ఎప్పుడు నెగిటివ్గానేనా..? బోర్ కొట్టదా? ఓసారి పాజిటివ్‌గా ఆలోచించండి..
తాము ఏమి చేసినా.. మంచి జరగదని.. పోని ఎంత మంచి చేసినా చెడే ఎదురవుతుందని కొందరు నిరంతరం ఆలోచిస్తుంటారు. మరికొందరు మనకి మంచి జరగకపోయినా పర్వాలేదు.. వేరే వాళ్లకి మంచి జరగకూడదనే నెగిటివ్ ఆలోచనల్లో ఉంటారు. ఈ విధమైన నెగిటివ్ మైండ్ మంచిది కాదంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు అనేవి.. ఎప్పటికి పాజిటివ్ లైఫ్‌ను ఇవ్వలేవు.
ప్రతికూల మానసిక స్థితిలో ఉన్నవారు.. ప్రపంచం గురించి వక్రీకరించిన దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఇది ప్రతికూల ఆలోచనలను, ప్రతికూల భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది. దానికి తగ్గట్లుగానే.. ప్రతికూల ఫలితాలే వస్తాయి. ఈ నెగిటివ్ ఆలోచనలు విచ్ఛిన్నం కాకపోతే... మన జీవితంలో పాజిటివ్ అనేదే లేకుండా పోతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపిస్తుంది. కొన్నాళ్లకు అది క్లినికల్ డిప్రెషన్‌కు, ఆందోళనకు దారి తీయొచ్చు.
పైగా నెగిటివ్ ఆలోచనలు అనేవి.. మన జీవితానికి అస్సలు మంచివి కావు. ప్రతికూల సమయాల్లోనూ.. పాజిటివ్‌గా ఆలోచించడమనేది మంచి విషయం. దీని ద్వారా మనకు మంచి జరిగే అవకాశముంది. ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనల్లోనే మునిగిపోతే.. జరిగే మంచి కూడా వెనక్కి వెళ్లి పోతుందనే విషయాన్ని గ్రహించాలి. తద్వార ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే మానసిక ఆందోళనలు తప్పనిసరి. అందుకే ఇలా నెగిటివ్‌గా ఆలోచించి బీపీ పెంచుకునే బదులు.. పాజిటివ్‌గా, ప్రశాంతంగా ఉండడం ఉత్తమం. ఈ రోజు కాకపోతే రేపు మంచి జరుగుతుందనే హోప్‌తో ముందుకు వెళ్లిపోవాలి.
ఇది మరోరకం..
ఎదుటివారికి మంచి జరగకూడదనుకునే వారు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరు. ఇదే ఆలోచనతో ఉంటే.. మీ చుట్టూ ఉన్న వారు పైకి ఎదుగుతూ ఉన్నా.. మీరు మాత్రం వారి నాశనం కోరుకుంటూ.. అదే దుర్భరమైన జీవితంలో గడుపుతూ ఉంటారు. కాబట్టి ఎదుటివారిపై శ్రద్ధ వదిలి.. మీ పనులపై దృష్టి పెడితే మీకు మంచి జరిగే అవకాశముంది.
సంబంధిత కథనం