Chanakya Niti Telugu : చాణక్య నీతి ప్రకారం.. జీవితాన్ని నాశనం చేసే 5 తప్పులివే
Chanakya Niti On Life : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితం గురించి చాలా విషయాలు చెప్పాడు. మనం పాటించే కొన్ని విషయాలు జీవితాన్ని నాశనం చేస్తాయని పేర్కొన్నాడు.
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. జీవితానికి సంబంధించి అనేక విషయాలను తెలిపాడు. జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. అలాగే కొన్ని విషయాలను వదిలేయాలి. చాణక్యుడి ప్రకారం మనిషి ఓడిపోయేందుకు అతడు చేసే చిన్న చిన్న తప్పులే కారణం. అలాంటి తప్పులు మీరు చేయకూడదు. చాణక్యనీతిని ఫాలో అయితే జీవితంలో ఎలా ఉండాలో తెలుస్తుంది.
ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందం, శ్రేయస్సును కావాలనుకుంటారు. ఇందుకోసం రాత్రి పగలు కష్టపడి పనిచేసినా కొన్నిసార్లు మంచి ఫలితాలు రాదు. చాణక్య ప్రకారం మన రోజువారీ జీవితంలో కొన్ని తప్పుల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేం. చాణక్య నీతి శాస్త్రంలో మానవ జీవితంలో జరిగే కొన్ని తప్పులను చెప్పాడు. అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి. విజయానికి అడ్డుగా నిలుస్తాయి. ఆ తప్పులను చేయకూడదు.
లక్ష్యం లేని జీవితం వ్యర్థం
చాణక్యుడు ప్రకారం ప్రతి మనిషి జీవితంలో నిర్దిష్ట లక్ష్యాలతో ఉండాలి. జీవితంలో ఒక లక్ష్యం ఉంటేనే మనిషి ముందుకు సాగుతాడు. అనుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కష్టపడాలి. లక్ష్యం లేని వ్యక్తి శక్తి, సమయం రెండింటినీ వృథా చేస్తాడు. లక్ష్యం లేకుండా జీవించడం జీవితంలో అతిపెద్ద తప్పు.
చెడు అలవాట్లతో నాశనం
చెడు అలవాట్లకు బానిసలైతే ఎవరి జీవితమైనా నాశనం అవుతుంది. అబద్ధాలు చెప్పడం, డ్రగ్స్ తీసుకోవడం, డబ్బు వృథా చేయడం వంటి అలవాట్లు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి. చెడు అలవాట్లను అనుసరించకూడదు. చెడు అలవాట్లు ఉన్నవారితో సహవాసం చేయకపోవడమే ఉత్తమం.
దానం కూడా ముఖ్యమే
సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి డబ్బు సంపాదించడం చాలా అవసరం. కానీ కొన్నిసార్లు పేద, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయడం మానవుడిగా మన కర్తవ్యం. నిత్య అవసరాలు సరిగా తీర్చుకోలేని వారు మన చుట్టూ ఎందరో ఉన్నారు. వారికి రెండు పూటలా సరైన తిండి దొరకడం లేదు. ఈ వ్యక్తులకు సహాయం చేయడం వారి ఆశీర్వాదాలను మాత్రమే కాకుండా సంతృప్తిని కూడా తెస్తుంది. దానం చేయకపోతే కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కువ రోజులు మీతో ఉండదు.
సమయం చాలా విలువైనది
చాణక్య నీతి ప్రకారం, సమయానికి విలువ ఇవ్వని వారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ వ్యక్తులు లక్ష్మిదేవత అనుగ్రహాన్ని పొందలేరు. వారి జీవితమంతా పేదరికంలో గడుపుతారు. ఎందుకంటే సమయంలో పోతే తిరిగి రాదు. సరిగా వినియోగించుకోవాలి
స్త్రీలను, పెద్దలను గౌరవించాలి
స్త్రీలను, పెద్దలను అగౌరవపరిచే వారి ఇంట్లో లక్ష్మి దేవి నివసించదు. తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించే వారు, ఇంట్లో గొడవలు సృష్టించే వారు కూడా ఎప్పుడూ డబ్బులేక ఇబ్బంది పడతారు. ఆనందం, శాంతి, సంపద వారి జీవితంలో ముగుస్తుంది.
అందుకే చాణక్య నీతి ప్రకారం పైన చెప్పిన విషయాలను ఫాలో అవ్వండి. జీవితంలో ఆనందంగా ఉంటారు. చాణక్యుడి సూత్రాలు పాటించేవారు ఇప్పటికీ ఉన్నారు. జీవితంలో విజయం సాధించేందుకు చాణక్యుడి చెప్పిన విషయాల గురించి ఒక్కసారి ఆలోచించండి.