Chanakya Niti Telugu : భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి? చాణక్యుడు ఏం చెప్పాడు?
Chanakya Niti Telugu : భార్యాభర్తల మధ్య వయసు అనేది వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ విషయంపై చాణక్యుడు చాణక్య నీతిలో కొన్ని విషయాలు చెప్పాడు.
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు పేర్కొన్నాడు. భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావించాడు. చాణక్య నీతి ప్రకారం, భార్యాభర్తల మధ్య పెద్ద వయసు వ్యత్యాసం వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? భార్యాభర్తలు కొన్ని విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటారని చాణక్యుడు చెప్పాడు.
విజయవంతమైన జీవనశైలి కోసం చాణక్యుడు కొన్ని సలహాలు ఇచ్చాడు. దీన్ని అనుసరించడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆనందించవచ్చు.
ఆచార్య చాణక్యుడు సంబంధాన్ని బలోపేతం చేయడంలో భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించాడు. వాటిలో ఒకటి భార్యాభర్తల మధ్య వయస్సు వ్యత్యాసం. చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తల మధ్య వయస్సు వ్యత్యాసం వైవాహిక జీవితంలో వారి ఆనందాన్ని ఎలా పాడు చేస్తుందో తెలుసుకోండి..
ఆచార్య చాణక్యుడి ప్రకారం, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి భార్యాభర్తల మధ్య సంబంధం చాలా ముఖ్యమైనది. ఇద్దరి మధ్య పెద్ద వయసు వ్యత్యాసం ఉండటంతో వైవాహిక జీవితాన్ని సర్దుబాటు చేయడంలో సమస్యలు తలెత్తుతాయి.
వృద్ధుడు యువతిని వివాహం చేసుకోకూడదు. అలాంటి వివాహం సరికాదు. ఆ సంబంధం వైవాహిక జీవితానికి విషపూరితం అవుతుంది. అలాంటి వివాహాలు ఎప్పుడూ విజయవంతం కావు. ఈ వాతావరణంలో స్త్రీ పురుషుల వైవాహిక జీవితం నాశనం అవుతుంది.
భార్యాభర్తల మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉంటే.. అలాంటి జీవితం విషపూరితం అవుతుంది. వైవాహిక జీవితం ఎక్కువ రోజులు నిలవదు. భార్యాభర్తల మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండకూడదు.
వైవాహిక జీవితంలో ఆనందం పొందాలంటే ఒకరినొకరు నిరాశపరచకూడదని చాణక్యుడు చెప్పాడు. భార్యాభర్తలు ఈ పవిత్ర సంబంధం గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఒకరినొకరు రక్షించుకోవాలి. భార్యాభర్తలు ఒకరినొకరు దూషించుకుంటే కుటుంబంలో శాంతి పోతుంది. ఇంట్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైన బంధమని, ఈ సంబంధాన్ని కాపాడుకోవడానికి భార్యాభర్తలు ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకోవాలని చాణక్యుడు తెలిపాడు. భార్య లేదా భర్త తమ జీవిత భాగస్వామి అవసరాలను పట్టించుకోకపోతే, జీవితంలో ఆనందం ఉండదు. భార్యాభర్తల మధ్య ప్రేమ, సామరస్యం ఎప్పుడూ ఒకేలా ఉండాలని చాణక్యుడు పేర్కొన్నాడు. అందుకే అన్ని అర్థం చేసుకోవాలంటే.. భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండకూడదు.
ఒకే వయసులో ఉన్నవాళ్ల వారి ఆలోచనా విధానం ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే.. వారు చిన్నప్పటి నుంచి ఒకలాంటి సొసైటీని, ఒకేమార్పులను చూసి ఉంటారు. అప్పుడు అర్థం చేసుకోవడానికి ఎక్కువ పాజిబిలిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీ పేరెంట్స్ ఆలోచనా విధానానికి, మీ మైండ్‌సెట్‌కు చాలా తేడా ఉంటుంది కదా. అందుకే 3-5 సంవత్సరాల గ్యాప్ వరకు ఉంటేనే వివాహ జీవితం బాగుంటుంది.