తెలుగు న్యూస్  /  Lifestyle  /  Weather Change Sickness Tips To Prevent Cold, Cough And Other Flu Infections, Home Remedies

Weather Change Sickness । వాతావరణంలో ఆకస్మిక మార్పులు.. ఈ చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం భద్రం!

HT Telugu Desk HT Telugu

17 March 2023, 9:41 IST

    • Weather Change Sickness: వాతావరణం ఒక్కసారిగా మారిపోయినపుడు కొందరి శరీరాలు ఆ మార్పును తట్టుకోలేవు, ఫలితంగా వారు ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ఈ చిట్కాలు పాటించండి.
Weather Change Sickness:
Weather Change Sickness: (unsplash)

Weather Change Sickness:

వాతావరణంలో ఆకస్మిక మార్పులతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. . ప్రధానంగా వాతావరణ మార్పుల వల్ల కలిగే ఒక సమస్య ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు. సాధారణంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, అలర్జీలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వాతావరణ మార్పులకు తమ శరీరం ఎలా స్పందిస్తుందో అనే కొందరిలో ఆందోళన ఉంటుంది. ఒకవైపు H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సాధారణ ఫ్లూ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి.

వేడి వాతావరణం నుంచి ఒక్కసారిగా చల్లదనంగా మారడం వలన చాలా మందికి దగ్గు, జలుబు వస్తుంది. ఈ విషయంలో పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతారు. దీనిని నివారించడానికి చిన్న ప్రయత్నాలు చేయాలి, తద్వారా శరీరం ఈ మార్పుకు అలవాటుపడుతుంది.

దగ్గు, జలుబు ఇతర ఫ్లూ వంటి లక్షణాలను బయటపడేందుకు ఇంటి వద్దే కొన్ని చిట్కాలను పాటించండి. అవేమిటో ఇక్కడ చూడండి.

Tips To Prevent Weather Change Sickness- వాతావరణ మార్పు అనారోగ్య సమస్యల నివారణకు చిట్కాలు

  1. ఆవిరి పీల్చడం చేస్తుండాలి, వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనెను కలిపితే మరింత ఉపశమనం లభిస్తుంది.
  2. అలాగే అల్లం, వెల్లుల్లి, యాలకులు, దాల్చినచెక్క వంటి ఇతర సుగంధాలను ఉడికించి సూప్ చేసుకొని తాగండి.
  3. యాలకులు, దాల్చినచెక్క వేసి టీ కాచుకొని తాగడం లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మ, తేనె కలుపుకొని తాగడం వలన గొంతుకు హాయిదనం కలుగుతుంది.
  4. వెచ్చని గది నుంచి ఆరుబయట ఉన్న చలికి ఆకస్మికంగా గురికాకుండా ఉండండి. మార్నింగ్, ఈవినింగ్ వాక్ అలవాటు చేసుకున్న వారు రొటీన్ మార్చుకోవాల్సి ఉంటుంది.
  5. ఉదయం, సాయంత్రం పూట కాస్త ఆలస్యంగా వెచ్చని స్నానం చేయడం మంచిది.
  6. కూల్ డ్రింక్స్, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు వంటి చల్లని ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. పుల్లని పదార్థాలు, ఊరగాయలు, వేయించిన ఆహారాలు తినడం కూడా అనారోగ్యకరం. మితమైన ఉష్ణోగ్రతతో తయారు చేసిన పౌష్టికాహారం తీసుకోండి.
  7. మీ పరిసరాల్లో ఫ్లూ సోకిన వ్యక్తులు ఉన్నట్లయితే, వారితో సన్నిహితంగా ఉండకుండా దూరాన్ని పాటించండి. తరచుగా మీ చేతులను శుభ్రం చేసుకోండి.
  8. చల్లటి వాతావరణం వలన మీకు దాహం వేయదు, కాబట్టి మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం కోసం గోరువెచ్చని నీరు, టీ లేదా లైమ్ జ్యూసులు తీసుకుంటూ ఉండాలి.
  9. ఇల్లు, ముఖ్యంగా వంటగది, బాత్రూమ్ పరిశుభ్రంగా, క్రిమిసంహారకంగా ఉండేలా చూసుకోండి. ఇంటిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూడండి.
  10. తులసి ఆకులను నమలడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. వాతావరణ మార్పుల సమయంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
  11. నాసికా కుహరాన్ని శుభ్రపరచడానికి, సైనస్ రద్దీని నివారించడానికి, శ్లేష్మం క్లియర్ చేయడానికి ప్రాణాయామం, జలనేతి వంటి యోగా వ్యాయామాలు చేయవచ్చు.
  12. ఫ్లూకి సంబంధించిన టీకాలను సకాలంలో వేయించుకోండి.

పైన పేర్కొన్నవన్నీ సాధారణమైన చర్యలు అయినప్పటికీ, వాతావరణ మార్పుల వలన కలిగే అనారోగ్య సమస్యలను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.