తెలుగు న్యూస్  /  Lifestyle  /  Toyota Innova Crysta Limited Edition Launched, Check What Is New

Toyota Innova Crysta Limited Edition। సరికొత్తగా ఇన్నోవా క్రిస్టా, ప్రత్యేకతలివే

HT Telugu Desk HT Telugu

04 September 2022, 14:56 IST

    • టొయోటా కంపెనీ ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ కారు (Toyota Innova Crysta) ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరలు రూ. 17.45 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. మిగతా వివరాలు చూడండి.
Toyota Innova Crysta
Toyota Innova Crysta

Toyota Innova Crysta

జపనీస్ వాహన తయారీ సంస్థ టొయోటా తమ 'Innova Crysta' వాహనంలో లిమిటెడ్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఇన్నోవా క్రిస్టా GX పెట్రోల్ మోడల్ ఆధారంగా రూపొందించిన వాహనం. ఎక్స్-షోరూమ్ వద్ద ఈ స్పెషల్ ఎడిషన్ వాహనం ధర, మాన్యువల్ వెర్షన్ కోసం రూ. 17.45 లక్షలు కాగా, ఆటోమేటిక్ వెర్షన్ ధర రూ. 19.02 లక్షలుగా నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు

Bael Fruit: నెలకోసారైనా వెలగపండు తినాల్సిందే, ఇది తింటే ఆ సమస్యలన్నీ దూరం

Oatmeal omelette: బ్రేక్ ఫాస్ట్ కోసం ఇలా ఓట్స్ ఆమ్లెట్ చేసుకోండి, డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉత్తమ అల్పాహారం

Thursday Motivation: పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి, అది మీలో తెలివిని, ధైర్యాన్ని నింపుతుంది

Covishield vaccine: కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల వస్తున్న అరుదైన ప్రాణాంతక సమస్య టిటిఎస్, ఇది రాకుండా ఎలా జాగ్రత్త పడాలి?

ఈ సరికొత్త Toyota Innova Crysta స్పెషల్ ఎడిషన్ వాహనం డిజైన్ పరంగా పాతదానితో ఎలాంటి మార్పులు లేవు, అయితే ఇందులో అదనపు ఫీచర్లను అందిస్తున్నారు. అవి కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందిస్తున్నారు. టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ కారును కొనుగోలు చేసేవారు డీలర్ ద్వారా ఇన్‌స్టాల్ చేసిన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చు. ఇందులో భాగంగా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ అలాగే హెడ్-అప్ డిస్‌ప్లే వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ. 55,000 అదనపు ధరతో అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు వీటికోసం ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు.

పండుగ సీజన్ ఉండటంతో భారతదేశంలో చాలా మంది వాహనాలను కొనుగోలు చేస్తారు. వీరిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ Innova Crysta లిమిటెడ్ ఎడిషన్‌ వాహనంను తీసుకొచ్చింది. మరోవైపు అధిక డిమాండ్ కారణంగా ఇన్నోవా క్రిస్టాలో డీజిల్ వేరియంట్‌ల బుకింగ్‌లను టొయోటా ఇటీవల నిలిపివేసింది. సేల్స్ పడిపోకుండా ఈ స్పెషల్ ఎడిషన్ వాహనం కాపాడుతుందని కంపెనీ భావిస్తోంది. మరి ఈ కారులో ఇంకా ఏమైనా మారాయా? ఇంజన్ సామర్థ్యం ఎంత? ఇతర స్పెసిఫికేషన్లను ఈ కింద పరిశీలించండి.

Toyota Innova Crysta Limited Edition స్పెసిఫికేషన్స్

పైన పేర్కొన్న మూడు అదనపు ఫీచర్లు మినహా Innova Crysta ప్రత్యేక ఎడిషన్ వాహనంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇది దాని ప్రామాణిక GX వేరియంట్ కారులాగే ఉంటుంది.

Innova Crystaలో 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందిస్తున్నారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో అనుసంధానం చేసి ఉంటుంది. ఈ ఇంజన్ 150 PS పవర్ అలాగే 360 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మిగతా అంశాలను పరిశీలిస్తే.. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆరు స్పీకర్ సిస్టమ్‌, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ISOFIX ఎంకరేజ్‌లు, ఫ్రంట్- రియర్ పార్కింగ్ సెన్సార్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఈ పరిమిత ఎడిషన్ అక్టోబర్ చివరి నాటికి స్టోర్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే టొయోటా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్ నుంచు మరో సరికొత్త వాహనాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. Innova Hycross పేరుతో వచ్చే ఈ కారులో పెట్రోల్ వెర్షన్ హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. నవంబర్‌లో ఈ సరికొత్త వాహనం లాంచ్ అవుతోంది.