తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Diabetes । మధుమేహంను అదుపు చేసే అద్భుతమైన యోగా ఆసనాలు ఇవిగో!

Yoga for Diabetes । మధుమేహంను అదుపు చేసే అద్భుతమైన యోగా ఆసనాలు ఇవిగో!

Manda Vikas HT Telugu

22 November 2022, 19:12 IST

google News
    • Yoga for Diabetes: చాలా మందిని పట్టిపీడిస్తున్న సమస్య మధుమేహం. ఈ భూతాన్ని అదుపు చేయాలంటే కొన్ని యోగా ఆసనాలు శక్తివంతంగా పనిచేస్తాయి. డయాబెటీస్ కోసం ఎలాంటి యోగా థెరపీ ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
Yoga for Diabetes
Yoga for Diabetes (Pixabay)

Yoga for Diabetes

ఒకప్పుడు షుగర్ వ్యాధి ఉందంటే అది ఎవరో చాలా పెద్ద వయసు వారై ఉంటారు అని భావించే వాళ్లం. కానీ ఇప్పుడు 20 ఏళ్ళు, 30 ఏళ్లు ఉన్నవారికి కూడా మధుమేహం వ్యాధి సాధారణమైపోయింది. అన్నీ తినాల్సిన వయసులో కూడా, కఠినమైన ఆహార నియమాలకు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి. స్వీట్స్ తినలేరు, అన్నం, చపాతీలు తినలేరు, మటన్ లాంటి ఎర్రమాంసం తినలేరు, ప్రకృతి సిద్ధంగా లభించే తాజా పండ్లు తినాలన్నా ఎన్నో షరతులు, మరెన్నో నిబంధనలు. డయాబెటీస్ ఒక్కసారి అటాక్ అయ్యిందంటే, దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. దీనికి చికిత్స తీసుకోవడం, ఆహార నియంత్రణలు పాటించడం కంటే నివారణ ఎంతో మేలు.

నిరంతరమైన ఒత్తిడి, తీవ్రమైన పని షెడ్యూల్‌లు, వేళకు తినకపోవడం, పేలవమైన జీవనశైలి ఇవన్నీ మధుమేహాన్ని రారమ్మని ఆహ్వానం పలుకుతాయి. మధుమేహం సమస్య ఉన్నప్పుడు మరింత తీవ్రమవకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. వేళకు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ, ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా మీ దినచర్యలో ఒక భాగం అయి ఉండాలి.

డయాబెటీస్ నియంత్రణకు యోగా థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. వివిధ రకాల యోగా ఆసనాలు వేయడం ద్వారా మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం, గరిష్ట ఇన్సులిన్ స్థాయిని ఎడమవైపుకి మార్చడం, ఇన్సులిన్-టు-గ్లూకోజ్ నిష్పత్తిని సాధారణీకరించడం ద్వారా శరీరంలోని ఇన్సులిన్ గతిశాస్త్రాన్ని మెరుగుపరిచేందుకు యోగా, ధ్యానం ఇతర మైండ్ థెరపీలు ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి మీ ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడంతో పాటు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Yoga for Diabetes- మధుమేహం నియంత్రణకు యోగా ఆసనాలు

మధుమేహం నియంత్రణకు ఉపయోగపడే కొన్ని యోగా ఆసనాలు, యోగ ముద్రలు, థెరపీలు ఏం ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

భుజంగాసనం- Cobra Pose

ఈ ఆసనం డయాబెటిక్ సమస్య ఉన్నవారిలో వెన్నెముక ఎక్స్‌టెన్సర్‌లు, క్వాడ్రిసెప్స్ కండరాలు, ట్రైసెప్స్ లను సక్రియం చేస్తుంది. ఇది మీ కండరాల బలాన్ని పెంచుతుంది, చివరికి మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఈ ఆసనం మీ శరీరానికి ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. అలాగే శ్వాసకోశ విధులు, జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.

ధనురాసనం- Bow Pose

దీనిని విల్లు భంగిమ ) అని కూడా అంటారు. ఈ భంగిమ వెనుక, ఉదర కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడం, మధుమేహం నిర్వహణ, వెన్నుపూస, శరీర భంగిమను సర్దుబాటు చేయడంతో పాటు జీర్ణ సమస్యలు, ఛాతీ సమస్యలు లేకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

పశ్చిమోత్తనాసనం- Seated Forward Bend

ఇన్సులిన్ ఉత్పత్తికి బాధ్యత వహించే ప్యాంక్రియాస్ వంటి ఉదర అవయవాలను ఉత్తేజపరచడంలో పశ్చిమోత్తనాసనం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వెన్నెముక కదలిక, ఫ్లెక్సిబులిటీకి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే మనస్సుకు ప్రశాంతతను చేకూర్చి ఆందోళనను కూడా తగ్గిస్తుంది.

విపరీత కరణి- Legs Up The Wall Pose

విపరిత కరణి ముద్ర మీ పాదాలకు విశ్రాంతిని ఇవ్వడానికి సహాయపడుతుంది. కాళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ భంగిమ మీ మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. క్రమం తప్పకుండా ఈ భంగిమను అభ్యాసం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో, మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

సూర్య నమస్కారాలు- Surya Namasakar

మీ హృదయ స్పందన రేటును నియంత్రించడానికి, మొత్తం శరీరాన్ని సాగదీయడానికి సూర్య నమస్కారాలు ఒక అద్భుతమైన మార్గం. ఎలాంటి యోగాసనం వేసే ముందు, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా వార్మప్ లభించినట్లు అవుతుంది. సూర్య నమస్కారం రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది, శరీరాన్ని నిఠారుగా చేస్తుంది. రక్త ప్రసరణను నియంత్రించి, శరీరంలో ఇన్సులిన్ స్థాయిల నిర్వహణలో సహాయపడుతుంది.

తదుపరి వ్యాసం