Chanakya Niti On Money : డబ్బును మేఘాలతో పోల్చిన చాణక్యుడు.. పాటించాల్సినవి ఇవే-how to earn and spend money chanakya niti compares money with with clouds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti On Money : డబ్బును మేఘాలతో పోల్చిన చాణక్యుడు.. పాటించాల్సినవి ఇవే

Chanakya Niti On Money : డబ్బును మేఘాలతో పోల్చిన చాణక్యుడు.. పాటించాల్సినవి ఇవే

Anand Sai HT Telugu
Mar 16, 2024 08:00 AM IST

Chanakya Niti On Money : డబ్బును చక్కగా ఉయోగించాలంటే దానిపై గౌరవం ఉండాలి. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మేఘాలకు ముడిపెట్టి డబ్బు గురించి వివరించాడు.

చాణక్య నీతి
చాణక్య నీతి

ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యూహకర్త. చాణక్యుని నీతిలో మేఘాలు, డబ్బు యొక్క సంబంధాన్ని చాలా చక్కగా చెప్పాడు. అందుకే చాణక్యుడి సూత్రాలను అనుసరించేవాడు దుఃఖాన్ని జయిస్తాడని అంటారు. ఆచార్య చాణక్యుడు చాలా సంవత్సరాల క్రితం చాణక్య సూత్రాలలో మానవ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పేర్కొన్నాడు. చాణక్యుడి మాటలను ఫాలో అయితే కష్టాలు తేలికగా తొలగిపోతాయి.

డబ్బుపై చాణక్యుడి సూత్రాలు

చాణక్యుడి సూత్రాలను అనుసరించేవారు జీవితంలో ఎప్పుడూ బాధపడరు. చాణక్య సూత్రాలను పాటించడం కష్టంగా ఉండవచ్చు. కానీ మీ జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో డబ్బు సద్వినియోగం గురించి ప్రస్తావించాడు. డబ్బు విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చాణక్య నీతి ఎనిమిదో అధ్యాయంలో వివరించిన ఐదో శ్లోకం చెబుతుంది.

విత్తం దేః గుణాన్వితేషు మోతిమన్యత్ర దే: కథచిత్, ప్రథమం బరినిధేజాలం ఘన్ముఖే మేళోద్యుక్తం సదా, జిబాంస్థవర్జదమంగ్ష సకలసంజీవ భూమాందం, భూయ: పశ్య తదేవ్ కోటిఘోణీతం గచ్ఛన్తం

మేఘాలతో డబ్బును పోల్చిన చాణక్యుడు

పైన చెప్పిన శ్లోకంలో చాణక్యుడు డబ్బు విలువను వివరించాడు. చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకం అనేక విషయాలను తెలుపుతుంది. దీని అర్థం ఏమిటి, మీరు ఎవరికి డబ్బు సహాయం చేయవచ్చు, ఆ డబ్బు నష్టాన్ని మీరు ఎలా భరించవలసి ఉంటుంది.. అనేది ఈ శ్లోకం చెబుతుంది. ధర్మం లేని వారు డబ్బును ఎప్పటికీ ఉపయోగించుకోలేరు అని చాణక్యుడు చెప్పాడు. మేఘాలు సముద్రం నుండి నీటిని తీసుకొని చల్లటి వర్షాన్ని, తాగునీటిని ఇస్తాయి. ఆ నీటితో భూమి జీవిత చక్రం ఎలా నడుస్తుందో ఉదాహరణగా ఆచార్య చాణక్యుడు వివరించాడు. ప్రస్తుతం భూమిపై ఉన్న జంతువులన్నీ నీటి ద్వారా బతుకుతున్నాయి. అదేవిధంగా మనస్సాక్షి ఉన్న వ్యక్తి ఒకరి నుండి డబ్బు తీసుకొని దానిని అభివృద్ధి కోసం ఉపయోగిస్తాడు. ఆ డబ్బుతో ఇతరులకు మేలు చేస్తాడు. వివేకం ఉన్న వ్యక్తి డబ్బును ఎక్కడ నుండి తిరిగి పొందవచ్చో తెలుసుకోవాలి.

సరైన మార్గంలో ఉపయోగించాలి

మేఘాలు భూమి మీద నుంచి నీటిని తీసుకుని.. మళ్లీ భూమీ మీదకే వర్షం రూపంలో పంపిస్తాయి. అదే విధంగా డబ్బు అధికంగా ఉన్నవారి దగ్గర నుంచి తీసుకుని.. లేనివారికి ఇవ్వాలి. అది పని రూపంలో అయినా.. మరే ఇతర రూపంలో అయిన అందించాలి. అప్పుడే జీవిత చక్రం సరిగా నడుస్తుందని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో వివరించాడు. చాణక్యుడు డబ్బు గురించి చెప్పిన ఈ సూత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డబ్బును సరైన మార్గంలో ఉపయోగించేందుకు చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలను పాటించాలి.

ఖర్చు చేసేప్పుడు ఆలోచించాలి

చాణక్యుడి నీతి మాటలు జీవితానికి బాగా ఉపయోగపడతాయి. ఆయన చెప్పిన జీవిత సత్యాలు నేటి సమాజంలో పాటించేవారూ ఇంకా ఉన్నారు. డబ్బును ఎలా ఉపయోగించాలో ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి వివరించాడు. ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే మీరు జీవితంలో ధనవంతులుగా ఉండవచ్చు. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాణక్య నీతి ప్రకారం డబ్బును ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేయకూడదు. సరైన మార్గంలో వాడుకోవాలి. అప్పుడే సంపద మీ దగ్గర ఉంటుంది.

Whats_app_banner