తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Toyota Urban Cruiser Hyryder । భారత మార్కెట్లో టొయోటా కొత్త హైబ్రిడ్ Suv లాంచ్!

Toyota Urban Cruiser Hyryder । భారత మార్కెట్లో టొయోటా కొత్త హైబ్రిడ్ SUV లాంచ్!

HT Telugu Desk HT Telugu

16 August 2022, 22:14 IST

google News
    • టొయోటా ఇండియా సరికొత్త Toyota Urban Cruiser Hyryder వాహనంను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది హైబ్రిడ్ SUV, డిజైన్ పరంగా మారుతి సుజుకి గ్రాండ్ విటారాలాగా ఉంది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.
Toyota Urban Cruiser Hyryder
Toyota Urban Cruiser Hyryder

Toyota Urban Cruiser Hyryder

జపనీస్ ఆటోమొబైల్ మేకర్ టొయోటా తమ కొత్త హైబ్రిడ్ వాహనం 2022 Toyota Urban Cruiser Hyryder ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలోనే ఈ SUVకి సంబంధించి బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ సరికొత్త SUV భారత మార్కెట్లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, వోక్స్‌వ్యాగన్ టైగన్, మహీంద్రా స్కార్పియో-ఎన్‌లకు పోటీగా ఉంటుంది.

ఈరోజు లాంచ్ ఈవెంట్ సందర్భంగా 2022 Toyota Urban Cruiser Hyryder వాహనం వివరాలను టొయోటా ఇండియా ఒక్కొక్కటిగా వెల్లడించింది. ఈ హైబ్రిడ్ SUV మొత్తం నాలుగు వేరియంట్‌లలో (E, S, G , V) లభిస్తుంది. హైబ్రిడ్ టెక్‌తో పెట్రోల్ ఇంజన్‌లతో అందిస్తున్నారు. ఇందులో 1.5-లీటర్ నియో డ్రైవ్ ఇంజన్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌తో పాటు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఆప్షన్ గా కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 105hp శక్తిని, అలాగే 122 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే 59 kW బ్యాటరీతో 141 Nm సామర్థ్యాలను కలిగి ఉంటుంది. హైబ్రిడ్ ఇంజన్ 25 kmpl కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని అందించగలదు, మైల్డ్-హైబ్రిడ్ హైరైడర్ 21kmpl+ సామర్థ్యాన్ని అందించగలదు.దీని ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేశారు లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లో కూడా ఎంచుకోవచ్చు.

డిజైన్, ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్లు

డిజైన్ విషయానికి వస్తే సరికొత్త Toyota Urban Cruiser Hyryder వాహానం మారుతి సుజుకి కాంపాక్ట్ SUV అయిన గ్రాండ్ విటారాను పోలి ఉంది. ఈ రెండు వాహనాల్లో ఫ్రంట్ ఫేసియా ఒకే రకంగా కనిపిస్తుంది. అయితే కొంచెం భిన్నమైన డిజైన్‌తో హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. క్రోమ్ గార్నిష్డ్ బంపర్‌కి దిగువన స్లిమ్ LED DRLలతో వచ్చింది. ప్రామాణికంగా పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుంది.

భద్రతపరంగా Toyota Urban Cruiser Hyryderలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్‌తో యాంటీలాకింగ్ బ్రేక్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, TPMS, EBDతో కూడిన ABS, హిల్ హోల్డ్ కంట్రోల్, వెనుక 3-పాయింట్ సీట్ బెల్ట్, ఆల్ వీల్ డిస్క్‌లను కలిగి ఉంటుంది. బ్రేక్, ఫ్రంట్ సీట్ PT/FL, హిల్ డిసెంట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంటీరియర్‌లో బ్రౌన్ ఇంకా బ్లాక్ కలర్ స్కీమ్‌తో విభిన్నంగా ఉంటుంది. డ్యాష్ బోర్డులో 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది డ్రైవింగ్ కు సంబంధించిన అనేక రకాల సమాచారాన్ని అందిస్తుంది. అలాగే 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జర్, హెడ్-అప్ స్క్రీన్, వాయిస్ కంట్రోల్, రిమోట్ AC ఆన్/ఆఫ్ మొదలైన ఫీచర్లు ఉంటాయి.

అయితే Toyota Urban Cruiser Hyryder వాహనం ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

తదుపరి వ్యాసం