Chanakya Niti In Telugu : చాణక్య నీతి ప్రకారం.. ఇతరులను ఆకర్శించడం ఎలా?-how to attract someone according to chanakya niti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti In Telugu : చాణక్య నీతి ప్రకారం.. ఇతరులను ఆకర్శించడం ఎలా?

Chanakya Niti In Telugu : చాణక్య నీతి ప్రకారం.. ఇతరులను ఆకర్శించడం ఎలా?

Anand Sai HT Telugu
Jan 02, 2024 07:58 AM IST

Chankya Niti Telugu : చాణక్య నీతి ప్రకారం కొందరిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే కొన్ని పనులు చేయాలి. వాటిని మన బుట్టలో వేసుకోవాలి. అందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.

చాణక్య నీతి
చాణక్య నీతి

ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒక్కో విధంగా ఒక్కో విధంగా ఉంటాడు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన వేలిముద్ర ఉన్నట్లే, ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. కానీ మానవ జీవితం ప్రతి ఒక్కరూ ఇంకొకరిపై ఆధారపడి జీవించేలా ఉంటుంది. అయితే చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇతరులను వీలైనంతగా ఆకట్టుకోవడానికి ఏం చేయాలో చెప్పాడు. ఇతరులను మెప్పించాలంటే ముందుగా వారి బలహీనతలను తెలుసుకోవాలి. వివిధ రకాల వ్యక్తులను ఎలా ఆకర్షించాలో చూద్దాం..

ఆచార్య చాణక్యుడు ప్రకారం మన చుట్టూ చాలా మంది ప్రజలు ఉంటారు. కొందరైతే అత్యాశపరులు, మరికొందరు ధైర్యవంతులు, కొందరు తెలివిగలవారు, మరికొందరు మూర్ఖులు. అందరినీ ఆకట్టుకునే మార్గం కచ్చితంగా ఉంటుంది.

అత్యాశగల వ్యక్తులను ఆకర్షించడం చాలా సులభమైన పని. ఎందుకంటే వారి ఏకైక లక్ష్యం డబ్బు. అత్యాశగల వ్యక్తులను మీ దారిలోకి తీసుకురావడానికి ఏకైక మార్గం వారికి అవసరమైన దానికంటే ఎక్కువ చెల్లించాలి.

మూర్ఖుడిని ఆకట్టుకోవడానికి మీరు చేయాల్సిందల్లా వారి గర్వానికి మర్యాద ఇవ్వడం. వాళ్లు చెప్పే మాటలు మీరు అంగీకరించాల్సిందే. తాము ఎల్లప్పుడూ సరైనవని భావించే వ్యక్తులు మీ దారిలోకి సులభంగా వస్తారు. మూర్ఖులను కవ్వించే మరో ఆయుధం ముఖస్తుతి. ప్రశంసల ద్వారా మీరు వారి నుండి మీకు కావలసినది పొందవచ్చు.

బుద్ధిమంతులను మెప్పించడం మూర్ఖులను మెప్పించడం అంత తేలికైన పని కాదు. మీరు తెలివైన వ్యక్తులను ఆకర్షించాలనుకుంటే మీరు వారితో నిజం మాత్రమే మాట్లాడాలి. సత్యాన్ని మించిన శక్తి లేదు.

ధనానికి ప్రాముఖ్యతనిచ్చే వారికి తగినంత డబ్బుతో వాటిని కొనాలి. వారు మీకు బానిసలు అవుతారు. అప్పుడు మీరు వారిని మీ దారిలోకి తెచ్చుకోవచ్చు.

ఇలా చాణక్యుడి ఇతరులను ఎలా ఆకర్శించాలో వివరించాడు. జీవితం గురించి మరికొన్ని విషయాలు చెప్పాడు చాణక్యుడు అవేంటో చూద్దాం..

మనిషి తన పుట్టుకతో కాకుండా అతని కర్మల ద్వారా గుర్తించబడతాడు. విద్య ఒకరికి మంచి స్నేహితుడు. అందం, ఐశ్వర్యం వంటి అన్ని అర్హతలను వెనక్కి నెట్టే శక్తి విద్యకు ఉంది. అతి నిజాయితీ ఎప్పుడూ ప్రమాదకరమే. చాణక్యుడి ప్రకారం ఎప్పుడూ అతి నిజాయితీగా ఉండకూడదు. ఎందుకంటే సరిగా ఉన్న చెట్టును మొదట నరికివేస్తారు.

భయం మీకు దగ్గరగా వచ్చినప్పుడు దాడి చేయడం, నాశనం చేయడం అలవాటు చేసుకోండి. మీరు ఏదైనా చేయడం ప్రారంభించినప్పుడు వైఫల్యానికి భయపడవద్దు. ఎందుకంటే నిర్భయంగా పనిచేసేవారు నిజంగా సంతోషంగా ఉంటారు. సంతృప్తి వంటి ఆనందాన్ని ఏదీ ఇవ్వదు, దురాశ కంటే ప్రాణాంతకమైన వ్యాధి లేదు. కరుణ కంటే మెరుగైన నాణ్యత లేదు.