తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Recipe Is Beetroot Idly Here Is The Making Process

Beetroot Idly : బ్రేక్​ఫాస్ట్​కి బీట్​రూట్​ ఇడ్లీ.. ఇలా చేసుకుంటే అదిరిపోతుంది..

15 September 2022, 7:23 IST

    • Beetroot Idly Recipe : బీట్​రూట్​ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ తినేందుకు ఎక్కువగా ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు తినరు. అలాంటి వారికి బీట్​రూట్ తినిపించాలంటే బీట్​రూట్ ఇడ్లీలే మంచి ఆప్షన్. పైగా అవి కలర్​ఫుల్​గా ఉండి.. పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి. 
బీట్​రూట్​ ఇడ్లీ
బీట్​రూట్​ ఇడ్లీ

బీట్​రూట్​ ఇడ్లీ

Beetroot Idly Recipe : బ్రేక్​ఫాస్ట్​ అంటే మొదటి గుర్తొచ్చేది ఇడ్లీ. ఇవి హెల్త్​కి మంచిదని భావిస్తారు. అందుకే జ్వరమొచ్చినా.. ఇంకేదైనా అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఇడ్లీలు తినమని డాక్టర్లు సిఫార్సు చేస్తారు. అయితే ఈ ఇడ్లీలను మరింత ఆరోగ్యంగా తీసుకోవాలంటే.. బీట్​రూట్ ఇడ్లీలు తినాల్సిందే. మరి వీటిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్‌రూట్ ఇడ్లీ చేయడానికి కావలసినవి

* రవ్వ - 1 కప్పు (వేయించినది)

* పెరుగు - 1 కప్పు

* ఉప్పు - రుచికి తగినంత

* బీట్‌రూట్ ప్యూరీ - అర కప్పు

* అల్లం - అర అంగుళం

* పచ్చిమిర్చి - 3

* జీడిపప్పు - 1 స్పూన్

* మినపప్పు - 1 స్పూన్

* కరివేపాకు - 5,6

* ఈనో ఫ్రూట్ సాల్ట్ - 1 టీస్పూన్

తయారీ విధానం

బీట్‌రూట్‌ను, పచ్చిమిర్చి, అల్లాన్ని ఒక జార్​లో వేసి మిక్సీ చేయాలి. అది ప్యూరీలాగా మారేవరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రవ్వ, పెరుగు, ఉప్పు, బీట్‌రూట్ ప్యూరీ వేసి ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలిపి.. పక్కన పెట్టండి.

ఇప్పుడు టెంపరింగ్ పాన్ తీసుకుని అందులో కొంచెం నూనె వేసి వేడి చేయండి. ఆవాలు, మినపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి తాళింపు సిద్ధం చేయండి. ఈ తాళింపును పిండిలో వేసి బాగా కలపండి. దానిలో ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి.. ఇడ్లీ మేకర్​లో ప్లేస్ ఇడ్లీలు వేయండి. స్టవ్ వెలిగించి ఇడ్లీమేకర్​ను దాని మీద ఉంచి 10 నిమిషాలు కుక్ చేయండి. అంతే బీట్‌రూట్ ఇడ్లీలు రెడీ.

టాపిక్