Toyota Camry Hybrid | సరికొత్త ఫీచర్లతో టొయోటా కామ్రీ హైబ్రిడ్ కారు లాంచ్-toyota camry hybrid 2022 launched with new and updated features ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Toyota Camry Hybrid | సరికొత్త ఫీచర్లతో టొయోటా కామ్రీ హైబ్రిడ్ కారు లాంచ్

Toyota Camry Hybrid | సరికొత్త ఫీచర్లతో టొయోటా కామ్రీ హైబ్రిడ్ కారు లాంచ్

Jan 26, 2022, 04:14 PM IST HT Telugu Desk
Jan 13, 2022, 05:05 PM , IST

  • 2022 టొయోటా కామ్రీ హైబ్రిడ్‌ కారు 2.5 లీటర్‌, ఫోర్‌-సిలిండర్‌ హైబ్రిడ్‌ పెట్రలో ఇంజిన్‌తో వస్తోంది.
  • ఈ కారు బుకింగ్స్‌ ఇప్పటికే ఆన్‌లైన్‌, టొయోటా డీలర్‌షిప్స్‌లో ప్రారంభమైంది.

టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) ఇండియాలో జనవరి 12న అప్‌డేటెడ్‌ వెర్షన్‌ కామ్రీ హైబ్రిడ్‌ కారును లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.41.70 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించింది. ఈ కొత్త కామ్రీ హైబ్రిడ్‌లో ఎక్స్‌టీరియర్‌, క్యాబిన్‌ లేఔట్‌, ఫీచర్‌ లిస్ట్‌లో అనేక అప్‌డేట్స్‌ చేసింది.

(1 / 8)

కొత్త టొయోటా కామ్రీ హైబ్రిడ్‌ కారులో ఫ్రంట్‌ బంపర్‌ డిజైన్‌, గ్రిల్‌, అలాయ్‌ వీల్స్‌ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాయి. ఇవి కారు లుక్కును మరింత అట్రాక్టివ్‌గా మార్చాయి.

(2 / 8)

2022 టొయోటా కామ్రీ హైబ్రిడ్‌ కారు వెనుక భాగం కూడా కొత్త లుక్‌లో కనిపిస్తోంది. బ్లాక్‌ బేస్‌ ఎక్స్‌టెన్షన్‌తో కొత్త ఎల్‌ఈడీ బ్రేక్‌ లైట్స్‌ కారుకు కొత్త అందాన్ని సమకూర్చాయి.

(3 / 8)

ఇక ఈ కొత్త కామ్రీ హైబ్రిడ్‌ కారు డార్క్‌ గ్రే మెటాలిక్‌ బేస్‌తో 18 అంగుళాల అలాయ్‌ వీల్స్‌తో వచ్చింది.

(4 / 8)

ఇక కారు లోపల కామ్రీ హైబ్రిడ్‌ క్యాబిన్‌ కూడా ఫ్రెష్‌ డిజైన్‌తో కనిపిస్తోంది. కొత్తగా మరింత పెద్దదైన 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేలను సపోర్ట్‌ చేస్తుంది. ఇదే కాకుండా 10-వే పవర్‌ అడ్జస్టబుల్‌ డ్రైవర్‌ సీట్‌, ఓఆర్‌వీఎం, టిల్ట్‌-టెలిస్కోపిక్‌ స్టీరింగ్‌ కాలమ్‌ ఉన్నాయి.

(5 / 8)

కారు వెనుకాల సీట్లు రిక్లైనర్‌ ఫీచర్‌తో వచ్చాయి. అంతేకాకుండా వెనుకాల సీట్లో హ్యాండ్‌ రెస్ట్‌పై ఓ టచ్‌ ప్యానెల్‌ ఇచ్చారు. దీని ద్వారా సన్‌షేడ్‌, ఆడియో, ఏసీని కంట్రోల్‌ చేయవచ్చు.

(6 / 8)

కొత్త కామ్రీ హైబ్రిడ్‌ కారులో సేఫ్టీ ఫీచర్లు కూడా పెరిగాయి. ఇందులో 9 ఎస్‌ఆర్‌ఎస్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ ఉన్నాయి. పార్కింగ్‌ అసిస్ట్‌, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటివి కూడా ఉన్నాయి.

(7 / 8)

ఈ కొత్త టొయోటా కామ్రీ హైబ్రిడ్‌ కారును టొయోటా న్యూ గ్లోబల్‌ ఆర్కిటెక్చర్‌లో తయారు చేశారు. దీంతో కారు మరింత దృఢంగా, అదనపు సౌకర్యాలతో, మెరుగైన స్టెబిలిటీతో మార్కెట్‌లోకి వచ్చింది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు