తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Methi Dosa Or Idli : మెంతి దోసె, మెంతి ఇడ్లీ ఈజీగా చేసెయెుచ్చు.. ఆరోగ్యానికి మంచిది

Methi Dosa Or Idli : మెంతి దోసె, మెంతి ఇడ్లీ ఈజీగా చేసెయెుచ్చు.. ఆరోగ్యానికి మంచిది

Anand Sai HT Telugu

30 April 2024, 6:30 IST

    • Methi Dosa Or Idli Recipe : మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో కలిపి ఇడ్లీ లేదా దోసె చేయండి. శరీరానికి ఉపయోగకరం.
మెంతి ఇడ్లీ
మెంతి ఇడ్లీ (Unsplash)

మెంతి ఇడ్లీ

ఇడ్లీ, దోసె అనేది సాధారణంగా చేసుకునే బ్రేక్ ఫాస్ట్. అయితే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు వెరైటీలు కూడా ట్రై చేయాలి. ఆరోగ్యానికి అలా చేస్తేనే మంచిది. అయితే కొత్తగా మెంతి ఇడ్లీ, మెంతి దోసె తయారుచేయండి. కాస్త చేదుగా అనిపించినా.. ఆరోగ్యానికి మాత్రం సూపర్. ముఖ్యంగా దోసెను నెయ్యితో చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. దీనితో చేసిన ఇడ్లీ బాగుంటుంది. దోసెకు పిండిని మెత్తగా రుబ్బాలి, ఇడ్లీకి కూడా అంతే. దోసె పండి రుబ్బేప్పుడు ఇతర పదార్థాలు కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీలను ఎలా తయారు చేయాలో చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

దోసె తయారీ విధానం

2 కప్పుల దోసె పండి, 3 చెంచాల మెంతులు, నీరు, రుచికి సరిపడా ఉప్పు.

దోసె పిండి, మెంతులు విడివిడిగా నానబెట్టాలి. 8 గంటలు నానబెట్టండి. కనీసం 5-6 గంటలు అయినా నానబెట్టాలి. నీళ్లను వడకట్టి మెంతులు, దోసె పిండి కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఉప్పు వేసి కలపాలి.

పాన్ వేడి చేసి, నెయ్యి కాస్త వేసుకోవాలి. తర్వాత దోసె పిండి వేసి గుండ్రంగా చేసి, దానిపై కాస్త నెయ్యి వేస్తే, క్రిస్పీ దోసె రెడీ. మీరు మసాలా దోసెలాగా వేసుకోవచ్చు. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీలోకి మెంతి దోసె బాగుంటుంది.

మెంతి ఇడ్లీ తయారీ విధానం

మెంతి ఇడ్లీ కూడా చేసుకోవచ్చు, 2 చెంచాల మెంతులు తీసుకోవాలి. ఇడ్లీ పిండిని నానబెట్టుకోవాలి. తరవాత ఉప్పు వేసి కలిపి ఉదయాన్నే పులియబెట్టాలి. ఆపై ఈ రెండు కలిపి రుబ్బుకోవాలి. ఇడ్లీ ప్లేటులో వేయాలి. తర్వాత ఉడికించాలి. ఇది సాంబార్, చట్నీలోకి బాగుంటుంది.

ఈ రెసిపీలతో కలిగే ప్రయోజనాలు

ఈ మెంతి దోసె, మెంతి ఇడ్లీ వేసవికి చాలా మంచిది. మెంతి దోసె రుచిగా, శరీరానికి చల్లగా ఉంటుంది. మెంతి దోసె దాహం ఎక్కువగా వేయదు. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెరను అదుపులో ఉంచుకోవడానికి మెంతి దోసె, మెంతి ఇడ్లీ మంచిది.

వేసవిలో ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. ప్రస్తుతం హీట్ వేవ్ సమయం. మెంతి ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెసిపీలు పిత్తా, కఫా సమస్యలను నియంత్రిస్తుంది. మెంతుల్ని నానబెట్టి అలాగే సేవించవచ్చు. మెంతుల్ని నీటిలో వేసి మరిగించి తీసుకోవచ్చు. మెంతులు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.

తదుపరి వ్యాసం