే ఉండాలి
Saturday Motivation : మీ లైఫ్‌లో మీకు నెగిటివ్‌గా అనిపించే వ్యక్తులను మీరు దూరం చేసుకుంటున్నారంటే దాని అర్థం మీరు వాళ్లని ద్వేషిస్తున్నారని కాదు.. మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారని అర్థం. మీ సెల్ఫ్రెస్పెక్ట్కి వాల్యూ ఇచ్చుకుంటున్నారని అర్థం.
Saturday Motivation : కొందరితో మాట్లాడుతున్నప్పుడు.. లేదా కలిసి ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్లనుంచి మనకు నెగిటివ్ వైబ్స్ వస్తాయి. లేదంటే వాళ్లు మనతో నెగిటివ్ విషయాలే ఎక్కువగా చర్చిస్తారు. మనకు సెన్స్ అవుతుంది.. వాళ్ల నుంచి మనకు నెగిటివ్ ఫీలింగ్ వస్తుందని. అలాంటి వారికి దూరంగా ఉండడం తప్పేమి కాదు. మీరు వారికి దూరంగా ఉంటున్నారంటే.. దాని అర్థం మీరు వారిని ద్వేషిస్తున్నారని కాదు. వారి నుంచి వస్తున్న నెగిటివ్ వైబ్స్.. మీ పాజిటివ్ వైబ్స్‌ని డ్యామేజ్ చేయకూడదు అనుకుంటున్నారు అంతే.
కొందరు ఎలా ఉంటారంటే.. మనం ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు.. మన పక్కనే ఉంటే.. అది చేయడం అవసరమా? నువ్వు చేయలేవు.. నీకు చేత అంటూ మన పక్కనే ఉంటే.. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు అలాంటి వారికి కాస్త దూరంగా ఉండటమే బెటర్. ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతాము కానీ.. అలా నెగిటివ్ వైబ్స్ ఇస్తూ.. వెనక్కి లాగే వాళ్లు ఉన్నంత కాలం సక్సెస్ అనేది అందని ద్రాక్షనే.
ఎప్పుడూ అదే పనిగా.. ఇతరుల గురించి చాడీలు చెప్తూ ఉన్నారంటే వాళ్లు కూడా నెగిటివ్ వైబ్స్ ఇస్తున్నట్లే అర్థం. మనం వెళ్లాక వేరే వాళ్లతో మన గురించి చర్చించవచ్చు. లేదా ఇతరుల గురించి మనకి లేనిపోనివి చెప్తూ.. మనల్ని వారికి దూరం చేయవచ్చు. మనమే వాళ్లని అసహ్యించుకునేలా చేయవచ్చు. దీనివల్ల మీరు ఎవరితోనూ సరిగా ఉండలేరు. తెలియకుండానే మీరు వారి కంట్రోల్‌కి వెళ్లిపోతున్నారని మీకు తెలిసిన క్షణం మీరు నెగిటివ్ వైబ్స్ ఇస్తున్నవారికి దూరంగా ఉండేందుకు వెనుకాడరు. దాని అర్థం మీరు వారిని ద్వేషిస్తున్నారని కాదు. మీరు అంత నెగిటివ్‌గా తయారవకూడదని అనుకుంటున్నారని గ్రహించాలి.
నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉన్నప్పుడే.. మీరు కూడా నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటారు. ఇది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే నెగిటివిటీ ఎప్పుడూ మీకు నిరాశ, ఆగ్రహాన్నే బదులుగా ఇస్తుంది. అలాంటి వ్యక్తులతో గడపడం కన్నా.. మీరు మీతో సమయాన్ని ప్రొడెక్టివ్గా గడిపేందుకు ఇష్టపడుతున్నారని అర్థం. కాబట్టి మీరు వారిని దూరం చేసుకున్నందుకు చింతించవద్దు. అది స్వార్థం కాదు. అది మీ అవసరం. మిమ్మల్ని మీరు సంతోషంగా, పాజిటివ్‌గా ఉంచుకోవడానికి చేసే ప్రయత్నం.
సంబంధిత కథనం