తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Simple Exercises To Relief Pains : మెడ, భుజం, వెన్ను నొప్పులను.. కూర్చొనే దూరం చేసుకోండి..

Simple Exercises to Relief Pains : మెడ, భుజం, వెన్ను నొప్పులను.. కూర్చొనే దూరం చేసుకోండి..

25 November 2022, 10:07 IST

    • Surviving Desk Job : మీరు గంటల తరబడి డెస్క్​లో కూర్చొని పని చేస్తున్నారా? అయితే మిమ్మల్ని మెడనొప్పి, వెన్నునొప్పి, భుజం దగ్గర పైన్, స్ట్రెస్ పలకరించే ఉంటాయి. ఇవి ఒక్కోసారి మిమ్మల్ని పని మీద ఫోకస్ కూడా చేయనివ్వవు. మీరు ఈ సమస్యను ఎదుర్కొంటుంటే.. డెస్క్ దగ్గరే ఉంటూ.. ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు తెలుసా.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 
నొప్పులకు ఇలా చెక్ పెట్టండి..
నొప్పులకు ఇలా చెక్ పెట్టండి..

నొప్పులకు ఇలా చెక్ పెట్టండి..

Simple Exercises to Relief Pains : మీరు డెస్క్ ఉద్యోగం చేస్తున్నారంటే.. మీరు ఒంటరి కాదు అని అర్థం. ఎందుకంటే మీతో మెడ నొప్పి, భుజం నొప్పి, వెన్ను నొప్పి, స్ట్రెస్ ఇలా చాలానే తోడుగా ఉంటాయి. వీటిని పట్టించుకోకపోతే సమస్య చాలా తీవ్రమవుతుంది. అలా అని ఉదయాన్నే లేచి వ్యాయామం చేసే సమయం మీకు దొరకకపోవచ్చు. అయితే మీరు మీ డెస్క్​లోనే ఉంటూ.. కొన్ని చిన్న వ్యాయామాలు చేస్తూ.. ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటే నమ్ముతారా? అయితే ఈ సమస్యలను దూరం చేసే ఐదు సాధారణ స్ట్రెచ్‌లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

కండరాల ఒత్తిడికై..

'స్కై క్యాచర్' అనేది ఎక్కడైనా మీరు చేయడానికి సులభమైన వ్యాయామం. కుర్చీలో కూర్చుని.. మీరు దీన్ని చేయడం చాలా సులభం. దీనికోసం మీరు చేయాల్సిందల్లా.. మీ రెండు చేతుల వేళ్లను ఇంటర్‌లాక్ చేసి.. చేతులను పూర్తిగా తెరిచి. వాటిని వీలైనంత వరకు పైకి, పైకప్పు వైపునకు చాచి 10 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉంచండి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేయండి.

మెడ నొప్పికై..

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే అత్యంత సాధారణ సమస్యలలో మెడ నొప్పి ఒకటి. మీరు దీనిగురించి సఫర్ అవుతున్నారా? అయితే దీని గురించి మీరు ఇక చింతించనవసరం లేదు. మీ పని ప్రదేశంలోనే సాధారణ స్ట్రెచ్‌లతో దీనిని నివారించవచ్చు.

దీనికోసం మీరు కుర్చీలో మీరు నిటారుగా కూర్చొండి. వీపుని స్ట్రైట్​గా ఉండేలా చూసుకోండి. నెమ్మదిగా మీ ఎడమ చెవిని మీ ఎడమ భుజానికి ఆన్చడానికి ప్రయత్నించండి. ఇలాగే కుడివైపు చేయండి. ఇలా ప్రత్యామ్నాయ వైపుతో పునరావృతం చేయండి. మీకు నచ్చినన్ని సార్లు పునరావృత్తులు చేయండి. ఇది మీకు మెడనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

భుజం నొప్పికై..

డెస్క్​ దగ్గర కూర్చుని చేసే పనిలో ముందుగా వచ్చేది భుజం నొప్పి. ఇది మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే దీనిని కూడా కొన్ని సింపుల్ వ్యాయాలతో దూరం చేసుకోవచ్చు అంటున్నారు. అయితే దీనికోసం మొదట నిటారుగా చూడాలి. ఆపై మీ మెడను ఒకవైపు తిప్పి.. వీలైనంత వరకు మీ భుజంపై చూడాలి. అలాగే మరోవైపు చేయండి. దీర్ఘకాలంలో మీ భుజాన్ని మంచి స్థితిలో ఉంచడానికి ప్రయత్నించండి. ఎక్కువ సార్లు ఈ వ్యాయామాన్ని పునరావృత్తం చేయండి.

ఒత్తిడి నుంచి ఉపశమనానికై..

మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు.. మీ కుడి చేతిని వీలైనంత ఎక్కువగా పైకి లేపండి. అదే సమయంలో మీ ఎడమ కాలును అది వెళ్ళేంత వరకు చాచి గాలిలో ఉంచండి. ఇప్పుడు మీ పైకెత్తిన.. అంటే మీ కుడి చేతిని కిందకి తీసుకురండి. దానితో మీ ఎడమ పాదాన్ని తాకడానికి ప్రయత్నించండి. ఇది ఆరోగ్యకరమైన వ్యాయామం. రెండు వైపులా 8-10 పునరావృత్తులు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వీపు, భుజాలలో నొప్పికై..

మీ కుర్చీలో నేరుగా కూర్చోండి. మీ రెండు భుజాలను మీకు వీలైనంత ఎత్తుకు ఉంచి.. కొన్ని సెకన్ల పాటు పట్టుకుని ఆపై వాటిని వదలండి. వాటిని తిరిగి వాటి ప్రారంభ స్థితికి తీసుకురండి. కొన్ని పునరావృత్తులు చేయండి. ఈ సాగతీత మీ భుజాలు, మెడ, వీపు నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ స్ట్రెచ్‌లన్నీ సహజంగానే పనిలో మీ ఉత్పాదకతను మెరుగుపరుస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.