Thursday Quote : నెగిటివ్ ఆలోచనలు మానేసినప్పుడే.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి..-thursday motivation on when you close the door of negative thoughts the door of opportunity opens to you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Quote : నెగిటివ్ ఆలోచనలు మానేసినప్పుడే.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి..

Thursday Quote : నెగిటివ్ ఆలోచనలు మానేసినప్పుడే.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి..

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 06, 2022 06:32 AM IST

Thursday Motivation : నేను ఎంత ట్రై చేసినా నాకు అవకాశాలు రావట్లేదు అనుకుంటాం కానీ.. మన నెగిటివ్ ఆలోచనలు ఆపేస్తే.. మనకు ఏమి అవకాశాలు వస్తున్నాయో తెలుస్తుంది. మన ఆలోచనలే వాటిని మనకు కనిపించనీవు. అందుకే అవకాశాలు రావట్లేదని బాధపడుతూ ఉంటాము.

<p>కోట్ ఆఫ్ ద డే</p>
కోట్ ఆఫ్ ద డే

Thursday Quote : పిల్లి పాలు తాగేటప్పుడు కళ్లు మూసుకుని నన్ను ఎవరూ చూడట్లేదు అంటుందని ఓ సామెత ఉంది. మనం కూడా అంతే పూర్తిగా నెగిటివ్ ఆలోచనల్లో ఉండి.. వచ్చిన, వస్తున్న అవకాశాలను కూడా చూడలేకపోతున్నాం. పైగా మనకు అవకాశాలు రావట్లేదని నిందిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు.

మన నెగిటివ్ ఆలోచనలను మనం కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే మనకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే.. మనకు వచ్చే ప్రతి అవకాశాన్ని మనం నెగిటివ్​గా తీసుకోవడం వల్ల.. అది అవకాశం అనే విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాం. సో ప్రాబ్లం అంతా.. మన బ్రెయిన్​దే. అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించి.. కళ్లముందున్న అవకాశాలను కూడా దూరం చేస్తుంది.

అవకాశాలు అనేవి అతిథుల్లాంటివి. ఎప్పుడూ పడితే అప్పుడు రావు. ఎప్పుడో ఓసారి వస్తాయి. అప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే.. మళ్లీ అవి ఎప్పటికి వస్తాయో.. అసలు వస్తాయో.. రావో.. కూడా చెప్పలేము. కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడు మనం అలెర్ట్​గా ఉండాలి. దానికోసం మనం ఎదురు చూడాలి. మనలో నెగిటివ్ ఆలోచనలు ఉంటే మనం ఎదురు చూడలేము. అవి మనకు అవకాశాలు ఎందుకు వస్తాయిలే అనే ధోరణిని మనకు అలవాటు చేసేస్తాయి. అందుకే మనకు అవకాశాలు వస్తున్నా పట్టించుకోము. వచ్చిన అవకాశాలను మనం చూడలేము కూడా. వచ్చిన దానిని ఓ అవకాశంలాగే భావించము. ఎందుకంటే మన మీద నమ్మకం ఉంచము కాబట్టి. అసలు మనకు వచ్చే సవాల్ లేదు. మనకి తప్పా అందరికీ అవకాశాలు వస్తాయనే భ్రమలో బతుకుతాము కాబట్టి.. మనకి ఎప్పుడూ మంచి జరిగినా.. కళ్లు మూసుకుని నాకే అవకాశాలు రావట్లేదని.. వాళ్లని.. వీళ్లని బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటాము.

ఎప్పుడైతే.. పాజిటివ్​గా ఆలోచించడం ప్రారంభిస్తామో.. అప్పుడు మాత్రమే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఇన్నిరోజులు మనం ఏమి తప్పు చేశామో తెలిసేలా చేస్తాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకునేలా మనల్ని మోటివేట్ చేస్తాయి. అంతే కానీ.. ఏది పడితే అది ఆలోచిస్తూ.. కూర్చుని.. మనకు ఏమి మంచి జరగట్లేదు.. మనకు మంచి ఎందుకు జరుగుతుందిలే.. అని ఆలోచిస్తూ కూర్చుంటే ఇలానే అవుతుంది. మన ఆలోచనలు బట్టే మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. అంత సులువుగా పరిస్థితుల మీద నిందలు వేసేస్తమా? మన ఏమి ఆలోచిస్తామో.. మనకు అదే రిటర్న్​లో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేయండి. అసలు అవి రానివ్వకుండా లాక్ చేసేశాను అనుకోండి. పాజిటివ్​గా ఆలోచించడం ప్రారంభించండి. అంతా మంచే జరుగుతుంది. కనీసం పాజిటివ్​గా జరగకపోయినా.. మళ్లీ ప్రయత్నిద్దాం.. ఈసారైనా జరుగుతుందిలే అనే నమ్మకాన్ని అది ఇస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం