తెలుగు న్యూస్  /  Lifestyle  /  Summer Skin Care Tips Face Packs To Remove Painful Acne Details Inside

Summer Face Packs : ఎండతో ముఖంపై మొటిమలు వస్తున్నాయా? ఈ ఫేస్ ప్యాక్స్ వేసుకోండి

HT Telugu Desk HT Telugu

15 April 2023, 9:30 IST

    • Summer Skin Care Tips : కొంతమంది వేసవిలో మొటిమల సమస్యను ఎదుర్కొంటారు. అధిక వేడి కారణంగా చెమటలు ఎక్కువగా వస్తాయి. దీని కారణంగా, చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. మరోవైపు దుమ్ము చర్మంపై స్థిరపడుతుంది. దీంతో మెుటిమల సమస్యలు వస్తాయి. దీన్ని నివారించడానికి ఫేస్ ప్యాక్‌లను అప్లై చేయండి.
సమ్మర్ ఫేస్ ప్యాక్స్
సమ్మర్ ఫేస్ ప్యాక్స్

సమ్మర్ ఫేస్ ప్యాక్స్

వేసవి(Summer) వస్తే చాలు.. మీకు మొటిమలు వస్తున్నాయా? దీన్ని నివారించడానికి ఎలాంటి ఫేస్ ప్యాక్స్(Face Packs) వేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? వేసవిలో మొటిమలను(Acne) వదిలించుకోవడానికి మీకు సహాయపడే కొన్ని ఫేస్ ప్యాక్‌లు కింద ఉన్నాయి. వేసవి కాలంలో వీటిని తరచుగా అప్లై చేయడం వల్ల మొటిమలు రాకుండా నివారించవచ్చు.

1. పసుపు, తేనె ఫేస్ ప్యాక్

ఒక గిన్నెలో పసుపు(Turmeric) పొడిని తీసుకుని అందులో తేనె(Honey) కలిపి పేస్ట్ లా చేయాలి. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌లో కొంత పెరుగును జోడిస్తే.. మొటిమలు పోతాయి. డెడ్ స్కిన్(Dead Skin) సెల్స్ పూర్తిగా తొలగిపోతాయి.

2. అలోవెరా ఫేస్ ప్యాక్

మీ ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? అయితే అలోవెరాతో ఫేస్ ప్యాక్(Aloe vera Face Pack) వేసుకోవాలి. స్వచ్ఛమైన అలోవెరా జెల్‌ని తీసుకుని మొటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ముఖంపై ఉండే మొటిమలు మాయమవుతాయి.

3. పసుపు, వేప ఫేస్ ప్యాక్

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి పసుపును పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఈ పసుపులో వేప ఆకులను కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖంపై ఉండే మొటిమలు త్వరగా మాయమవుతాయి. కొన్ని వేప ఆకులను తీసుకుని వాటిని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. తర్వాత అందులో 1/2 టీస్పూన్ పసుపు వేసి కలిపి పేస్ట్ లా చేయాలి. తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. ఎగ్ వైట్, టీ-ట్రీ ఆయిల్ ఫేస్ ప్యాక్

మీ ముఖంపై ఎక్కువగా మొటిమలు ఏర్పడుతున్నాయా? అప్పుడు గుడ్డులోని తెల్లసొన(Egg White), టీ-ట్రీ ఆయిల్ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేయండి. ఒక గిన్నెలో ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని అందులో ఒక చుక్క టీ-ట్రీ ఆయిల్ వేసి బాగా కలపాలి. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.

5. శెనగ పిండి, తేనె, పెరుగు ఫేస్ ప్యాక్

శెనగ పిండి పురాతన కాలం నుండి చర్మ సౌందర్యాన్ని(Skin Beauty) మెరుగుపరచడానికి, నిర్వహించడానికి ఉపయోగించే మరొక పదార్థం. శెనగ పిండి అనేక చర్మ సమస్యలను(Skin Problems) నయం చేస్తుంది. ఇది ముఖ్యంగా మొటిమలు, మొటిమల మచ్చలను నియంత్రిస్తుంది. శెనగ పిండితో తేనె, పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ శెనగ పిండి, తేనె, పెరుగు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు నాననివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి 2 సార్లు ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించండి.