Prevent Frequent Colds | రోజుల తరబడి దగ్గు, జలుబులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి!-ways to prevent frequent cold and coughs naturally ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ways To Prevent Frequent Cold And Coughs Naturally

Prevent Frequent Colds | రోజుల తరబడి దగ్గు, జలుబులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి!

HT Telugu Desk HT Telugu
Jan 18, 2023 01:57 PM IST

Prevent Frequent Cold and Cough: తరచుగా దగ్గు, జలుబులతో ఇబ్బంది పడుతుంటే కొన్ని సంరక్షణ చర్యలు పాటించడం ద్వారా సమస్య నుంచి బయట పడవచ్చు. ఆ చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.

Tips to Prevent Cold and Coughs
Tips to Prevent Cold and Coughs (Unsplash)

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దగ్గు, జలుబులు వంటివి అనుభవించడం సర్వసాధారణం. ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కానప్పటికీ, ఇది ఒకరి నుంచి మరొకరి అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సవాలుతో కూడుకున్నదే. ఫ్లూ కలిగిన వారు లేదా కోవిడ్ వంటి వైరస్ సోకిన వ్యక్తులతో పొరపాటున కరచాలనం చేసినా, ఉపరితలాలను తాకినా ఈ సమస్య మరింత ముదురుతుంది. అంతేకాకుండా జబ్బుపడి రోజంతా మంచాన పడడాన్ని ఎవరూ ఆనందించరు. కొందరికి రోజుల తరబడి దగ్గు కొనసాగుతూ ఉంటుంది, వారు దగ్గేటపుడు లోపలి పక్కటెముకలు బయటకు వచ్చేస్తాయా? అన్నంత అనుభూతిని వ్యక్తం చేస్తారు. జలుబు కారణంగా ముక్కు అరిగిపోయేలా రుమాలుతో రుద్దుతారు. అందువల్ల, మూసుకుపోయిన ముక్కు నుండి ఉపశమనం పొందేందుకు మాత్రలు వేసుకోవడం కంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకొని దగ్గు, జలుబులను నివారించడం ఉత్తమం.

Tips to Prevent Cold and Coughs - దగ్గు, జలుబుల నివారణ చర్యలు

ఈ శీతాకాలంలో దగ్గు, జలుబుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీ ఆరోగ్యం కోసం మీరు తీసుకోవాల్సిన కొన్ని సంరక్షణ చర్యలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా ఉంచుకోండి

కరోనా సమయంలో మనం నేర్చుకున్న గొప్ప విషయాలలో ఒకటి తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవడం. దగ్గు, జలుబును కలిగించే వైరస్‌లు మరొకరి ద్వారా వ్యాప్తి చెందుతాయి, ఇవి మీ చుట్టుపక్కల ఉపరితలాలపై చేరవచ్చు. కాబట్టి ఏదైనా తినేముందు, ముఖాన్ని తాకేముందు మీ చేతులను సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. శానిటైజర్లు ఉపయోగించాలి, మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచువాలి.

ఆవిరి తీసుకోండి

ఈ శీతాకాలంలో దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందడం కోసం మనకు తెలిసిన సాంప్రదాయ వైద్యం ఆవిరి పట్టడం. ముక్కు మూసుకుపోయినపుడు, జలుబు, గొంతు నొప్పు ఉన్నప్పుడు ఈ పద్ధతి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే మీకు దగ్గు, జలుబులు లేకపోయినా వాతవరణం చల్లగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ముఖానికి ఆవిరి పట్టడం చాలా మంచిది, ఇది జలుబు కారకాలను నివారిస్తుంది. శీతాకాలంలో వారానికి ఒకసారైనా ఒక పది నిమిషాల పాటు ఆవిరి తీసుకోండి.

రోజూ ప్రోబయోటిక్స్ తీసుకోండి

పెరుగు, మజ్జిగ, రైతా, యోగర్ట్ వంటి ప్రోబయోటిక్స్ ఆహార పదార్థాలు రోజూ తీసుకోండి. ఈ ప్రోబయోటిక్స్ మీ ప్రేగులలో నివసించే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. గట్‌లోని సూక్ష్మజీవుల ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల సంభవనీయతను తగ్గించడంలో ప్రోబయోటిక్స్ పాత్ర అమోఘమైనది.

శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయండి

జలుబు, దగ్గును నివారించడంలో శ్వాస వ్యాయామాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు వ్యాయామం చేసే సమయంలో బలవంతంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించినప్పుడు, వేడి ఉత్పన్నం అవుతుంది, దీని వలన నాసికా మార్గాలు వెచ్చగా మారి తెరుచుకుంటాయి, ముక్కు దిబ్బడ సమస్యలు ఉండవు.

కొన్ని నిమిషాల సన్ బాత్

మీ రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పని చేయాలంటే విటమిన్ డి అవసరం. శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది. అందువలన అవసరమయ్యే మొత్తంలో విటమిన్ డిని పొందడానికి ప్రతిరోజూ 15 నిమిషాల పాటు ప్రత్యక్ష సూర్యకాంతిని పొందాలి. ఉదయం వేళ మృదువైన ఎండలో ఉండటం వలన మీ రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. జలుబు, దగ్గు వంటివి దూరం అవుతాయి.

ఆరోగ్యకరమైన అలవాట్లు

రోగనిరోధక శక్తిని పెంచే వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి, ఆరోగ్యకరమైన పోషకాలు నిండిన ఆహారం తీసుకోండి, హెర్బల్ టీలు తాగండి, ధూమపానం వదిలివేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం