Chanakya Niti Telugu : ఈ పనులు అత్యంత నీచమైనవి.. అస్సలు చేయకూడదు
30 April 2024, 8:00 IST
- Chanakya Niti In Telugu : మనిషి జీవితంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవి చేస్తే స్వర్గం ఉండదని చాణక్య నీతి చెబుతుంది.
చాణక్య నీతి
హిందూ మతంతో సహా అనేక మతాలు పునర్జన్మ భావనను విశ్వసిస్తున్నాయి. దీని ప్రకారం ఒక వ్యక్తి తన పూర్వ జన్మల ఫలితాలను ఈ జన్మలో పొందుతాడు, గత జన్మల ఫలితాలను భవిష్యత్తులో పొందుతాడు. అందువల్ల ఒక మనిషి తన చర్యల గురించి ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చనిపోయిన తర్వాత కూడా బాధపడాల్సి వస్తుంది. సత్కర్మలు చేయడం వల్ల మరుసటి జన్మలో మంచి ఫలితాలను పొందుతాడు.
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో కొన్ని విషయాలు సలహా ఇచ్చాడు. మరణానంతరం స్వర్గానికి వెళ్లాలా లేక నరకానికి వెళ్లాలా అనేది కర్మలను బట్టి నిర్ణయించబడుతుంది. చాణక్య నీతిలో ఈ ప్రస్తావన ఉంది. ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తి నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. చాణక్యుడు చెప్పిన విషయాలను పాటిస్తే జీవితంలో ఆనందంగా ఉండవచ్చు. స్వర్గానికి వెళ్లాలంటే చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..
పెద్దలను బాధపెట్టేవారు
చాణక్యుడు ప్రకారం ఒక దుర్మార్గుడు మరణం తర్వాత నరకానికి వెళ్తాడు. బంధువులను ద్వేషించేవారిని, పెద్దలను అవమానించేవారిని చాణక్యుడు చెడుగా భావించాడు. కర్మల ద్వారా తల్లిదండ్రులను బాధపెట్టే వారు నరకంలో స్థానం పొందుతారు. దుర్మార్గులు, చెడు స్వభావం కలవారు, ఇతరులను హింసించే వారు నరకానికి వెళతారని చాణక్యుడు చెప్పాడు. ఇతరులను బాధపెట్టే వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండడు. ఏదో ఒక రూపంలో బాధ పడాల్సి వస్తుంది.
స్త్రీలను అగౌరవపరిచేవారు
చాణక్యనీతి ప్రకారం స్త్రీలను అగౌరవపరిచేవాడు, ఆడపిల్లలను అసభ్యంగా ప్రవర్తించేవాడు, పేదలను దోపిడీ చేసేవాడు నరకానికి వెళ్తాడు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులను దుర్వినియోగం చేసే లేదా దోపిడీ చేసే వ్యక్తి పాపాత్ముడు. ఇలాంటి పాపపు పనులకు ప్రతిగా జీవితంలోనూ, మరణానంతరమూ చాలా బాధలు పడాల్సి వస్తుందని చాణక్యుడు కూడా చెప్పాడు.
చెడు పనుల ద్వారా
ఒక దుర్మార్గుడు తన మాటల ద్వారా, చెడు పనుల ద్వారా ఎల్లప్పుడూ మానసిక, శారీరక బాధలను కలిగి ఉంటాడు. మనిషి యొక్క ఈ దుర్గుణాలు అతన్ని నరకానికి పంపుతాయని చాణక్యుడు చెప్పాడు. తన ప్రియమైన వారిని బాధపెట్టి, ఇబ్బంది పెట్టే వ్యక్తికి నరకంలో స్థానం ఉంటుంది. అసూయ వారిని లోపల నుండి దహిస్తూనే ఉంటుంది. అలాంటి వ్యక్తి ఎప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడపలేడని కూడా చాణక్యుడు చెప్పాడు.
అత్యాశ ఉన్న వ్యక్తి
చాణక్య నీతి ప్రకారం, అత్యాశగల వ్యక్తిని ఎప్పటికీ ఎవరూ ప్రేమించరు. డబ్బు, ఆస్తి, గౌరవం, స్వార్థం కోసం ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారు మరణానంతరం నరకయాతన అనుభవిస్తారని చాణక్యుడు చెప్పాడు. వారు బతికి ఉన్నప్పుడు తమ స్వలాభాం కోసం ఎంతకైనా దిగజారుతారు. అలాంటివారు జీవితంలో అనేక ఇబ్బందులు చూస్తారు.
ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో అనేక గొప్ప విషయాలు చెప్పాడు. వాటిని పాటిస్తే జీవితంలో ముందుకు వెళ్లవచ్చు. ఇప్పటికీ చాణక్యుడి మాటలను పాటించేవారు ఉన్నారు. జీవితంలో విజయం సాధిస్తారు. చాణక్య నీతిలో డబ్బు, బంధం, ప్రేమ, స్నేహం, చెడు పనులు, మంచి పనులు.. ఇలా అనేక విషయాలను ప్రస్తావించాడు చాణక్యుడు.