చాణక్య నీతి: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మార్గాలు.. తప్పక ఆచరించండి-chanakya neeti this practical principles of ethics for everyone ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  చాణక్య నీతి: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మార్గాలు.. తప్పక ఆచరించండి

చాణక్య నీతి: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మార్గాలు.. తప్పక ఆచరించండి

Rekulapally Saichand HT Telugu
Feb 28, 2022 04:18 PM IST

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవన నైపుణ్యాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. చాణక్యుడి ప్రకారం, ఈ సూత్రాలు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవి. కాబట్టి జీవితంలో వీటిని ఎప్పుడూ గౌరవించాలని ఆయన నమ్మారు.

chanakya
chanakya

ఆచార్య చాణక్య, గొప్ప ఆర్థికవేత్త, సాయుధ వ్యూహకర్త. ప‌లు నైతిక విలువ‌ల‌ను బోధించి ప్రజలకు మంచి మార్గదర్శకత్వాన్ని చూపించాడు. అతని విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. సమాజంపై ఆయనకు లోతైనా అవగాహన ఉంది. చంద్ర గుప్త మౌర్యుడు మగధకు చక్రవర్తి కావడంలో చాణక్యుడు కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన నీతిశాస్త్రం ప్రకారం.. సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే జీవితంలో కొన్ని సూత్రాలు, క్రమశిక్షణ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో చాణక్యుడి విధానాలను అవలంబిస్తే, వారి జీవితం సంతోషంగా, ప్రశాంతంగా గడిచిపోతుందని వివరించారు. 

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో నీతి సూత్రాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఈ సూత్రాలు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవని, కాబట్టి జీవితంలో వాటిని ఎప్పుడూ గౌరవించాలని ఆయన నమ్మారు.

దైవస్వరూపం మాతృమూర్తి

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. తల్లిది ప్రపంచంలోనే అత్యున్నత స్థానం.  గురువు, దేవుడు కంటే కూడా మాత‌ృమూర్తియే గొప్పదని, కాబట్టి ఎల్లప్పుడూ వారిని గౌరవించాలని తెలిపారు. తల్లిని గౌరవించే వ్యక్తికి  జీవితంలో అన్ని కోరికలు నెరవేరుతాయని ఆయన విశ్వసించారు.

అన్నదానం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం లేనిదే ఏ ప్రాణి జీవించలేదు. అన్నదానం గొప్ప పుణ్యమని చాణుక్యుడు బలంగా నమ్మారు. ఆకలితో ఉండేవారికి భోజనం పెట్టడం వల్ల మనిషి ధన్యుడవుతాడని, వారికి దైవానుగ్రహం ఉంటుందని గొప్ప సందేశాన్ని మానవాళికి తెలియజేశారు. కావున సదా దానధర్మము, పరోపకారము చేయాలని ఆయన సూచించారు.

గాయత్రీ మంత్రం

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రం గాయత్రీ మంత్రమని ఆచార్య చాణక్య చెప్పారు. దీన్ని పఠించడం ద్వారా వ్యక్తి తన జీవితంలో బలం, దీర్ఘాయువు, అపారమైన సంపదను పొందుతాడని ఆయన విశ్వసించారు.

దైవ ప్రార్థన

చాణక్యుడు ఏకాదశి తిథిని అత్యంత పవిత్రమైందిగా భావించారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల మనిషి పాపాలు, దుఃఖాలు తొలిగిపోతాయని తెలిపారు. ఈ రోజు శ్రీహరి ఆరాధించడం వల్ల అనేక పుణ్య ఫలాలు కలుగుతాయని బోధించారు. ఏడాదికి దాదాపు 24 ఏకాదశులు వస్తాయి. అయితే కార్తీకమాసంలో వచ్చే దేవుత్తని ఏకాదశి అన్నింటికంటే ముఖ్యమైంది.

కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి

మ‌నిషికి కష్టాలు సహజం. జీవితంలో త‌న కలలను సాకారం చేసుకోవాలంటే ఆ కష్టాలను ధైర్యంగా ఎదర్కోవాలి. తెలివిగా పరిష్కరించుకోవాలి. అప్పుడే తన కలలను నెరవేర్చుకోగలుగుతాడు. ధైర్యంగా లేకుంటే లక్ష్యసాధన అంత సులువు కాదని చాణ‌క్యుడు తెలిపారు.

 

WhatsApp channel

సంబంధిత కథనం